ఆశ్రయపురములు
13. అయితే వాడు చంపవలెనని పొంచియుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగినయెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.
11. ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను.
3. హత్యవిషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును.
41. అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపినయెడల 42. చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పుదిక్కున, యొర్దాను ఇవతల మూడు పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికినైనను పారిపోయి బ్రదుకును. 43. అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.
7. అప్పుడు వారు నఫ్తా లీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయి మీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి.
8. తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.
వచనాలు అందుబాటులో లేవు.
3. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని, నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశముయొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలెను.
10. గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.
4. ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వార మునొద్ద నిలిచి, ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత, వారు పురములోనికి వానిని చేర్చుకొని తమయొద్ద నివ సించుటకు వానికి స్థలమియ్యవలెను.
15. పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించువారికిని ఆశ్రయమైయుండును.
వచనాలు అందుబాటులో లేవు.
వారి విచారణలో ఉంచారు
12. పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమునెదుట నిలుచువరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండ అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును.
24. కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టినవానికిని హత్య విషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పు తీర్చవలెను.
వెలుపల రక్షణ లేదు
26. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురముయొక్క సరిహద్దును దాటి వెళ్లునప్పుడు
27. నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురముయొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనినయెడల, ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వానిమీద ప్రాణముతీసిన దోషము ఉండదు.
ప్రధాన యాజకుడు మరణించేంత వరకు లోపలే ఉండాలి
25. అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధతైలముతో అభిషేకింపబడిన ప్రధానయాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.
28. ఏలయనగా ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్లవచ్చును.
14. అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.
16. ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. 17. ఒకడు చచ్చునట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. 18. మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. 19. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను. 20. వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంపవలెను. 21. నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను.
వచనాలు అందుబాటులో లేవు.
క్రీస్తు యొక్క
2. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
4. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.
సువార్త యొక్క నిరీక్షణ
18. మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
8. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పకయుందురు
6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.