Display Topic


Commanded

నిర్గమకాండము 20:14 – వ్యభిచరింపకూడదు.

సామెతలు 31:3 – నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము

అపోస్తలులకార్యములు 15:20 – విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.

రోమీయులకు 13:13 – అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము

కొలొస్సయులకు 3:5 – కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను6 చంపివేయుడి.

1దెస్సలోనీకయులకు 4:3 – మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.

Required in look

యోబు 31:1 – నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?

మత్తయి 5:28 – నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.

Required in heart

సామెతలు 6:25 – దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొననియ్యకుము.

Required in speech

ఎఫెసీయులకు 5:3 – మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.

Keep the body in

1కొరిందీయులకు 6:13 – భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.

1కొరిందీయులకు 6:15 – మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు.

1కొరిందీయులకు 6:16 – వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమైయుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?

1కొరిందీయులకు 6:17 – అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.

1కొరిందీయులకు 6:18 – జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.

Preserved by wisdom

సామెతలు 2:10 – జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును

సామెతలు 2:11 – బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.

సామెతలు 2:16 – మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షించును.

సామెతలు 7:1 – నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీయొద్ద దాచిపెట్టుకొనుము.

సామెతలు 7:2 – నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.

సామెతలు 7:3 – నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము

సామెతలు 7:4 – జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.

సామెతలు 7:5 – అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండను ఇచ్చకములాడు పర స్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.

Saints are kept in

ప్రసంగి 7:26 – మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవుని దృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.

Advantages of

1పేతురు 3:1 – అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;

1పేతురు 3:2 – అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.

Shun those devoid of

1కొరిందీయులకు 5:11 – ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను.

1పేతురు 4:3 – మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును,

The wicked are devoid of

రోమీయులకు 1:29 – అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై

ఎఫెసీయులకు 4:19 – వారు సిగ్గులేనివారై యుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

2పేతురు 2:14 – వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులునైయుండి,

యూదా 1:8 – అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.

Temptation to deviate from, dangerous

2సమూయేలు 11:2 – ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.

2సమూయేలు 11:3 – ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా

2సమూయేలు 11:4 – దావీదు దూతలచేత ఆమెను పిలువనంపెను. ఆమె అతనియొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.

Consequences of associating with those devoid of

సామెతలు 7:25 – జార స్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.

సామెతలు 7:26 – అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది

సామెతలు 7:27 – దాని యిల్లు పాతాళమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.

సామెతలు 22:14 – వేశ్య నోరు లోతైన గొయ్యి యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును.

Want of, excludes from heaven

గలతీయులకు 5:19 – శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

గలతీయులకు 5:20 – విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

గలతీయులకు 5:21 – భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

Drunkenness destructive to

సామెతలు 23:31 – ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.

సామెతలు 23:32 – పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.

సామెతలు 23:33 – విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు

Breach of, punished

1కొరిందీయులకు 3:16 – మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

1కొరిందీయులకు 3:17 – ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు.

ఎఫెసీయులకు 5:5 – వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.

ఎఫెసీయులకు 5:6 – వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి; ఇట్టి క్రియలవలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును

హెబ్రీయులకు 13:4 – వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

ప్రకటన 22:15 – కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

Motives for

1కొరిందీయులకు 6:19 – మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

1దెస్సలోనీకయులకు 4:7 – పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.

Exemplified

-Abimelech

ఆదికాండము 20:4 – అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా?

ఆదికాండము 20:5 – ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ అతడు నా అన్న అనెను. నేనుచేతులతో ఏ దోషము చేయక యధార్థహృదయముతో ఈ పని చేసితిననెను.

ఆదికాండము 26:10 – అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు గదా అనెను.

ఆదికాండము 26:11 – అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికి ఆజ్ఞాపింపగా

-Joseph

ఆదికాండము 39:7 – అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను

ఆదికాండము 39:8 – అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నాచేతికప్పగించెను గదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.

ఆదికాండము 39:9 – నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.

ఆదికాండము 39:10 – దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు.

-Ruth

రూతు 3:10 – అతడు నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ప్రవర్తన కంటె వెనుకటి సత్‌ప్రవర్తన మరి ఎక్కువైనది.

రూతు 3:11 – కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు.

-Boaz

రూతు 3:13 – ఈ రాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొనుమని చెప్పెను.