అంశాల జాబితాకు వెనుకకు

యూదుల ఆహారము

ఆదికాండము 18:7

7. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను.

ఆదికాండము 18:8

8. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.

ఆదికాండము 27:4

4. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.

నిర్గమకాండము 16:3

3. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావకపోతివిు? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడనుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా

సంఖ్యాకాండము 11:5

5. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.

నిర్గమకాండము 16:4-12

4. యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశమునుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. 5. మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను. 6. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో యెహోవా ఐగుప్తు దేశములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును. 7. యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటివారము? మామీద సణుగనేల అనిరి. 8. మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను 9. అంతట మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను. 10. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. 11. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని 12. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.

రూతు 2:14

14. బోయజు భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను.

సామెతలు 15:17

17. పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.

సామెతలు 23:1-3

1. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచించుము. 2. నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. 3. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు.

విలాపవాక్యములు 4:5

5. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు.

ఆమోసు 6:4

4. దంతపు మంచములమీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు.

ఆమోసు 6:5

5. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు.

లూకా 16:19

19. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.

వచనాలు అందుబాటులో లేవు.

పాలు

ఆదికాండము 49:12

12. అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.

సామెతలు 27:27

27. నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును.

వెన్న

ద్వితియోపదేశాకాండము 32:14

14. ఆవు మజ్జిగను గొఱ్ఱమేకల పచ్చిపాలను గొఱ్ఱపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము.

2సమూయేలు 17:29

29. తేనె వెన్న గొఱ్ఱలు జున్నుముద్దలు దావీదును అతనియొద్దనున్న జనులును భోజనము చేయుటకై తీసికొనివచ్చిరి.

జున్ను

1సమూయేలు 17:18

18. మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొనిపోయి వారి సహస్రాధిపతి కిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొనిరమ్మని చెప్పి పంపివేసెను.

యోబు 10:10

10. ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా.

రొట్టె

ఆదికాండము 18:5

5. కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచుకొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసునియొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా

1సమూయేలు 17:17

17. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము.

ఎండిపోయిన మొక్కజొన్న

రూతు 2:14

14. బోయజు భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను.

1సమూయేలు 17:17

17. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము.

కండ

2సమూయేలు 6:19

19. సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులగు స్త్రీ పురుషులకందరికి ఒక్కొక రొట్టెయు ఒక్కొక భక్ష్యమును ఒక్కొక ద్రాక్షపండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.

సామెతలు 9:2

2. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది

చేప

మత్తయి 7:10

10. మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా

లూకా 24:42

42. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి.

మూలికలు

సామెతలు 15:17

17. పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.

రోమీయులకు 14:2

2. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడైయుండి, కూరగాయలనే తినుచున్నాడు.

హెబ్రీయులకు 6:7

7. ఎట్లనగా, భూమి తనమీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.

ఫలం

2సమూయేలు 16:2

2. రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలును అంజూరపు అడలును పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసటనొందినవారు త్రాగుటకును తెచ్చితిననగా

ఎండిన పండ్లు

1సమూయేలు 25:18

18. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱల మాంసమును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్దభములమీద వేయించి

1సమూయేలు 30:12

12. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా

తేనె

పరమగీతము 5:1

1. నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి.

యెషయా 7:15

15. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.

నూనె

ద్వితియోపదేశాకాండము 12:17

17. నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱమేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్చార్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక

సామెతలు 21:17

17. సుఖభోగములయందు వాంఛ గలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు.

యెహెజ్కేలు 16:13

13. ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియుగల బట్టలును నీకు ధరింపజేసి, గోధుమలును తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృధ్ధి నొందితివి.

వెనిగర్

సంఖ్యాకాండము 6:3

3. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.

రూతు 2:14

14. బోయజు భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను.

ద్రాక్ష సారాయి

2సమూయేలు 6:19

19. సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులగు స్త్రీ పురుషులకందరికి ఒక్కొక రొట్టెయు ఒక్కొక భక్ష్యమును ఒక్కొక ద్రాక్షపండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.

యోహాను 2:3

3. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా

యోహాను 2:10

10. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.

నీరు

ఆదికాండము 21:14

14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.

మత్తయి 10:42

42. మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

1రాజులు 13:9

9. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని రాజుతో అనెను.

1రాజులు 13:16

16. అతడు నేను నీతోకూడ మరలి రాజాలను, నీ యింట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను

ఆదికాండము 27:9

9. నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడనుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను.

సామెతలు 31:15

15. ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును.

యెషయా 8:13

13. సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.

వచనాలు అందుబాటులో లేవు.

ఉదయం, పొదుపుగా

న్యాయాధిపతులు 19:5

5. నాలుగవ నాడు వారు వేకు వను వెళ్లుటకు నిద్రమేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రినీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్లవచ్చునని

ప్రసంగి 10:16

16. దేశమా, దాసుడు నీకు రాజై యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై యుండుటయు నీకు అశుభము.

ప్రసంగి 10:17

17. దేశమా, నీ రాజు గొప్పయింటివాడై యుండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలము నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై యుండుటకు నీకు శుభము.

మధ్యాహ్నం వద్ద

ఆదికాండము 43:16

16. యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహకునితో ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను.

యోహాను 4:6

6. అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావియొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.

యోహాను 4:8

8. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.

సాయంత్రం

ఆదికాండము 24:11

11. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోకరింపచేసి యిట్లనెను

ఆదికాండము 24:33

33. అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పనిచెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను.

లూకా 24:29

29. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితోకూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.

లూకా 24:30

30. ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా

తరచుగా కూర్చోవడం

ఆదికాండము 27:19

19. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను

ఆదికాండము 43:33

33. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్య పడిరి.

తరచుగా పడుకోవడం

ఆమోసు 6:4

4. దంతపు మంచములమీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు.

యోహాను 13:23

23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను

చేతితో

మత్తయి 26:23

23. ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.

లూకా 22:21

21. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడ ఈ బల్లమీద ఉన్నది.

మార్కు 8:6

6. అప్పుడాయన నేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి

అపోస్తలులకార్యములు 27:35

35. ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తినసాగెను.

2రాజులు 3:11

11. యెహోషాపాతు అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణచేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు వచ్చిన1షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా

మత్తయి 15:2

2. నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందునిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి

మత్తయి 26:30

30. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.

ఆదికాండము 18:8

8. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.

ఆదికాండము 18:9

9. వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను.

ఎస్తేరు 1:3

3. తన యేలుబడి యందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాద్య దేశము యొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధినుండగా

ఎస్తేరు 1:9

9. రాణియైన వష్తి కూడ రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను.

1సమూయేలు 17:18

18. మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొనిపోయి వారి సహస్రాధిపతి కిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొనిరమ్మని చెప్పి పంపివేసెను.

1సమూయేలు 25:18

18. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱల మాంసమును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్దభములమీద వేయించి

1సమూయేలు 25:27

27. అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి

2సమూయేలు 16:1

1. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసికొనివచ్చెను; రెండు వందల రొట్టెలును నూరు ద్రాక్ష గెలలును నూరు అంజూరపు అడలును ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటిమీద వేసియుండెను.

2సమూయేలు 16:2

2. రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలును అంజూరపు అడలును పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసటనొందినవారు త్రాగుటకును తెచ్చితిననగా