అంశాల జాబితాకు వెనుకకు

యేసుక్రీస్తు మధ్యవర్తి

ఎఫెసీయులకు 2:13-18

13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు. 14. ఆయన మన సమాధానమై యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను. 15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, 16. తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైయున్నాడు. 17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. 18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి యున్నాము.

హెబ్రీయులకు 9:15

15. ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమునుగూర్చిన వాగ్దానమును పొందునిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైయున్నాడు.

హెబ్రీయులకు 12:24

24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.

1తిమోతి 2:5

5. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

హెబ్రీయులకు 8:6

6. ఈయనయైతే ఇప్పుడు మరి యెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియైయున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు.

హెబ్రీయులకు 12:24

24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.

వచనాలు అందుబాటులో లేవు.

మోషే

ద్వితియోపదేశాకాండము 5:5

5. గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచియుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను.

గలతీయులకు 3:19

19. ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతిక్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.

ఆరోన్

సంఖ్యాకాండము 16:48

48. అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను.