యుద్దము
2. వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెల రాజుతోను యుద్ధము చేసిరి.
1. మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?
8. ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.
వచనాలు అందుబాటులో లేవు.
తరచుగా ఆర్డర్ చేయబడింది
16. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను.
1. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి.
2. తరువాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా
1. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్నుచేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్నుమించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత
2. నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింపకూడదు,
1. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను; యెహోవా మాట వినుము 2. సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తులోనుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరి గదా. 3. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను.
తన ప్రజలకు కళలను బోధించాడు
35. నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును.
తన ప్రజలను బలపరుస్తాడు
7. మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడెదరు.
8. మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.
విజయాన్ని ఇస్తుంది
3. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.
33. మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతముచేసి
3. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మనచేతికి అప్పగించెను; అతనికి శేషమేమియు లేకుండ అతనిని హతము చేసితివిు.
10. చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొనిపోవువరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడుసొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి.
31. యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము.
ఆగిపోవడానికి కారణాలు
9. ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.
ఆనందించే వారిని చెల్లాచెదురు చేస్తుంది
30. రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడలవంటి జనములును లొంగి, వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు.
3. అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబీయా నాలుగు లక్షలమంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను; యరొబామును ఎనిమిది లక్షలమంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను.
9. కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను.
14. మీ భార్యలును మీపిల్లలును మీ ఆస్తియు యొర్దాను అవతల మోషే మీకిచ్చిన యీ దేశమున నివసింపవలెనుగాని, పరాక్రమ వంతులును శూరులునైన మీరందరు యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా
11. అప్పుడు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన ఆరువందలమంది యుద్ధాయుధములు కట్టు కొని అక్కడనుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి.
వచనాలు అందుబాటులో లేవు.
సంప్రదింపులు
31. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా?
6. వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము
గొప్ప ప్రిపరేషన్
9. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడి రావలెను.
పుకార్లు
19. నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా?
6. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.
1. సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను.
22. అదియు గాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి.
22. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడువరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి.
13. ఆసాయును అతనితో కూడనున్న వారును గెరారువరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి.
6. రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువది వేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టిగతి పట్టెను.
వచనాలు అందుబాటులో లేవు.
కరువు
19. ఈ రెండు అపాయములు నీకు సంభవించెను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను, నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు.
15. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమునుబట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధప్రవచనములు ప్రకటించు ప్రవక్తలనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గమువలనను క్షామమువలనను లయమగుదురు.
10. మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలుపెక్కెను.
అంటువ్యాధులు
13. బబులోను రాజునకు దాసులుకానొల్లని జనులవిషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులుచేతనైనను నీవును నీ ప్రజలును చావనేల?
8. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి.
క్రూరత్వం
21. వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గ బలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలులేనివారై విధవరాండ్రగుదురు గాక, వారి పురుషులు మరణహతులగుదురు గాక, వారి యౌవనులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.
11. శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. 12. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు. 13. యౌవనులు తిరుగటిరాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి. 14. పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి యౌవనులు సంగీతము మానిరి.
వినాశనం
7. మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను.
14. కాబట్టి యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా
8. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారములయొద్దకు వచ్చెను ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు.
వచనాలు అందుబాటులో లేవు.
ఇందులో నిపుణులు
33. జెబూలూనీయులలో సకలవిధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగినవారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపులేకుండ యుద్ధము చేయగలవారును ఏబదివేలమంది.
35. దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది యెనిమిదివేల ఆరు వందల మంది.
36. ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది.
8. రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు.
తరచూ నిమగ్నమైవుండేవారు (యెహోషువ అధ్యాయాలు 6 నుండి 11 వరకు చూడండి)
30. వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
7. అబీయాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగియుండెను.
16. వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను.
వచనాలు అందుబాటులో లేవు.
చావుతో మన పోటీ
8. గాలి విసరకుండ చేయుటకు గాలిమీద ఎవరికిని అధికారములేదు; మరణదినము ఎవరికిని వశముకాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు; దౌష్ట్యము దాని ననుసరించువారిని తప్పింపదు.
సాధువులు తమ రక్షణ శత్రువులతో పోటీ పడటం
23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.
3. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీరప్రకారము యుద్ధము చేయము.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
18. నా కుమారుడువైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.
యాంటిక్రిస్ట్ మరియు చర్చి మధ్య పోటీ
7. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును.
4. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి.
7. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆ యా భాషలు మాటలాడువారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను.
దుష్టుల దుర్మార్గం
21. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.