అంశాల జాబితాకు వెనుకకు

మొక్కలు

2రాజులు 19:26

26. కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.

వచనాలు అందుబాటులో లేవు.

సృష్టించబడింది

ఆదికాండము 1:11

11. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను.

ఆదికాండము 1:12

12. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను

ఆదికాండము 2:5

5. అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు

పెరగడానికి కారణాలు

యోబు 38:27

27. ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?

కీర్తనలు 104:14

14. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు

ఆదికాండము 1:11

11. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను.

ఆదికాండము 1:12

12. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను

ఆదికాండము 1:28

28. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.

ఆదికాండము 1:29

29. దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను; అవి మీకాహారమగును.

ఆదికాండము 9:3

3. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.

వచనాలు అందుబాటులో లేవు.

క్షేత్రాలు[మార్చు]

యిర్మియా 12:4

4. భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవుచున్నవి.

పర్వతాలు[మార్చు]

సామెతలు 27:25

25. ఎండిన గడ్డి వామి వేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి యేరబడియున్నది

ది మార్ష్ లు

యోబు 8:11

11. బురద లేకుండ జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?

ఎడారులు

యోబు 24:5

5. అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును

యిర్మియా 17:6

6. వాడు ఎడారిలోని అరుహావృక్షమువలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.

ద్వితియోపదేశాకాండము 11:10

10. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశమువంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.

1రాజులు 21:2

2. అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొనియున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను.

సామెతలు 15:17

17. పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.

హెబ్రీయులకు 6:7

7. ఎట్లనగా, భూమి తనమీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.

ద్వితియోపదేశాకాండము 32:2

2. నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.

యోబు 38:26

26. పాడైన యెడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి మొలిపించుటకును వరదనీటికి కాలువలను

యోబు 38:27

27. ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?

ద్వితియోపదేశాకాండము 11:10

10. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశమువంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.

వచనాలు అందుబాటులో లేవు.

కలబంద

పరమగీతము 4:14

14. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.

సోంపు

మత్తయి 23:23

23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసియుండెను

బార్లీ

నిర్గమకాండము 9:31

31. అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని

2సమూయేలు 14:30

30. అబ్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలముదగ్గర నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి; మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా

బీన్స్

2సమూయేలు 17:28

28. అరణ్యమందు జనులు అలసినవారై ఆకలిగొని దప్పిగొనియుందురని తలంచి, పరుపులు పాత్రలు కుండలు గోధుమలు యవలుపిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడుకాయలు పేలాలు

బుల్రుష్

నిర్గమకాండము 2:3

3. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టి యేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా,

యెషయా 58:5

5. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా?

Calamus

పరమగీతము 4:14

14. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.

కమిన్

యెషయా 28:27

27. సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత నూర్చడు బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్లగొట్టును గదా?

మత్తయి 23:23

23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసియుండెను

దోసకాయ

సంఖ్యాకాండము 11:5

5. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.

యెషయా 1:8

8. ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడివేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది.

ఫిట్స్

యెషయా 28:25

25. అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరప మొలకలు వేయును గదా?

యెషయా 28:27

27. సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత నూర్చడు బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్లగొట్టును గదా?

జెండా

నిర్గమకాండము 2:3

3. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టి యేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా,

యోబు 8:11

11. బురద లేకుండ జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?

అవిసె

నిర్గమకాండము 9:31

31. అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని

వెల్లుల్లి

సంఖ్యాకాండము 11:5

5. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.

సొరకాయలు

2రాజులు 4:39

39. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొనివచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.

గడ్డి

సంఖ్యాకాండము 22:4

4. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు.

హీత్

యిర్మియా 17:6

6. వాడు ఎడారిలోని అరుహావృక్షమువలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.

యిర్మియా 48:6

6. పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి.

హైసోప్

నిర్గమకాండము 12:22

22. మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువుకమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలువెళ్లకూడదు.

1రాజులు 4:33

33. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినిగూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటినిగూర్చియు అతడు వ్రాసెను.

లీక్స్

సంఖ్యాకాండము 11:5

5. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.

Lentiles

ఆదికాండము 25:34

34. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.

మాండ్రేక్స్

ఆదికాండము 30:14

14. గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా

పరమగీతము 7:13

13. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి.

మల్లోస్

యోబు 30:4

4. వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడు వేళ్లు వారికి ఆహారమైయున్నవి.

జొన్నలు

యెహెజ్కేలు 4:9

9. మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్కమీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను;

పుచ్చకాయ

సంఖ్యాకాండము 11:5

5. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.

పుదీనా

మత్తయి 23:23

23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసియుండెను

మిర్హ్

పరమగీతము 4:14

14. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.

ఉల్లిపాయలు

సంఖ్యాకాండము 11:5

5. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.

రీడ్స్

యోబు 40:21

21. తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును

యెషయా 19:6

6. ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.

రష్ లు

యోబు 8:11

11. బురద లేకుండ జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?

రై

నిర్గమకాండము 9:32

32. గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు.

కుంకుమ పువ్వు

పరమగీతము 4:14

14. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.

స్పైక్నార్డ్

పరమగీతము 4:14

14. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.

టార్స్ లేదా డార్నెల్

మత్తయి 13:30

30. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగనియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.

గోధుమ

నిర్గమకాండము 9:32

32. గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు.

యిర్మియా 12:13

13. జనులు గోధుమలు చల్లి ముండ్లపంట కోయుదురు; వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను; యెహోవా కోపాగ్నివలన కోతకు పంటలేక మీరు సిగ్గుపడుదురు.

నిర్గమకాండము 12:8

8. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను

సంఖ్యాకాండము 9:11

11. వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను.

2రాజులు 4:39

39. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొనివచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.

2రాజులు 4:40

40. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినక మానిరి.

వచనాలు అందుబాటులో లేవు.

వడగండ్లు, మెరుపులు

నిర్గమకాండము 9:22-25

22. యెహోవా నీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తు దేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను. 23. మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశముమీద వడగండ్లు కురిపించెను. 24. ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైనవాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు. 25. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతట మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగగొట్టెను.

మిడతలు, &c

నిర్గమకాండము 10:12

12. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చునట్లు ఐగుప్తు దేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తు దేశముమీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటిని తినివేయునని చెప్పెను

నిర్గమకాండము 10:15

15. ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయేగాని పచ్చనిదేదియు మిగిలియుండలేదు.

కీర్తనలు 105:34

34. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలును లెక్కలేని చీడపురుగులును వచ్చెను,

కీర్తనలు 105:35

35. అవి వారిదేశపు కూరచెట్లన్నిటిని వారి భూమి పంటలను తినివేసెను.

అనావృష్టి

యెషయా 42:15

15. పర్వతములను కొండలను పాడుచేయుదును వాటిమీది చెట్టుచేమలన్నిటిని ఎండిపోచేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును.

యూదుల మధ్య చిచ్చు రేగింది

లూకా 11:42

42. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించుచున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది

రోమీయులకు 14:2

2. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడైయుండి, కూరగాయలనే తినుచున్నాడు.

వచనాలు అందుబాటులో లేవు.

దుష్టుల గురించి

2రాజులు 19:26

26. కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.

కీర్తనలు 37:2

2. వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు

(మంచు,) సాధువులకు ప్రసాదించిన కృప

యెషయా 18:4

4. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును.