అంశాల జాబితాకు వెనుకకు

సోమరితనము

రోమీయులకు 12:11

11. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.

హెబ్రీయులకు 6:12

12. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.

సామెతలు 12:27

27. సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.

సామెతలు 26:15

15. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును.

సామెతలు 18:9

9. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు.

సామెతలు 26:16

16. హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును

వచనాలు అందుబాటులో లేవు.

పేదరికం

సామెతలు 10:4

4. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.

సామెతలు 20:13

13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొని యుండినయెడల ఆహారము తిని తృప్తి పొందుదువు.

కోరు

సామెతలు 20:4

4. విత్తులువేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.

సామెతలు 24:34

34. వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.

ఆకలి

సామెతలు 19:15

15. సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును.

సామెతలు 20:13

13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొని యుండినయెడల ఆహారము తిని తృప్తి పొందుదువు.

కట్టుబాటు

సామెతలు 12:24

24. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టిపనులు చేయవలసి వచ్చును.

ఆశాభంగం

సామెతలు 13:4

4. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.

సామెతలు 21:25

25. సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.

పాడు

సామెతలు 24:30

30. సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా

సామెతలు 24:31

31. ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసియుండెను. దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను.

ప్రసంగి 10:18

18. సోమరితనముచేత ఇంటికప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకముచేత ఇల్లు కురియును.

టాట్లింగ్ మరియు జోక్యం

1తిమోతి 5:13

13. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక, ఆడరాని మాటలాడుచు, వదరుబోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చుకొందురు.

సామెతలు 24:30-32

30. సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా 31. ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసియుండెను. దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను. 32. నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని.

సామెతలు 6:6

6. సోమరీ, చీమల యొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.

సామెతలు 6:9

9. సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?

సామెతలు 20:4

4. విత్తులువేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.

సామెతలు 22:13

13. సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును.

సామెతలు 26:14

14. ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును.

మత్తయి 25:18

18. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను.

మత్తయి 25:26

26. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లనిచోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా?

వచనాలు అందుబాటులో లేవు.

వాచ్ మెన్

యెషయా 56:10

10. వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగకుక్కలు మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.

అథేనియన్లు

అపోస్తలులకార్యములు 17:21

21. ఏథెన్సు వారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్తసంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు.

థెస్సలొనియన్లు

2దెస్సలోనీకయులకు 3:11

11. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.