అంశాల జాబితాకు వెనుకకు

అసూయ

సామెతలు 3:31

31. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు

రోమీయులకు 13:13

13. అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము

1తిమోతి 6:4

4. వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములనుగూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,

ప్రసంగి 4:4

4. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలె నున్నది.

గలతీయులకు 5:21

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

యాకోబు 4:5

5. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?

యోబు 5:2

2. దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశించెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.

సామెతలు 14:30

30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.

సామెతలు 27:4

4. క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?

1కొరిందీయులకు 3:1

1. సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.

1కొరిందీయులకు 3:3

3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?

యాకోబు 3:14

14. అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

1పేతురు 2:1

1. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్నయెడల

1పేతురు 2:2

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమాటలను మాని,

వచనాలు అందుబాటులో లేవు.

నిండుగా ఉంటాయి

రోమీయులకు 1:29

29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై

నివసించండి

తీతుకు 3:3

3. ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వము నందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని

యాకోబు 3:16

16. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

కీర్తనలు 37:1

1. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.

కీర్తనలు 37:35

35. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లియుండెను.

కీర్తనలు 73:3

3. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.

కీర్తనలు 73:17-20

17. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. 18. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు 19. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు. 20. మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీకరింతువు.

యెషయా 26:11

11. యెహోవా, నీ హస్తమెత్తబడియున్నదిగాని జనులు దాని చూడనొల్లరు జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును.

వచనాలు అందుబాటులో లేవు.

కయీను

ఆదికాండము 4:5

5. కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా

ఫిలిస్తీయులు

ఆదికాండము 26:14

14. అతనికి గొఱ్ఱల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.

లాబాను కుమారులు

ఆదికాండము 31:1

1. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.

జోసెఫ్ సోదరులు

ఆదికాండము 37:11

11. అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.

జాషువా

సంఖ్యాకాండము 11:28

28. మోషే ఏర్పరచుకొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను.

సంఖ్యాకాండము 11:29

29. అందుకు మోషేనా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచునుగాక అని అతనితో అనెను.

ఆరోన్, &c

సంఖ్యాకాండము 12:2

2. వారు మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మాచేతను పలికింపలేదా? అని చెప్పుకొనగా

కోరా, &c

సంఖ్యాకాండము 16:3

3. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారిమధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,

కీర్తనలు 106:16

16. వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి.

సౌల్

1సమూయేలు 18:8

8. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అనుకొనెను

సన్బలాత్, &c

నెహెమ్యా 2:10

10. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.

హామన్

ఎస్తేరు 5:13

13. అయితే యూదుడైన మొర్దెకై రాజుగుమ్మమున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటివలన నాకు ప్రయోజనమేమియు లేదని అతడు చెప్పగా

ఎడోమైట్స్

యెహెజ్కేలు 35:11

11. నా జీవముతోడు నీవు వారియెడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధముచొప్పునను నేను నీకు తగిన పనిచేసి, నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును.

బబులోను యువరాజులు

దానియేలు 6:3

3. ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దేశించెను.

దానియేలు 6:4

4. అందుకా ప్రధానులును అధిపతులును రాజ్యపాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయినను లోపమైనను కనుగొనలేకపోయిరి.

ప్రధాన అర్చకులు

మార్కు 15:10

10. పిలాతు తెలిసికొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను.

యూదులు

అపోస్తలులకార్యములు 13:45

45. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.

అపోస్తలులకార్యములు 17:5

5. అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి