మోయాబీయులు
37. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.
వచనాలు అందుబాటులో లేవు.
లోతు పిల్లలు
9. మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
కెమోష్ ప్రజలు
29. మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను.
46. మోయాబు శిరస్సును, సందడిచేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబూ, నీకు శ్రమ కెమోషుజనులు నశించియున్నారు నీ కుమారులు చెరపట్టబడిరి చెరపట్టబడినవారిలో నీ కుమార్తెలున్నారు.
9. మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
13. అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు.
9. మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. 10. పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నతదేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడినవారు. 11. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి.
28. హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.
30. వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడుచేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు.
1. మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును 2. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడియున్నది 3. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు వారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయుదురు. 4. హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.
21. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును 22. నెబోకును బేత్‌దిబ్లాతయీమునకును కిర్యతాయిమునకును బేత్గామూలునకును 23. బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు 24. మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడియున్నది.
7. అప్పుడు బిలాము ఉపమానరీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకు తూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్ను రప్పించి రమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.
9. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకులేచి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా
వచనాలు అందుబాటులో లేవు.
గర్వంగా, అహంకారంగా
6. మోయాబీయులు బహు గర్వముగలవారని మేము వినియున్నాము వారి గర్వమునుగూర్చియు వారి అహంకార గర్వక్రోధములనుగూర్చియు వినియున్నాము. వారు వదరుట వ్యర్థము.
29. మోయోబీయుల గర్వమునుగూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు
విగ్రహారాధన
7. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.
మూఢనమ్మకం
3. వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.
9. కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి.
ధనవంతులు మరియు ఆత్మవిశ్వాసం
7. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషు దేవత చెరలోనికిపోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.
సుభిక్షంగా మరియు సుఖంగా ఉంటుంది
11. మోయాబు తన బాల్యమునుండి నెమ్మదినొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.
శక్తివంతమైన యుద్ధవీరులు
14. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు?
26. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకుమునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను.
17. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపంపీ నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడునునేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివసించిరి.
18. తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా.
3. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి.
వచనాలు అందుబాటులో లేవు.
వచనాలు అందుబాటులో లేవు.
వచనాలు అందుబాటులో లేవు.
విగ్రహారాధనకు ఆకర్షితులయ్యారు
1. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. 2. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి. 3. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.
చెడిపోవడం నిషిద్ధం
9. మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
15. యెఫ్తా సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు.
వీటితో లీగ్ లు చేయడం నిషిద్ధం
6. నీ దినములన్నిట ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు.
కొన్నిసార్లు కులాంతర వివాహం చేసుకున్నారు
4. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవదాని పేరు రూతు.
1. మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేకమంది పరస్త్రీలను మోహించి
8. వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక
23. ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి.
3. అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.
4. ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి.
1. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులుగాని మోయాబీయులుగాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు.
2. వారు అన్నపానములు తీసికొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్రాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను.
6. గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును
8. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేదమేమియని మోయాబీయులును శేయీరు పట్టణపువారును అందురు గనుక
47. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీయులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారినందరిని ఓడించెను.
4. అతని యొద్దకు వారిని తోడుకొనిపోగా దావీదు కొండలలో దాగియున్న దినములు వారు అతనియొద్ద కాపురముండిరి.
2. మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడుగుననున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.
12. వాటిని అతడు సిరియనుల యొద్దనుండియు మోయాబీయుల యొద్దనుండియు అమ్మోనీయుల యొద్దనుండియు ఫిలిష్తీయుల యొద్దనుండియు అమాలేకీయుల యొద్దనుండియు రెహోబు కుమారుడగు హదదెజెరు అను సోబా రాజునొద్దనుండియు పట్టుకొనియుండెను.
20. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగియున్న యొక సింహమును చంపివేసెను.
4. మోయాబు రాజైన మేషా అనేకమైన మందలు గలవాడై లక్ష గొఱ్ఱపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱపొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు.
1. అరణ్యపు తట్టుననున్న సెలనుండి దేశము నేలువానికి తగిన గొఱ్ఱపిల్లలను కప్పముగా సీయోనుకుమార్తె పర్వతమునకు పంపుడి
1. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలువారిమీద తిరుగబడిరి.
5. అయితే అహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజుమీద తిరుగుబాటు చేయగా
6. యెహోరాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను.
7. యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి మోయాబు రాజు నామీద తిరుగుబాటు చేసియున్నాడు; నీవు వచ్చి నాతోకూడ మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని యడుగగా అతడు నేను నీవాడనైయున్నాను, నా జనులు నీ జనులే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే; నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను.
21. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని, అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. 22. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను 23. గనుక వారు అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడుసొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి. 24. వారు ఇశ్రాయేలువారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారియెదుట నిలువలేక పారిపోయిరి; ఇశ్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి.
