అంశాల జాబితాకు వెనుకకు

అడవి గాడిద

యోబు 39:6

6. నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.

యెషయా 32:14

14. నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును

దానియేలు 5:21

21. అప్పుడతడు మానవులయొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సు గలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపుమంచుచేత తడిసిన శరీరము గలవాడాయెను.

యోబు 39:8

8. పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.

యోబు 6:5

5. అడవిగాడిద గడ్డిచూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేతచూచి రంకెవేయునా?

యిర్మియా 14:6

6. అడవి గాడిదలును చెట్లులేని మెట్టలమీద నిలువబడి నక్కలవలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి.

వచనాలు అందుబాటులో లేవు.

స్వేచ్ఛపై అభిమానం

యోబు 39:5

5. అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?

లొంగని

యోబు 11:12

12. అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు.

అసాంఘికత

హోషేయ 8:9

9. అడవి గార్దభము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయులయొద్దకు పోయిరి; ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను.

యోబు 39:7

7. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.

కీర్తనలు 104:10

10. ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును.

కీర్తనలు 104:11

11. అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును. వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును.

వచనాలు అందుబాటులో లేవు.

సహజ మానవుని అసమర్థత

యోబు 11:12

12. అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు.

పాపాన్వేషణలో దుష్టులు

యోబు 24:5

5. అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును

విగ్రహాల పట్ల ప్రేమలో ఇజ్రాయెల్

యిర్మియా 2:23

23. నేను అపవిత్రత నొందినదానను కాను, బయలు దేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు,

యిర్మియా 2:24

24. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగలవాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసియుండదు, దాని మాసములో అది కనబడును.

అస్సిరియన్ శక్తి

హోషేయ 8:9

9. అడవి గార్దభము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయులయొద్దకు పోయిరి; ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను.

ఇస్మాయిలీయులు (హీబ్రూ)

ఆదికాండము 16:12

12. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరిచేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా