అంశాల జాబితాకు వెనుకకు

దీపములు

2పేతురు 1:19

19. మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.

వచనాలు అందుబాటులో లేవు.

మండుతోంది

ఆదికాండము 15:17

17. మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.

మెరుస్తుంది

యోహాను 5:35

35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందిచుటకు ఇష్టపడితిరి.

మత్తయి 25:3

3. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు.

మత్తయి 25:8

8. బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి.

మత్తయి 25:4

4. బుద్ధి గలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి.

జెకర్యా 4:2

2. నీకు ఏమి కనబడుచున్నదని యడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడుచున్నవి.

మత్తయి 25:7

7. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని

వచనాలు అందుబాటులో లేవు.

గుడారము

నిర్గమకాండము 25:37

37. నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.

అపోస్తలులకార్యములు 20:8

8. మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.

రాత్రిపూట యుద్ధ రథాలు

నహూము 2:3

3. ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు, ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళదారుమయమైన యీటెలు ఆడుచున్నవి;

నహూము 2:4

4. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కనబడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి,

వివాహ ఊరేగింపులు

మత్తయి 25:1

1. పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది.

రాత్రిపూట బయటకు వెళ్లే వ్యక్తులు

యోహాను 18:3

3. కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చెను.

సామెతలు 31:18

18. తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు.

మత్తయి 5:15

15. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు.

యోబు 29:3

3. అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని.

యోబు 29:4

4. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండినయెడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను.

న్యాయాధిపతులు 7:16

16. ఆ మూడువందలమందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివానిచేతికిచ్చి వారితో ఇట్లనెనునన్ను చూచి నేను చేయునట్లు చేయుడి;

వచనాలు అందుబాటులో లేవు.

దేవుని వాక్యము

కీర్తనలు 119:105

105. (నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైయున్నది.

సామెతలు 6:23

23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.

క్రీస్తు యొక్క సర్వజ్ఞత

దానియేలు 10:6

6. అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను

ప్రకటన 1:14

14. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలె ఉండెను;

పరిశుద్ధాత్మ కృపలు

ప్రకటన 4:5

5. ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.

దేవుని రక్షణ

ఆదికాండము 15:17

17. మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.

యెషయా 62:1

1. సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.

దేవుని నడిపింపు

2సమూయేలు 22:29

29. యెహోవా, నీవు నాకు దీపమైయున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.

కీర్తనలు 18:28

28. నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును

యెహెజ్కేలు 1:13

13. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను.

మానవుని ఆత్మ

సామెతలు 20:27

27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.

యోహాను 5:35

35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందిచుటకు ఇష్టపడితిరి.

తెలివైన పాలకులు

2సమూయేలు 21:17

17. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిచూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇకమీదట మాతోకూడ యుద్ధమునకు రావద్దని అతనిచేత ప్రమాణము చేయించిరి.

కఠిన తీర్పులు

ప్రకటన 8:10

10. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటిబుగ్గల మీదను పడెను.

1రాజులు 11:36

36. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.

1రాజులు 15:4

4. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక

(బయట పెట్టు ) దుష్టులను నాశనం చేయడం..

యోబు 18:5

5. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.

యోబు 18:6

6. వారి గుడారములో వెలుగు అంధకారమగును వారియొద్దనున్న దీపము ఆరిపోవును

యోబు 21:17

17. భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు గదా.వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా.

యోబు 13:9

9. ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా?

(పూర్తిగా చల్లారింది.) తల్లిదండ్రులను శపించే వారిని పూర్తిగా నాశనం చేయడం

సామెతలు 20:20

20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.