అంశాల జాబితాకు వెనుకకు

అతిదిమర్యాద

రోమీయులకు 12:13

13. పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.

1పేతురు 4:9

9. సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

1తిమోతి 3:2

2. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపతగినవాడునై యుండి,

తీతుకు 1:8

8. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడునై యుండి,

1తిమోతి 5:10

10. సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయము చేసి, ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.

వచనాలు అందుబాటులో లేవు.

అపరిచితులు

హెబ్రీయులకు 13:2

2. ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి.

పేదలు

యెషయా 58:7

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్తసంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

లూకా 14:13

13. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము.

శత్రువులు

2రాజులు 6:22

22. అతడు నీవు వీరిని కొట్టవద్దు; నీ కత్తిచేతను నీ వింటిచేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానునియొద్దకు వెళ్లుదురని చెప్పెను.

2రాజులు 6:23

23. అతడు వారికొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానునియొద్దకు పోయిరి. అప్పటినుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను.

రోమీయులకు 12:20

20. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.

లూకా 14:14

14. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.

హెబ్రీయులకు 13:2

2. ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి.

వచనాలు అందుబాటులో లేవు.

Melchizedek

ఆదికాండము 14:18

18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.

అబ్రాహాము

ఆదికాండము 18:3-8

3. ప్రభువా, నీ కటాక్షము నామీద నున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. 4. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగుకొని ఈ చెట్టుక్రింద అలసట తీర్చుకొనుడి. 5. కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచుకొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసునియొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా 6. అబ్రాహాము గుడారములోనున్న శారాయొద్దకు త్వరగా వెళ్లి నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. 7. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. 8. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.

ఎంతో

ఆదికాండము 19:2

2. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి

ఆదికాండము 19:3

3. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతనితట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.

లాబాన్

ఆదికాండము 24:31

31. లాబాను యెహోవావలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను.

జెత్రో

నిర్గమకాండము 2:20

20. అతడు తన కుమార్తెలతొ అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను.

మనోవా

న్యాయాధిపతులు 13:15

15. అప్పుడు మానోహమేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా

శామ్యూల్

1సమూయేలు 9:22

22. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి, పిలువబడిన దాదాపు ముప్పదిమందిలో ప్రధానస్థలమందు వారిని కూర్చుండబెట్టి

డేవిడ్

2సమూయేలు 6:19

19. సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులగు స్త్రీ పురుషులకందరికి ఒక్కొక రొట్టెయు ఒక్కొక భక్ష్యమును ఒక్కొక ద్రాక్షపండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.

బర్జిల్లాయ్

2సమూయేలు 19:32

32. బర్జిల్లయి యెనుబది సంవత్సరముల వయస్సుకలిగి బహు ముసలివాడై యుండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చెను.

షునామైట్

2రాజులు 4:8

8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచు వచ్చెను.

నెహెమ్యా

నెహెమ్యా 5:17

17. భూమి సంపాదించుకొనిన వారము కాము; నా భోజనపు బల్లయొద్ద మా చుట్టునున్న అన్యజనులలో నుండి వచ్చిన వారు గాక యూదులును అధికారులును నూట ఏబదిమంది కూర్చుని యుండిరి.

ఉద్యోగం

యోబు 31:17

17. తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను

యోబు 31:32

32. పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.

Zacchaeus

లూకా 19:6

6. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.

సమరిటన్లు

యోహాను 4:40

40. ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను.

లిడియా

అపోస్తలులకార్యములు 16:15

15. ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె--నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.

జాసన్

అపోస్తలులకార్యములు 17:7

7. వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.

మ్నాసన్

అపోస్తలులకార్యములు 21:16

16. మరియు కైసరయనుండి కొందరు శిష్యులు, మొదటనుండి శిష్యుడుగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడ వచ్చిరి.

మెలిటా ప్రజలు

అపోస్తలులకార్యములు 28:2

2. అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంతకాదు. ఏలాగనగా, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందునవారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి.

పబ్లియస్

అపోస్తలులకార్యములు 28:7

7. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను.

గైయస్

3యోహాను 1:5

5. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు.

3యోహాను 1:6

6. వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు