Display Topic


Know not God

1సమూయేలు 2:12 – ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులై యుండిరి.

Are void of understanding

సామెతలు 7:7 – యౌవనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.

Are proud

యెషయా 3:5 – ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.

With regard to parents

-Hearken Not to them

1సమూయేలు 2:25 – నరునికి నరుడు తప్పుచేసిన యెడల దేవుడు విమర్శచేయును గాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.

-Despise them

సామెతలు 15:5 – మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.

సామెతలు 15:20 – జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.

యెహెజ్కేలు 22:7 – నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,

-Curse them

సామెతలు 30:11 – తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు.

-Bring reproach on them

సామెతలు 19:26 – తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.

-Are A calamity to them

సామెతలు 19:13 – బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము.

-Are A grief to them

సామెతలు 17:25 – బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును

-Despised their elders

యోబు 19:18 – చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినయెడల బాలురు నామీద దూషణలు పలికెదరు.

Punishment of, for

-Setting light by parents

ద్వితియోపదేశాకాండము 27:16 – తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

-Disobeying parents

ద్వితియోపదేశాకాండము 21:21 – అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.

-Mocking parents

సామెతలు 30:17 – తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.

-Cursing parents

నిర్గమకాండము 21:15 – తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.

మార్కు 7:10 – నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా.

-Smiting parents

నిర్గమకాండము 21:15 – తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.

-Mocking of A prophet

2రాజులు 2:23 – అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కివెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా

2రాజులు 2:24 – అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చివేసెను.

-Gluttony and drunkenness

ద్వితియోపదేశాకాండము 21:20 – మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడియున్నాడు; మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయెనని ఊరి పెద్దలతో చెప్పవలెను.

ద్వితియోపదేశాకాండము 21:21 – అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.

Their guilt in robbing parents

సామెతలు 28:24 – తన తలిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు.

Exemplified

-Esau

ఆదికాండము 26:34 – ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లి చేసికొనెను.

ఆదికాండము 26:35 – వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.

-Sons of Eli

1సమూయేలు 2:12 – ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులై యుండిరి.

1సమూయేలు 2:17 – అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యౌవనులు కారణమైరి, గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను.

-Sons of Samuel

1సమూయేలు 8:3 – వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా

-Absalom

2సమూయేలు 15:10 – అబ్షాలోము మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటియొద్దకు వేగులవారిని పంపెను.

-Adonijah

1రాజులు 1:5 – హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించినవాడై నేనే రాజునగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్పరచుకొనెను.

1రాజులు 1:6 – అతని తండ్రి నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతనిచేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు.

-Children at Bethel

2రాజులు 2:23 – అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కివెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా

-Adrammelech and Sharezer

2రాజులు 19:37 – వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి; అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.