అంశాల జాబితాకు వెనుకకు

ఆషేరు గోత్రము

ఆదికాండము 30:12

12. లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా

ఆదికాండము 30:13

13. లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.

ఆదికాండము 49:20

20. ఆషేరు నొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.

ద్వితియోపదేశాకాండము 33:24

24. ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును.

ద్వితియోపదేశాకాండము 33:25

25. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.

సంఖ్యాకాండము 1:40

40. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

సంఖ్యాకాండము 1:41

41. ఆషేరు గోత్రములో లెక్కింపబడినవారు నలువది యొకవేయి ఐదు వందలమంది యైరి.

వచనాలు అందుబాటులో లేవు.

వ్యక్తుల సంఖ్యను లెక్కించడానికి

సంఖ్యాకాండము 1:13

13. ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు

భూమిని గూఢచర్యం చేయడానికి

సంఖ్యాకాండము 13:13

13. ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;

భూమిని విభజించడం

సంఖ్యాకాండము 34:27

27. ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని.

సంఖ్యాకాండము 10:25

25. దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుకనుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి

సంఖ్యాకాండము 10:26

26. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి.

సంఖ్యాకాండము 2:25

25. దాను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ఉత్తరదిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 2:27

27. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 7:72-77

72. పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు. 73. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని 74. ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని 75. దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును 76. ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను 77. సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము.

సంఖ్యాకాండము 26:44-47

44. ఆషేరు పుత్రుల వంశములలో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు; 45. బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు; 46. ఆషేరు కుమార్తె పేరు శెరహు. 47. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబది మూడువేల నాలుగువందలమంది.

సంఖ్యాకాండము 26:47

47. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబది మూడువేల నాలుగువందలమంది.

ద్వితియోపదేశాకాండము 27:13

13. రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను.

యెహోషువ 19:24-31

24. అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను. 25. వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు 26. అలమ్మేలెకు అమాదు మిషె యలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి 27. తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు 28. ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. 29. అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను. 30. ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు. 31. వాటి పల్లెలతో కూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.

యెహోషువ 19:29

29. అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.

న్యాయాధిపతులు 5:17

17. గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను దానీయులు ఓడలదగ్గర ఏల నిలిచిరి? ఆషేరీయులు సముద్రతీరమున తమ అఖాతములయొద్ద ఏల నిలిచిరి?

న్యాయాధిపతులు 1:31

31. ఆషే రీయులు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్జీబువారిని హెల్బావారిని అఫెకువారిని రెహోబు వారిని

న్యాయాధిపతులు 1:32

32. ఆషేరీయులు దేశనివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షె మెషు వారిని బేతనాతువారిని వెళ్లగొట్టలేదు గాని

న్యాయాధిపతులు 5:17

17. గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను దానీయులు ఓడలదగ్గర ఏల నిలిచిరి? ఆషేరీయులు సముద్రతీరమున తమ అఖాతములయొద్ద ఏల నిలిచిరి?

న్యాయాధిపతులు 6:35

35. అతడు మనష్షీ యులందరియొద్దకు దూతలను పంపగా వారును కూడు కొని అతనియొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు జెబూలూను నఫ్తాలి గోత్రములవారియొద్దకు దూతలను పంపగా వారును కూడినవారిని ఎదుర్కొనుటకు వచ్చిరి.

న్యాయాధిపతులు 7:23

23. నఫ్తాలి గోత్రములోనుండియు, ఆషేరు గోత్రములోనుండియు, మనష్షే గోత్రమంతటిలోనుండియు పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి.

1దినవృత్తాంతములు 12:36

36. ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది.

1రాజులు 4:16

16. ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.

2దినవృత్తాంతములు 30:11

11. అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.

1దినవృత్తాంతములు 7:30-40

30. ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి. 31. బెరీయా కుమారులు హెబెరు మల్కీయేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి. 32. హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను. 33. యప్లేటు కుమారులెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు. 34. షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము. 35. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు. 36. జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా 37. బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర. 38. ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా. 39. ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా. 40. ఆషేరు సంతతివారైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలును ప్రఖ్యాతినొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునైయుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు.

లూకా 2:36

36. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై,