అంశాల జాబితాకు వెనుకకు

యేసుక్రీస్తు మీద ద్వేషము

కీర్తనలు 69:4

4. నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను.

యోహాను 15:25

25. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను.

యోహాను 7:7

7. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.

వచనాలు అందుబాటులో లేవు.

తండ్రిపై ద్వేషం

యోహాను 15:23

23. నన్ను ద్వేషించువాడు నా తండ్రినికూడ ద్వేషించుచున్నాడు.

యోహాను 15:24

24. ఎవడును చేయని క్రియలు నేను వారిమధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.

తన ప్రజలపట్ల ద్వేషం

యోహాను 15:18

18. లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.

కీర్తనలు 2:2

2. మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు

కీర్తనలు 2:9

9. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు

కీర్తనలు 21:8

8. నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును.

1కొరిందీయులకు 15:25

25. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.

హెబ్రీయులకు 10:29-31

29. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? 30. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా. 31. జీవముగల దేవునిచేతిలో పడుట భయంకరము.

లూకా 19:12-14

12. రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై 13. తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాలనిచ్చి నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. 14. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మా కిష్టములేదని అతని వెనుక రాయబారము పంపిరి.

లూకా 19:17

17. అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణములమీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.

వచనాలు అందుబాటులో లేవు.

ప్రధాన అర్చకులు &c

మత్తయి 27:1

1. ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి

మత్తయి 27:2

2. ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.

లూకా 22:5

5. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.

యూదులు

మత్తయి 27:22

22. అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువ వేయుమని అందరును చెప్పిరి.

మత్తయి 27:23

23. అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

స్క్రిబ్స్ &c

మార్కు 11:18

18. శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి.

లూకా 11:53

53. ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నిండ పగబట్టి ఆయనమీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి,

లూకా 11:54

54. వదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.