అంశాల జాబితాకు వెనుకకు

విభజనలు

1కొరిందీయులకు 1:10

10. సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

1కొరిందీయులకు 1:11-13

11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారివలన నాకు తెలియవచ్చెను. 12. మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. 13. క్రీస్తు విభజింపబడియున్నాడా? పౌలు మీకొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?

1కొరిందీయులకు 11:18

18. మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.

1కొరిందీయులకు 12:24

24. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.

1కొరిందీయులకు 12:25

25. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.

వచనాలు అందుబాటులో లేవు.

క్రీస్తు ఐక్యత

1కొరిందీయులకు 1:13

13. క్రీస్తు విభజింపబడియున్నాడా? పౌలు మీకొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?

1కొరిందీయులకు 12:13

13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు.

క్రీస్తు కోరిక

యోహాను 17:21-23

21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమై యుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. 22. మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. 23. వారియందు నేనును నాయందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.

క్రీస్తు యొక్క ఉద్దేశ్యం

యోహాను 10:16

16. ఈ దొడ్డివి కాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును.

చర్చి యొక్క ఆత్మ

1కొరిందీయులకు 11:16

16. ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారములేదని వాడు తెలిసికొనవలెను.

1కొరిందీయులకు 3:3

3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?

రోమీయులకు 16:17

17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయువారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.

మత్తయి 12:25

25. ఆయన వారి తలంపులనెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.