ముఖస్తుతి
21. మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్షపాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను
22. ముఖస్తుతి చేయుట నాచేత కాదు అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును.
5. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.
వచనాలు అందుబాటులో లేవు.
ఇతరులు
9. వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు.
2. అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.
తమను తాము
2. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడువరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయుచున్నది.
వచనాలు అందుబాటులో లేవు.
దేవుడు
36. అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు
అధికారంలో ఉన్నవారు
34. వారు క్రుంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును, అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని
24. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు.
18. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
5. జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము. వాటినుండి తొలగిపోకుము.
21. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును; అతనికి రాజ్యఘనత నియ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి యిచ్చకపు మాటలచేత రాజ్యమును అపహరించును.
22. ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలన వారు నాశనమగుదురు; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును.
23. నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.
19. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.
21. అది తన అధికమైన లాలన మాటలచేత వానిని లోపరచుకొనెను తాను పలికిన యిచ్చకపు మాటలచేత వాని నీడ్చుకొని పోయెను. 22. వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును 23. తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
5. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును.
5. ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును.
3. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.
వచనాలు అందుబాటులో లేవు.
టెకోవా మహిళ
17. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిననెను.
20. సంగతిని రాజుతో మరుగుమాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు.
అబ్షాలోము
2. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణముయొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి, రాజుచేత తీర్పునొందుటకై వ్యాజ్యెమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరివాడవని యడుగుచుండెను నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలానిదానికి చేరిన వాడనని వాడు చెప్పగా 3. అబ్షాలోము నీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి 4. నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడువారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను. 5. మరియు తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను. 6. తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికి అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులనందరిని తనతట్టు త్రిప్పుకొనెను.
అబద్ధ ప్రవక్తలు
13. మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా
డారియస్ ఆస్థానాధికారులు
7. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినముల వరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవునియొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, యీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి
పరిసయ్యులు, &c
14. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
పీపుల్ ఆఫ్ టైర్, &c
22. జనులు ఇది దైవస్వరమేకాని మానవస్వరము కాదని కేకలు వేసిరి.