మంచి పిల్లలు
19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.
15. నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.
7. ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును.
20. పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.
39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
1. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. 2. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. 3. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. 4. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.
2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,
3. అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.
29. యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.
7. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లిపోయెననియు ఏశావు తెలిసికొనినప్పుడు,
30. నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను.
1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.
9. మీరు త్వరగా నా తండ్రియొద్దకు వెళ్లి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నాయొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు;
11. ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటివారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.
12. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపువారినందరిని వారివారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.
1. జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.
17. నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును
6. కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాటలాడసాగెను నేను పిన్నవయస్సు గలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువుచేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు.
7. వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని;
9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?
3. మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
4. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.
వచనాలు అందుబాటులో లేవు.
ఇస్సాకు
6. దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తనచేతితో నిప్పును కత్తిని పట్టుకొనిపోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా 7. ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱపిల్ల ఏది అని అడుగగా 8. అబ్రాహాము నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱపిల్లను చూచుకొనునని చెప్పెను. 9. ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను. 10. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా
జోసెఫ్
9. మీరు త్వరగా నా తండ్రియొద్దకు వెళ్లి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నాయొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు;
29. యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.
యెఫ్తా కుమార్తె
34. యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలు దేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేగాని ఆడుసంతానమేగాని లేదు.
36. ఆమెనా తండ్రీ, యెహోవాకు మాట యిచ్చి యుంటివా? నీ నోటినుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము; యెహోవా నీ శత్రువులైన అమ్మోనీ యులమీద పగతీర్చుకొని యున్నాడని అతనితో ననెను.
శాంసన్
24. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.
శామ్యూల్
19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.
ఒబాదియా
12. అయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును, అప్పుడు
యోషీయా
3. తన యేలుబడియందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై యుండగానే అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనినవాడై, పండ్రెండవయేట ఉన్నత స్థలములను దేవతాస్తంభములను పడగొట్టి, చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి, యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను.
ఎస్తేర్
20. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక యుండెను.
ఉద్యోగం
4. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండినయెడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను.
డేవిడ్
20. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి.
5. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.
డేనియల్
6. యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి.
జాన్ ది బాప్టిస్ట్
80. శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను.
ఆలయంలో పిల్లలు
15. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలువేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి
16. వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి
తిమోతి
15. నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.