అంశాల జాబితాకు వెనుకకు

బరువులు

నిర్గమకాండము 30:24

24. నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులములును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని

2సమూయేలు 14:26

26. తన తల వెండ్రుకలు భారముగా నున్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను; కత్తిరించునప్పుడెల్ల వాటి యెత్తు రాజు తూనికనుబట్టి రెండువందల తులములాయెను.

యోబు 31:6

6. నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసికొనునట్లు

యెషయా 40:12

12. తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?

వచనాలు అందుబాటులో లేవు.

Gerah

నిర్గమకాండము 30:13

13. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.

యెహెజ్కేలు 45:12

12. తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.

బెకా లేదా హాఫ్ షెకెల్

ఆదికాండము 24:22

22. ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమెచేతులకు పది తులముల ఎత్తు గల రెండు బంగారు కడియములను తీసి

షెకెల్

నిర్గమకాండము 30:13

13. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.

యెహెజ్కేలు 45:12

12. తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.

Dram

నెహెమ్యా 7:70

70. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.

నెహెమ్యా 7:71

71. మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తులముల వెండిని వేసిరి.

మానేహ్ లేదా పౌండ్

నెహెమ్యా 7:71

71. మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తులముల వెండిని వేసిరి.

యెహెజ్కేలు 45:12

12. తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.

ప్రతిభ

2సమూయేలు 12:30

30. మరియు అతడు పట్టణములోనుండి బహు విస్తారమైన దోపుసొమ్ము పట్టుకొని పోయెను.

ప్రకటన 16:21

21. అయిదేసి మణుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశమునుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.

ఆదికాండము 23:16

16. అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగువందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.

ఆదికాండము 43:21

21. అయితే మేము దిగినచోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు, ఇదిగో మామా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనె మూతిలోనుండెను. అవిచేతపట్టుకొని వచ్చితివిు.

యిర్మియా 32:9

9. నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమును కొని, పదియేడు తులముల వెండి తూచి ఆతనికిచ్చితిని.

నిర్గమకాండము 37:24

24. దానిని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను.

1దినవృత్తాంతములు 28:14

14. మరియు ఆ యా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తు ప్రకారము బంగారమును, ఆ యా సేవా క్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తు ప్రకారము వెండిని దావీదు అతనికప్పగించెను.

లేవీయకాండము 26:26

26. నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తిపొందరు.

యెహెజ్కేలు 4:10

10. నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళ వేళకు తినవలెను,

యెహెజ్కేలు 4:16

16. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయమొందుదురు.

వచనాలు అందుబాటులో లేవు.

వివిధ రకాలను కలిగి ఉండటం నిషిద్ధం

ద్వితియోపదేశాకాండము 25:13

13. హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూనికెరాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.

ద్వితియోపదేశాకాండము 25:14

14. హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు.

అన్యాయం చేయడం నిషిద్ధం

లేవీయకాండము 19:35

35. తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.

లేవీయకాండము 19:36

36. న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.

తరచుగా ఉపయోగించే అన్యాయం

మీకా 6:11

11. తప్పు త్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?

వచనాలు అందుబాటులో లేవు.

పాపాలు

హెబ్రీయులకు 12:1

1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున

మూలకాలపై విధించిన ఆంక్షలు

యోబు 28:25

25. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు

(బరువైనది)) సాధువులకు కేటాయించిన మహిమ

2కొరిందీయులకు 4:17

17. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.