24. వారు ఇశ్రాయేలువారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారియెదుట నిలువలేక పారిపోయిరి; ఇశ్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. 25. మరియు వారు పట్టణములను పడగొట్టి, సమస్తమైన మంచి భూభాగములమీదను తలయొక రాయి వేసి నింపి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. కీర్హరెశెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచియుండెను గాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్లు విసరుచు వచ్చిరి. 26. మోయాబురాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదూయు ఏడువందల మందిని ఏర్పరచుకొని, ఎదోము రాజునొద్దకు తీసికొనిపోవుటకు యత్నించెను గాని అది వారివలన కాకపోయెను.
27. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసికొని, పట్టణపు ప్రాకారముమీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.
2. యెహోవా అతనిమీదికిని, తన సేవకులైన ప్రవక్తలద్వారా తాను సెలవిచ్చిన మాటచొప్పున యూదాదేశమును నాశనముచేయుటకై దానిమీదికిని, కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను ఆమ్మోనీయుల సైన్యములను రప్పించెను.
వచనాలు అందుబాటులో లేవు.
ఇజ్రాయెల్ కారణంగా ఉగ్రవాదం
15. ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు. భయము అధిక భయము వారికి కలుగును.
నిస్సహాయత మరియు దుఃఖం
1. మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును 2. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడియున్నది 3. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు వారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయుదురు. 4. హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది. 5. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలువేయుచు హొరొనయీము త్రోవను పోవుదురు. 6. ఏలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడను కనబడదు 7. ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొనిపోవుదురు. 8. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీమువరకును బెయేరేలీమువరకును వినబడెను. 9. ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోనుమీదికి ఇంకొకబాధను రప్పించెదను. మోయాబీయులలోనుండి తప్పించుకొనినవారి మీదికిని ఆ దేశములో శేషించినవారి మీదికిని సింహమును రప్పించెదను.
2. గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. 3. ఆలోచన చెప్పుము విమర్శచేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మామీద ఉండనియ్యుము. చెదరినవారిని దాచిపెట్టుము పారిపోయినవారిని పట్టియ్యకుము 4. నేను వెలివేసినవారిని నీతో నివసింపనిమ్ము దోచుకొనువారు వారిమీదికి రాకుండునట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయిరి సంహారము మానిపోయెను. అణగద్రొక్కువారు దేశములో లేకుండ నశించిరి. 5. కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. 6. మోయాబీయులు బహు గర్వముగలవారని మేము వినియున్నాము వారి గర్వమునుగూర్చియు వారి అహంకార గర్వక్రోధములనుగూర్చియు వినియున్నాము. వారు వదరుట వ్యర్థము. 7. కావున మోయాబీయులు మోయాబునుగూర్చి అంగలార్చుదురు అందరును అంగలార్చుదురు మోయాబీయులారా కేవలము పాడైయున్న కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. 8. ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షా వల్లులు వాడిపోయెను దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరువరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకెను దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. 9. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షా వల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపెదను ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. 10. ఆనందసంతోషములు ఫలభరితమైన పొలమునుండి మానిపోయెను ద్రాక్షలతోటలో సంగీతము వినబడదు ఉత్సాహధ్వని వినబడదు గానుగులలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడును లేడు ద్రాక్షలతొట్టి త్రొక్కువాని సంతోషపుకేకలు నేను మాన్పించియున్నాను. 11. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది కీర్హరెశు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె వాగుచున్నవి.
వినాశనాన్ని నివారించలేకపోవడం
12. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడు వారికేమియు దొరకకపోవును.
మూడేళ్లలో నాశనమవుతుంది
13. పూర్వకాలమున యెహోవా మోయాబునుగూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే; అయితే యెహోవా ఇప్పుడీలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు
14. కూలివాని లెక్కప్రకారము మూడేండ్లలోగా మోయాబీయులయొక్క ప్రభావమును వారిగొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము బహు కొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా నుండును.
బబులోనులో బందీలుగా ఉ౦డాలి
3. వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.
8. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతనిచేత బొత్తిగా నాశనము చేయించువరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.
7. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషు దేవత చెరలోనికిపోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.
ఇజ్రాయెల్ పట్ల వారి ద్వేషానికి శిక్షగా వారి నిర్మూలన
26. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్పచేసికొనెను దాని మత్తిల్లజేయుడి మోయాబు తన వమనములో పొర్లుచున్నది అది అపహాస్యమునొందును.
27. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతనిగూర్చి పలుకునప్పుడెల్ల తల ఆడించుచు వచ్చితివి
8. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేదమేమియని మోయాబీయులును శేయీరు పట్టణపువారును అందురు గనుక
9. తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును;
చెర నుంచి పునరుద్ధరణ
47. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబునుగూర్చిన శిక్షావిధి ముగిసెను.
మెస్సీయకు లొంగిపోవడం
17. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.
10. యెహోవా హస్తము ఈ పర్వతముమీద నిలుచును పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు.
ఇజ్రాయిల్ కు లొంగిపోవడం
14. వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు