అంశాల జాబితాకు వెనుకకు

చిమ్మెట

మత్తయి 6:19

19. భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.

యాకోబు 5:2

2. మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.

యోబు 4:19

19. జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

వచనాలు అందుబాటులో లేవు.

తన తీర్పులను అమలు చేయడంలో దేవుని

హోషేయ 5:12

12. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను యూదావారికి వత్సపురుగు వలెను నేనుందును.

(వస్త్రం తినడం) దేవుని తీర్పులు

యెషయా 50:9

9. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.

యెషయా 51:8

8. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును బొద్దీక గొఱ్ఱబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును.

(తీవ్రమైన తీర్పులు ఎదుర్కొన్నవారు తినే దుస్తులు,)

యోబు 13:28

28. మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివాని చుట్టు గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.

(వస్త్రాలతో ఇల్లు కట్టుకోవడం) ప్రాపంచిక వస్తువులను అందించడంలో మనిషి మూర్ఖత్వం

యోబు 27:18

18. పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు.