అంశాల జాబితాకు వెనుకకు

హింస

కీర్తనలు 69:26

26. నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.

యోహాను 5:16

16. ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.

యెషయా 50:6

6. కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు

యెషయా 53:7

7. అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

మార్కు 10:30

30. ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

లూకా 21:12

12. ఇవన్నియు జరుగకమునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధిపతులయొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.

యోహాను 15:20

20. దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల మీ మాటకూడా గైకొందురు

యిర్మియా 15:15

15. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించువారికి నాకొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసికొనుము.

జెకర్యా 2:8

8. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.

అపోస్తలులకార్యములు 9:4

4. అప్పుడతడు నేలమీద పడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.

అపోస్తలులకార్యములు 9:5

5. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును;

2తిమోతి 3:12

12. క్రీస్తుయేసు నందు సద్భక్తితో బ్రదకనుద్దేశించు వారందరు హింస పొందుదురు.

వచనాలు అందుబాటులో లేవు.

భగవంతుడు మరియు క్రీస్తు యొక్క అజ్ఞానం

యోహాను 16:3

3. వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు.

దేవునికి, క్రీస్తుకు ద్వేషం

యోహాను 15:20

20. దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల మీ మాటకూడా గైకొందురు

యోహాను 15:24

24. ఎవడును చేయని క్రియలు నేను వారిమధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.

సువార్త పట్ల ద్వేషం

మత్తయి 13:21

21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును.

గర్వం

కీర్తనలు 10:2

2. దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక

తప్పు ఉత్సాహం

అపోస్తలులకార్యములు 13:50

50. గాని యూదులు భక్తిమర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.

అపోస్తలులకార్యములు 26:9-11

9. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని; 10. యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని; 11. అనేక పర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని

మత్తయి 26:52

52. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.

గలతీయులకు 4:29

29. అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మనుబట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది.

గలతీయులకు 5:11

11. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా?

అపోస్తలులకార్యములు 22:4

4. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని.

2కొరిందీయులకు 4:9

9. తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.

దానియేలు 3:25

25. అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.

దానియేలు 3:28

28. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.

2కొరిందీయులకు 1:10

10. ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థన చేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.

2తిమోతి 3:11

11. అంతియొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను

రోమీయులకు 8:35

35. క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?

మత్తయి 2:13

13. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.

మత్తయి 10:23

23. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 12:14

14. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.

మత్తయి 12:15

15. యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహు జనులాయనను వెంబడింపగా

వచనాలు అందుబాటులో లేవు.

తమను తాము దేవునికి అంకితం చేసుకోండి

1పేతురు 4:19

19. కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.

సహనాన్ని ప్రదర్శించండి

1కొరిందీయులకు 4:12

12. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింపబడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము;

ఆనందించు

మత్తయి 5:12

12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

1పేతురు 4:13

13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.

దేవుణ్ణి మహిమపరచు

1పేతురు 4:16

16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

విముక్తి కోసం ప్రార్థించండి

కీర్తనలు 7:1

1. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను నన్ను తరుమువారి చేతిలోనుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా

కీర్తనలు 119:86

86. నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయుము.

బాధపెట్టేవారి కోసం ప్రార్థించండి

మత్తయి 5:44

44. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

ఆశీర్వాదాన్ని తిరిగి ఇవ్వండి

రోమీయులకు 12:14

14. మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.

1కొరిందీయులకు 15:19

19. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరికంటె దౌర్భాగ్యులమై యుందుము.

1కొరిందీయులకు 15:32

32. మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.

హెబ్రీయులకు 10:34

34. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.

హెబ్రీయులకు 10:35

35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.

మత్తయి 5:10

10. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.

లూకా 6:22

22. మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు.

2దెస్సలోనీకయులకు 3:2

2. మేము మూర్ఖులైన దుష్టమనుష్యులచేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మాకొరకు ప్రార్థించుడి; విశ్వాసము అందరికి లేదు.

మత్తయి 4:17

17. అప్పటినుండి యేసు పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను.

గలతీయులకు 6:12

12. శరీర విషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువవిషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు

వచనాలు అందుబాటులో లేవు.

వీటికి బానిసయ్యాడు

కీర్తనలు 10:2

2. దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక

కీర్తనలు 69:26

26. నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.

యాక్టివ్ ఇన్

కీర్తనలు 143:3

3. శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలముక్రిందట చనిపోయిన వారితోపాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు.

విలాపవాక్యములు 4:19

19. మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజులకన్న వడిగలవారు పర్వతములమీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మాకొరకు పొంచియుందురు.

ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

కీర్తనలు 71:11

11. దేవుడు వానిని విడిచెను తప్పించువారెవరును లేరు వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు.

దాని విజయం పట్ల సంతోషం

కీర్తనలు 13:4

4. నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.

ప్రకటన 11:10

10. ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.

శిక్ష దేనికి

కీర్తనలు 7:13

13. వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు

2దెస్సలోనీకయులకు 1:6

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

సచిత్ర

మత్తయి 21:33-39

33. మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను. 34. పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొనివచ్చుటకు ఆ కాపులయొద్దకు తన దాసులనంపగా 35. ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరియొకనిమీద రాళ్లు రువ్విరి. 36. మరల అతడు మునుపటికంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. 37. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారియొద్దకు పంపెను. 38. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని 39. అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.

యొక్క స్ఫూర్తి ఉదాహరణ

వచనాలు అందుబాటులో లేవు.

ఫారో &c

నిర్గమకాండము 1:8-14

8. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏలనారంభించెను. 9. అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది. 10. వారు విస్తరింపకుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడు కూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను. 11. కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టిపనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి. 12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయులయెడల అసహ్యపడిరి. 13. ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి; 14. వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.

సౌల్

1సమూయేలు 26:18

18. నా యేలినవాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నావలన ఏ కీడు నీకు సంభవించును?

యెజెబెల్

1రాజులు 19:2

2. యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక.

జెడెకియా &c

యిర్మియా 38:4-6

4. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. 5. అందుకు రాజైన సిద్కియా అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా 6. వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.

కల్డియన్లు

దానియేలు 3:8-30

8. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి 9. రాజగు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవి చేసిరి రాజు చిరకాలము జీవించును గాక. 10. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి; ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను విపంచికను సుంఫోనీయను సకలవిధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. 11. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. 12. రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. 13. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి. 14. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? 15. బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన యెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నాచేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు? 16. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ, యిందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలెనన్న చింత మాకు లేదు. 17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను 18. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము. 19. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను. 20. మరియు తన సైన్యములో నుండు బలిష్ఠులలో కొందరిని పిలువ నంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా 21. వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. 22. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి. 23. షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మనుష్యులు బంధింపబడినవారై వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో పడగా 24. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచి మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితివిుగదా యని తన మంత్రుల నడిగెను. వారు రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. 25. అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. 26. అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి. 27. అధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. 28. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. 29. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములోగాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను. 30. అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను.

పరిసయ్యులు

మత్తయి 12:14

14. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.

యూదులు

యోహాను 5:16

16. ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.

1దెస్సలోనీకయులకు 2:15

15. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి,

హేరోదు

అపోస్తలులకార్యములు 12:1

1. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని

అన్యజనులు

అపోస్తలులకార్యములు 14:5

5. మరియు అన్యజనులును యూదులును తమ అధికారులతో కలిసి వారిమీద పడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలెనని యుండిరి.

పాల్

ఫిలిప్పీయులకు 3:6

6. ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.

1తిమోతి 1:13

13. నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసమువలన చేసితిని గనుక కనికరింపబడితిని.

ఉదాహరణ యొక్క బాధ

వచనాలు అందుబాటులో లేవు.

మీకయ్య

1రాజులు 22:27

27. బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను.

డేవిడ్

కీర్తనలు 119:161

161. (షీన్‌) అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది.

యిర్మీయా

యిర్మియా 32:2

2. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడివేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,

డేనియల్

దానియేలు 6:5-17

5. అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. 6. కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి రాజగు దర్యావేషూ, చిరంజీవివై యుందువుగాక. 7. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినముల వరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవునియొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, యీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి 8. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవి చేసిరి. 9. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. 10. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి యుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. 11. ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి 12. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమునుబట్టి రాజా, ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము; ఎవరును దాని రద్దుపరచజాలరనెను. 13. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో నున్న ఆ దానియేలు, నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. 14. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసికొని, సూర్యుడస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. 15. ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజా, రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసికొనవలెననిరి. 16. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. 17. వారు ఒక రాయి తీసికొనివచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియు దానియేలునుగూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి.

పీటర్ &c

అపోస్తలులకార్యములు 4:3

3. వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.

అపొస్తలులు

అపోస్తలులకార్యములు 5:18

18. అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.

ప్రవక్తలు

అపోస్తలులకార్యములు 7:52

52. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.

సంఘము

అపోస్తలులకార్యములు 8:1

1. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.

పాల్ మరియు బర్నబాస్

అపోస్తలులకార్యములు 13:50

50. గాని యూదులు భక్తిమర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.

పౌలు మరియు శీలాస్

అపోస్తలులకార్యములు 16:23

23. వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికాజ్ఞాపించిరి.

హెబ్రీయులు

హెబ్రీయులకు 10:33

33. ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడి పడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభవించినవారితో పాలివారలైతిరి.

పాతకాలపు సాధువులు

హెబ్రీయులకు 11:36

36. మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి.