అంశాల జాబితాకు వెనుకకు

పురుగులు

ఆదికాండము 1:24

24. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను.

ఆదికాండము 1:25

25. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను.

వచనాలు అందుబాటులో లేవు.

లేవీయకాండము 11:21

21. అయితే నాలుగు కాళ్లతో చరించుచు నేలగంతులు వేయుటకు కాళ్లమీద తొడలుగల పురుగులన్ని తినవచ్చును.

లేవీయకాండము 11:22

22. నేతమిడత గాని చిన్నమిడత గాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును.

లేవీయకాండము 11:23

23. నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.

లేవీయకాండము 11:24

24. వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.

వచనాలు అందుబాటులో లేవు.

చీమ

సామెతలు 6:6

6. సోమరీ, చీమల యొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.

సామెతలు 30:25

25. చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.

తుమ్మెద

న్యాయాధిపతులు 14:8

8. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసికొని వచ్చుటకు తిరిగి వెళ్లుచుండగా, ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు, సింహపుకళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కన బడగా

కీర్తనలు 118:12

12. కందిరీగలవలె నామీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

యెషయా 7:18

18. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.

లేవీయకాండము 11:22

22. నేతమిడత గాని చిన్నమిడత గాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును.

గొంగళి పురుగు

కీర్తనలు 78:46

46. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను.

యెషయా 33:4

4. చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడుదురు

యోవేలు 1:4

4. గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసియున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసియున్నవి. పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసియున్నవి.

నహూము 3:15

15. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగళిపురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము.

నహూము 3:16

16. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగా నున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను.

వానపాము

యోబు 25:6

6. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.

మీకా 7:17

17. సర్పములాగున వారు మన్ను నాకుదురు, భూమిమీద ప్రాకు పురుగులవలె తమ యిరవులలోనుండి వణకుచు ప్రాకి వత్తురు, మన దేవుడైన యెహోవాయొద్దకు భయపడుచు వత్తురు, నిన్నుబట్టి భయము నొందుదురు.

1సమూయేలు 24:14

14. ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా? మిన్నల్లిని గదా?

ఈగ

నిర్గమకాండము 8:22

22. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు.

ప్రసంగి 10:1

1. బుక్కావాని తైలములో చచ్చిన యీగలు పడుటచేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును.

యెషయా 7:18

18. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.

మత్తయి 23:24

24. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.

మిడత

లేవీయకాండము 11:22

22. నేతమిడత గాని చిన్నమిడత గాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును.

న్యాయాధిపతులు 6:5

5. వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను.

యోబు 39:20

20. మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.

కందిరీగ

ద్వితియోపదేశాకాండము 7:20

20. మరియు మిగిలినవారును నీ కంటబడక దాగినవారును నశించువరకు నీ దేవుడైన యెహోవా వారిమీదికి పెద్ద కందిరీగలను పంపును.

జట్టిమిడత

నిర్గమకాండము 10:12

12. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చునట్లు ఐగుప్తు దేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తు దేశముమీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటిని తినివేయునని చెప్పెను

నిర్గమకాండము 10:13

13. మోషే ఐగుప్తు దేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసరజేసెను; ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను.

బట్టతల మిడతలు

లేవీయకాండము 11:22

22. నేతమిడత గాని చిన్నమిడత గాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును.

పేలు

నిర్గమకాండము 8:16

16. అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.

కీర్తనలు 105:31

31. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను.

నిర్గమకాండము 16:20

20. అయితే వారు మోషే మాటవినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను. మోషే వారిమీద కోపపడగా

యోబు 4:19

19. జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

యోబు 27:18

18. పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు.

యెషయా 50:9

9. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.

యోవేలు 1:4

4. గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసియున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసియున్నవి. పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసియున్నవి.

ఆమోసు 4:9

9. మరియు మీ సస్యములను ఎండుతెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపుచెట్లను ఒలీవచెట్లను తినివేసెను, అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.

సాలె పురుగు

యోబు 8:14

14. అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.

సామెతలు 30:28

28. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును.

కీర్తనలు 104:25

25. అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి.

కీర్తనలు 104:27

27. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి

కీర్తనలు 145:9

9. యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.

కీర్తనలు 145:15

15. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.