అంశాల జాబితాకు వెనుకకు

భవిష్యవాణి

1సమూయేలు 15:23

23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా

ద్వితియోపదేశాకాండము 18:12

12. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.

వచనాలు అందుబాటులో లేవు.

డివైనర్స్

ద్వితియోపదేశాకాండము 18:14

14. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘ శకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.

మంత్రగాళ్లు

ద్వితియోపదేశాకాండము 18:10

10. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను

యిర్మియా 27:9

9. కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి.

మంత్రగత్తెలు

నిర్గమకాండము 22:18

18. శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.

ఛార్మర్లు

ద్వితియోపదేశాకాండము 18:11

11. కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.

మాంత్రికులు

ద్వితియోపదేశాకాండము 18:11

11. కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.

1సమూయేలు 28:3

3. సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములోనుండి వెళ్లగొట్టి యుండెను.

సుపరిచిత ఆత్మల సంప్రదింపులు

ద్వితియోపదేశాకాండము 18:11

11. కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.

మాంత్రికులు

ఆదికాండము 41:8

8. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను.

దానియేలు 4:7

7. శకునగాండ్రును గారడీవిద్య గలవారును కల్దీయులును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి.

జ్యోతిష్కులు

యెషయా 47:13

13. నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.

దానియేలు 4:7

7. శకునగాండ్రును గారడీవిద్య గలవారును కల్దీయులును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి.

మాంత్రికులు

యిర్మియా 27:9

9. కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి.

అపోస్తలులకార్యములు 13:6

6. వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్‌ యేసు అను ఒక యూదుని చూచిరి.

అపోస్తలులకార్యములు 13:8

8. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.

నెక్రోమాన్సర్లు

ద్వితియోపదేశాకాండము 18:11

11. కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.

సూత్సేయర్లు

యెషయా 2:6

6. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించియున్నావు.

దానియేలు 2:27

27. దానియేలు రాజు సముఖములో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకునగాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు.

అబద్ధ ప్రవక్తలు

యిర్మియా 14:14

14. యెహోవా నాతో ఇట్లనెను ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.

యెహెజ్కేలు 13:3

3. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధి ననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ.

యెహెజ్కేలు 13:6

6. వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపకపోయినను, తాము చెప్పినమాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు.

వచనాలు అందుబాటులో లేవు.

మంత్రాలు

నిర్గమకాండము 7:11

11. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి.

సంఖ్యాకాండము 24:1

1. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటివలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యమువైపు తన ముఖమును త్రిప్పుకొనెను.

మాంత్రికుడు

యెషయా 47:12

12. నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో

అపోస్తలులకార్యములు 8:11

11. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్యపెట్టిరి.

గమనించే సమయాలు

2రాజులు 21:6

6. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుకచేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను

స్వర్గ శరీరాలను పరిశీలించడం

యెషయా 37:13

13. హమాతు రాజు ఏమాయెను? అర్పాదు రాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి

మృతులను పైకి లేపడం

1సమూయేలు 28:11

11. ఆ స్త్రీ నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడు సమూయేలును రప్పింపవలెననెను.

1సమూయేలు 28:12

12. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా

జంతువుల లోపలి భాగాన్ని పరిశీలించడం

యెహెజ్కేలు 21:21

21. బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలిసికొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు; అతడు బాణములను ఇటు అటు ఆడించుచు, విగ్రహములచేత విచారణ చేయుచు, కార్యమునుబట్టి శకునము చూచుచున్నాడు.

బాణాల ఎగరడం

యెహెజ్కేలు 21:22

22. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టుమనియు యెరూషలేమునుగూర్చి తన కుడితట్టున శకునము కనబడెను.

కప్పులు

ఆదికాండము 44:2

2. కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహనిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను.

ఆదికాండము 44:5

5. దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.

రాడ్ లు

హోషేయ 4:12

12. నా జనులు తాము పెట్టుకొనిన కఱ్ఱయొద్ద విచారణ చేయుదురు, తమచేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు.

కలలు

యిర్మియా 29:8

8. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి.

జెకర్యా 10:2

2. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొఱ్ఱలమంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధనొందిరి.

విగ్రహారాధనతో ముడిపడి ఉంది

2దినవృత్తాంతములు 33:5

5. మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.

2దినవృత్తాంతములు 33:6

6. బెన్‌హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయనకు కోపము పుట్టించెను.

అనేక మరియు ఖరీదైన పుస్తకాలు

అపోస్తలులకార్యములు 19:19

19. మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్కచూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.

లాభదాయకమైన ఉపాధి

సంఖ్యాకాండము 22:7

7. కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేతపట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా

అపోస్తలులకార్యములు 16:16

16. మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యము పట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను.

వచనాలు అందుబాటులో లేవు.

వివేకవంతులుగా పరిగణించబడతారు

దానియేలు 2:12

12. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరిని సంహరింపవలెనని యాజ్ఞ ఇచ్చెను.

దానియేలు 2:27

27. దానియేలు రాజు సముఖములో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకునగాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు.

ఆశ్చర్యంతో చూస్తారు

అపోస్తలులకార్యములు 8:9

9. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెవడో యొక గొప్పవాడని చెప్పుకొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను.

అపోస్తలులకార్యములు 8:11

11. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్యపెట్టిరి.

కష్టాల్లో ఉన్నప్పుడు సంప్రదించారు

దానియేలు 2:2

2. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీవిద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి.

దానియేలు 4:6

6. కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరిని నా యెదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చితిని.

దానియేలు 4:7

7. శకునగాండ్రును గారడీవిద్య గలవారును కల్దీయులును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి.

అంతుచిక్కని పదాలు, హావభావాలను ఉపయోగించారు

యెషయా 8:19

19. వారు మిమ్మును చూచి కర్ణపిశాచిగలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్లదగునా?

యెహెజ్కేలు 13:6

6. వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపకపోయినను, తాము చెప్పినమాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు.

యెహెజ్కేలు 13:7

7. నేను సెలవియ్యకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పినయెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనముగదా? మీరు నమ్మదగని సోదెగాండ్రయితిరి గదా?

యిర్మియా 29:8

8. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి.

యెషయా 44:25

25. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.

సంఖ్యాకాండము 23:23

23. నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇశ్రాయేలులో శకునము లేదు ఆ యా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును.

వచనాలు అందుబాటులో లేవు.

ఇశ్రాయేలీయుల ఆచారాన్ని నిషేధించండి

లేవీయకాండము 19:26

26. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర యోగములు చేయకూడదు,

ద్వితియోపదేశాకాండము 18:10

10. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను

ద్వితియోపదేశాకాండము 18:11

11. కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.

ప్రయత్నించడం నిషేధించబడింది

లేవీయకాండము 19:31

31. కర్ణపిశాచి గలవారిదగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.

ద్వితియోపదేశాకాండము 18:14

14. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘ శకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.

ఉపయోగించిన వారికి మరణశిక్ష

నిర్గమకాండము 22:18

18. శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.

లేవీయకాండము 20:27

27. పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణశిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.

కోరిన వారిని శిక్షించండి

లేవీయకాండము 20:6

6. మరియు కర్ణపిశాచి గలవారితోను సోదెగాండ్రతోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.

2రాజులు 17:17

17. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.

యెషయా 2:6

6. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించియున్నావు.