అంశాల జాబితాకు వెనుకకు

కొలతలు

సామెతలు 20:10

10. వేరు వేరు తూనికె రాళ్లు వేరు వేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.

లేవీయకాండము 19:35

35. తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.

ద్వితియోపదేశాకాండము 25:14

14. హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు.

ద్వితియోపదేశాకాండము 25:15

15. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికెరాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను.

మీకా 6:10

10. అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా.

వచనాలు అందుబాటులో లేవు.

మొద్దు

లేవీయకాండము 14:10

10. ఎనిమిదవనాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.

లేవీయకాండము 14:15

15. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను.

2రాజులు 6:25

25. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగియుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మబడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.

ఒమర్ లేదా పదియవ భాగమంతా ఒప్పందం (ఏపాలో దశమ భాగము )

నిర్గమకాండము 16:36

36. ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.

లేవీయకాండము 5:11

11. రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకనియెడల పాపము చేసినవాడు తూమెడు గోధుమపిండిలో పదియవవంతును పాపపరిహారార్థబలి రూపముగా తేవలెను. అది పాపపరిహారార్థబలి గనుక దానిమీద నూనె పోయవలదు. సాంబ్రాణి దానిమీద ఉంచవలదు.

లేవీయకాండము 14:10

10. ఎనిమిదవనాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.

నిర్గమకాండము 29:40

40. దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.

యెషయా 5:10

10. పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రసమిచ్చును తూమెడుగింజల పంట ఒక పడియగును.

యెహెజ్కేలు 45:11

11. తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణముగా నుండవలెను.

హోమర్ లేదా కోర్

యెషయా 5:10

10. పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రసమిచ్చును తూమెడుగింజల పంట ఒక పడియగును.

యెహెజ్కేలు 45:14

14. తైలము చెల్లించునదెట్లనగా నూట ఎనుబది పళ్ల నూనెలో పడియు ముప్పాతికవంతున చెల్లింపవలెను. తూము నూట ఎనుబది పళ్లు పట్టునదగును.

యోహాను 2:6

6. యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను.

వచనాలు అందుబాటులో లేవు.

నిర్గమకాండము 25:25

25. దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలెను.

కీర్తనలు 39:5

5. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే యున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు.(సెలా.)

జాన

నిర్గమకాండము 28:16

16. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను.

1సమూయేలు 17:4

4. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులోనుండి బయలుదేరుచుండెను. అతడు ఆరుమూళ్ల జేనెడు ఎత్తు మనిషి.

మూర

ఆదికాండము 6:15

15. నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను.

ఆదికాండము 6:16

16. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.

ద్వితియోపదేశాకాండము 3:11

11. రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు.

అపోస్తలులకార్యములు 27:28

28. బుడుదువేసి చూచి యిరువదిబారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్లిన తరువాత, మరల బుడుదువేసి చూచి పదునైదుబారల లోతని తెలిసికొనిరి.

లూకా 24:13

13. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు

యోహాను 11:13

13. యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతినిగూర్చి చెప్పెననుకొనిరి.

మైలు

మత్తయి 5:41

41. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.

2సమూయేలు 8:2

2. మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడుగుననున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.

యిర్మియా 31:39

39. కొలనూలు దాని కెదురుగా గారేబుకొండవరకు పోవుచు గోయావరకు తిరిగి సాగును.

యెహెజ్కేలు 40:3

3. అక్కడికి ఆయన నన్ను తోడుకొనిరాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడివలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేతపట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.

ప్రకటన 21:16

16. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.

1దినవృత్తాంతములు 23:29

29. సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చుదానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,

వచనాలు అందుబాటులో లేవు.

(పరిమాణంలో సరిదిద్దడం,) తగ్గిన బాధలు

యిర్మియా 30:11

11. యెహోవా వాక్కు ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనము చేసెదను గాని నిన్ను సమూలనాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును.

(విపరీతంగా కన్నీళ్ళు తాగడం,) తీవ్రమైన బాధలు

కీర్తనలు 80:5

5. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు.

యోబు 28:23

23. దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.

యోబు 28:25

25. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు

(భూమిలోని ధూళిని కొలవడం)దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తుంది.

యెషయా 40:12

12. తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?

(మన రోజుల కొలమానం,) జీవితపు లోటు

కీర్తనలు 39:4

4. యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొనగోరుచున్నాను.

(త్రాగునీరు, కొలత ద్వారా) తీవ్రమైన కరువు

యెహెజ్కేలు 4:11

11. నీళ్లు కొల ప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగవలెను, వేళ వేళకు త్రాగవలెను;

యెహెజ్కేలు 4:16

16. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయమొందుదురు.

(క్రీస్తు యొక్క స్థాయి యొక్క కొలత,) పరిపూర్ణత

ఎఫెసీయులకు 4:13

13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

( కొలత లేకుండా నోరు తెరవడం)) నరకం యొక్క తీరనితనం

యెషయా 5:14

14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశపెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.