అంశాల జాబితాకు వెనుకకు

శీతకాలము

కీర్తనలు 74:17

17. భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.

ఆదికాండము 8:22

22. భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.

సామెతలు 20:4

4. విత్తులువేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.

యోహాను 10:22

22. ఆలయప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను.

వచనాలు అందుబాటులో లేవు.

ప్రయాణాలు

మత్తయి 24:20

20. అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.

2తిమోతి 4:21

21. శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.

నౌకాయానం

అపోస్తలులకార్యములు 27:9

9. చాలకాలమైన తరువాత ఉపవాసదినము కూడ అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై యుండెను.

అపోస్తలులకార్యములు 27:12

12. మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకుచేరి అక్కడ శీతకాలము గడపవలెనని యెక్కువమంది ఆలోచన చెప్పిరి. అది నైఋతి వాయవ్యదిక్కుల తట్టుననున్న క్రేతురేవైయున్నది.

అపోస్తలులకార్యములు 28:11

11. మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడపిన అశ్వినీ చిహ్నముగల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి

యిర్మియా 36:22

22. తొమ్మిదవ మాసమున రాజు శీతకాలపు నగరులో కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను.

ఆమోసు 3:15

15. చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు.

పరమగీతము 2:11

11. నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.