మగదుప్పి
15. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది యిండ్లన్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును.
5. దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱ అనునవే.
6. సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని యధిపతులు మేతలేని దుప్పులవలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారియెదుట నిలువలేక పారిపోయిరి.
వచనాలు అందుబాటులో లేవు.
హింద్ అని పిలుస్తారు
7. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
స్వేచ్ఛలో ఆనందాలు
21. నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును.
దయ మరియు ఆప్యాయత
19. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.
నిర్ణీత సమయానికి ముందుకు వస్తుంది
1. అడవిలోని కొండమేకలు ఈను కాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
2. అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?
కష్టపడి బయటకు వస్తుంది
3. అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.
దేవుని స్వరాన్ని వెలికితీస్తుంది
9. యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభావము అనుచున్నవి.
కరువులో తన బిడ్డను వదిలేసి..
5. లేళ్లు పొలములో ఈని గడ్డిలేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి.
4. వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగిరావు.
వచనాలు అందుబాటులో లేవు.
క్రీస్తు
9. నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీ కంతగుండ తొంగి చూచుచున్నాడు
17. చల్లనిగాలి వీచువరకు నీడలు లేకపోవువరకు ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను కొండబాటలమీద త్వరపడి రమ్ము.
14. నా ప్రియుడా, త్వరపడుము లఘువైన యిఱ్ఱివలె ఉండుము గంధవర్గవృక్ష పర్వతములమీద గంతులువేయు లేడిపిల్లవలె ఉండుము.
మతమార్పిడి చేసిన పాపులు
6. కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును
అనుభవజ్ఞులైన సాధువుల యొక్క (ఖచ్చితంగా*పాదాలు,)
33. ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు.
19. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.
(నీటి కోసం పరితపించడం,) భగవంతుని కోసం పరితపించే సాధువులు
1. దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
2. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
(పశుగ్రాసం లేకుండా,) హింసించబడిన వారి
6. సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని యధిపతులు మేతలేని దుప్పులవలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారియెదుట నిలువలేక పారిపోయిరి.