దేవుని యూక ప్రభుత్వము
4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నాయొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. 5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. 6. సమస్త భూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా
7. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు.
వచనాలు అందుబాటులో లేవు.
విమోచన హక్కు
6. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములోనుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి,
7. మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనైయుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు.
23. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములోనుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది.
3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.
నిబందన హక్కు
17. యెహోవాయే నీకు దేవుడైయున్నాడనియు, నీవు ఆయన మార్గములయందు నడిచి, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి, ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట యిచ్చితివి. 18. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమైయుండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువనియు, 19. తాను సృజించిన సమస్త జనములకంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను.
వచనాలు అందుబాటులో లేవు.
చట్టాలను అమలు చేయడం
వచనాలు అందుబాటులో లేవు.
వచనాలు అందుబాటులో లేవు.
దేశ ఉద్యమాలకు దిశానిర్దేశం చేయడం
36. మేఘము మందిరము మీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి.
37. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.
17. ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి. 18. యెహోవా నోటి మాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి. యెహోవా నోటి మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి. 19. ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి. 20. మేఘము కొన్ని దినములు మందిరముమీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటి మాటచొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాటచొప్పుననే ప్రయాణము చేసిరి. 21. ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచినయెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణముచేసిరి. 22. ఆ మేఘము రెండుదినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవుచేసి మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. 23. యెహోవా మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పున వారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞననుసరించి నడిచిరి.
యుద్ధాన్ని ప్రకటించడం
14. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము 15. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి 16. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను.
1. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి.
2. తరువాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా
2. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనుచూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను.
3. మీరందరు యుద్ధసన్న ద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగ వలెను.
1. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను భయపడకుము, జడియకుము, యుద్ధసన్నధ్ధులైన వారినంద రిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీచేతికప్పగించు చున్నాను.
సివిల్ అధికారుల నియామకం
10. కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.
18. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతనిమీద నీ చెయ్యియుంచి
20. ఇశ్రాయేలీయుల సర్వసమాజము అతని మాట వినునట్లు అతనిమీద నీ ఘనతలో కొంత ఉంచుము.
మతాధికారుల నియామకం
1. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలోనుండి నీయొద్దకు పిలిపింపుము.
12. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి 13. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను. 14. మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి 15. వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండటం
8. మోషే నిలువుడి; మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసికొందునని వారితో అనెను. 9. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము 10. మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అపవిత్రుడైనను, దూరప్రయాణము చేయుచుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను. 11. వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను.
34. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి.
35. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను.
5. అప్పుడు మోషే వారికొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా 6. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. 7. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనముచేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. 8. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడులేక మృతిబొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. 9. వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. 10. వానికి అన్నదమ్ములు లేనియెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. 11. వాని తండ్రికి అన్నదమ్ములు లేనియెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను; వాడు దాని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ.
దయ యొక్క అధికారాన్ని ఉపయోగించడం
20. యెహోవా నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను.
18. మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపములవలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి, మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. 19. ఏలయనగా మిమ్ము నశింపజేయవలెనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. 20. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతనిమీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని
కబ్జాకు గురైన భూముల పంపిణీ
1. యెహోషువ బహుదినములు గడచిన వృద్ధుడుకాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెనునీవు బహు దినములు గడచిన వృద్ధుడవు. స్వాధీనపరచుకొనుటకు అతివిస్తారమైన దేశము ఇంక మిగిలియున్నది. 2. మిగిలిన దేశము ఏదనగా, ఫిలిష్తీయుల ప్రదేశములన్నియు, గెషూరీ యుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని 3. కనానీయులవని యెంచబడిన ఉత్తరదిక్కున ఎక్రోనీ యుల సరిహద్దువరకును ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారులకు చేరిన గాజీయులయొక్కయు అష్డోదీయుల యొక్కయు అష్కెలోనీయులయొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయులయొక్కయు దేశమును 4. దక్షిణదిక్కున ఆవీయుల దేశమును కనానీయుల దేశ మంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దువరకును 5. గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండదిగువ నున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవుమార్గ మువరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది. 6. మన్యపు నివా సుల నందరిని సీదోనీయులనందరిని నేను ఇశ్రాయేలీయుల యెదుటనుండి వెళ్లగొట్టెదను. కావున నేను నీ కాజ్ఞా పించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను. 7. తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచి పెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు
ఖచ్చితమైన నివాళి
4. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజముతో ఇట్లనెను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా 5. మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగుచేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, 6. నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ, 7. ప్రదీపమునకు తైలము, 8. అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్యధూపమునకును సుగంధ సంభారములు, 9. ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొనిరావలెను. 10. మరియు వివేక హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను. 11. అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకఱ్ఱలు దాని స్తంభములు దాని దిమ్మలు. 12. మందసము దాని మోతకఱ్ఱలు, కరుణాపీఠము కప్పు తెర, 13. బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు, 14. వెలుగు కొఱకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు, దీపములకు తైలము 15. ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమున ద్వారమునకు తెర. 16. దహనబలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట 17. ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర 18. మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు 19. పరిశుద్ధస్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నవియే అనెను. 20. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటనుండి వెడలిపోయెను. 21. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పనికొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రములకొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. 22. స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. 23. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి యెవరియొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. 24. వెండిగాని యిత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవనియొద్దనుండెనో వాడు దాని తెచ్చెను. 25. మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి. 26. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి. 27. ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను 28. సుగంధ ద్రవ్యమును, దీపమునకును అభిషేకతైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. 29. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటికొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.
30. భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.
16. ఏటికి మూడు మారులు, అనగా పొంగనిరొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.
1. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు 2. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలోనుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసికొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి 3. ఆ దినములలోనుండు యాజకునియొద్దకు పోయి యెహోవా మన పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. 4. యాజకుడు ఆ గంపను నీచేతిలోనుండి తీసికొని నీ దేవుడైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా
8. నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.
11. నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు.
12. నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు.
15. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను.
16. నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.
17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యౌవనులు కారణమైరి, గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను.