display topic
Abominable
ప్రకటన 21:8 – పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
Alienated from God
ఎఫెసీయులకు 4:18 – వారైతే అంధకారమైన మనస్సు గలవారై, తమ హృదయకాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.
కొలొస్సయులకు 1:21 – మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియలవలన మీ మనస్సులో విరోధభావము గలవారునై యుండిన మిమ్మును కూడ
Blasphemous
లూకా 22:65 – నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి.
ప్రకటన 16:9 – కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు.
Blinded
2కొరిందీయులకు 4:4 – దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
ఎఫెసీయులకు 4:18 – వారైతే అంధకారమైన మనస్సు గలవారై, తమ హృదయకాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.
Boastful
కీర్తనలు 10:3 – దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు
కీర్తనలు 49:6 – తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధనవిస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను?
Conspiring against God’s people
నెహెమ్యా 4:8 – మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, పని ఆటంకపరచవలెనని వారందరు కట్టుకట్టి మమ్మును కలతపరచగా,
నెహెమ్యా 6:2 – సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి.
కీర్తనలు 38:12 – నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడుచేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.
Covetous
మీకా 2:2 – వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.
రోమీయులకు 1:29 – అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై
Deceitful
కీర్తనలు 5:6 – అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.
రోమీయులకు 3:13 – వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది
Delighting in the iniquity of others
సామెతలు 2:14 – కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.
రోమీయులకు 1:32 – ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
Despising the works of the faithful
నెహెమ్యా 2:19 – అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి.
నెహెమ్యా 4:2 – షోమ్రోను దండువారి యెదుటను తన స్నేహితుల యెదుటను ఇట్లనెను దుర్బలులైన యీ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే యీ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా?
2తిమోతి 3:3 – అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు
2తిమోతి 3:4 – ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు,
Destructive
యెషయా 59:7 – వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
Disobedient
నెహెమ్యా 9:26 – అయినను వారు అవిధేయులై నీమీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి.
తీతుకు 3:3 – ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వము నందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని
1పేతురు 2:7 – విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.
Enticing to evil
సామెతలు 1:10 – నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
సామెతలు 1:11 – మాతోకూడ రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము
సామెతలు 1:12 – పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.
సామెతలు 1:13 – పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము
సామెతలు 1:14 – నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు.
2తిమోతి 3:6 – పాపభరితులై నానావిధములైన దురాశలవలన నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను,
Envious
నెహెమ్యా 2:10 – హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.
తీతుకు 3:3 – ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వము నందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని
Fearful
సామెతలు 28:1 – ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.
ప్రకటన 21:8 – పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
Fierce
సామెతలు 16:29 – బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును.
2తిమోతి 3:3 – అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు
Foolish
ద్వితియోపదేశాకాండము 32:6 – బుద్ధిలేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా?ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.
కీర్తనలు 5:5 – డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు
Forgetting God
యోబు 8:13 – దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.
Fraudulent
కీర్తనలు 37:21 – భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.
మీకా 6:11 – తప్పు త్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?
Froward
సామెతలు 21:8 – దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము.
యెషయా 57:17 – వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.
Glorying in their shame
ఫిలిప్పీయులకు 3:19 – నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటియందే మనస్సు నుంచుచున్నారు.
Hard-hearted
యెహెజ్కేలు 3:7 – అయితే ఇశ్రాయేలీయులందరు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై, నేను చెప్పిన మాటల నాలకింపనొల్లక యున్నారు గనుక నీ మాటలు విననొల్లరు.
Hating the light
యోబు 24:13 – వెలుగుమీద తిరుగబడువారు కలరు వీరు దాని మార్గములను గురుతుపట్టరు దాని త్రోవలలో నిలువరు.
యోహాను 3:20 – దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
Heady and high-minded
2తిమోతి 3:4 – ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు,
Hostile to God
రోమీయులకు 8:7 – ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.
కొలొస్సయులకు 1:21 – మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియలవలన మీ మనస్సులో విరోధభావము గలవారునై యుండిన మిమ్మును కూడ
Hypocritical
యెషయా 29:13 – ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి.
2తిమోతి 3:5 – పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.
Ignorant of God
హోషేయ 4:1 – ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు.
2దెస్సలోనీకయులకు 1:8 – మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
Impudent
యెహెజ్కేలు 2:4 – వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారియొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు
Incontinent
2తిమోతి 3:3 – అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు
Infidel
కీర్తనలు 10:4 – దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు
కీర్తనలు 14:1 – దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.
Loathsome
సామెతలు 13:5 – నీతిమంతునికి కల్లమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.
Lovers of pleasure more than of God
2తిమోతి 3:4 – ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు,
Lying
కీర్తనలు 58:3 – తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.
కీర్తనలు 62:4 – అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. (సెలా.)
యెషయా 59:4 – నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.
Mischievous
సామెతలు 24:8 – కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును.
మీకా 7:3 – రెండుచేతులతోను కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగున వారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు.
Murderous
కీర్తనలు 10:8 – తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును.
కీర్తనలు 94:6 – యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు
రోమీయులకు 1:29 – అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై
Prayerless
యోబు 21:15 – మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు
కీర్తనలు 53:4 – దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?
Persecuting
కీర్తనలు 69:26 – నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.
కీర్తనలు 109:16 – ఏలయనగా కృప చూపవలెనన్న మాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను.
Perverse
ద్వితియోపదేశాకాండము 32:5 – వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులు కారు; వారు కళంకులు మూర్ఖతగల వక్రవంశము.
Proud
కీర్తనలు 59:12 – వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాపమునుబట్టియు వారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక.
ఓబధ్యా 3:2 –
2తిమోతి 3:2 – ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
Rejoicing in the affliction of saints
కీర్తనలు 35:15 – నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.
Reprobate
2కొరిందీయులకు 13:5 – మీరు విశ్వాసము గలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మునుగూర్చి మీరే యెరుగరా?
2తిమోతి 3:8 – యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు.
తీతుకు 1:16 – దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై యుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.
Selfish
2తిమోతి 3:2 – ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
Sensual
ఫిలిప్పీయులకు 3:19 – నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటియందే మనస్సు నుంచుచున్నారు.
యూదా 1:19 – అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునై యుండి భేదములు కలుగజేయుచున్నారు.
Sold under sin
1రాజులు 21:20 – అంతట అహాబు ఏలీయాను చూచి నా పగవాడా, నీచేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెను యెహోవా దృష్టికి కీడుచేయుటకు నిన్ను నీవే అమ్ముకొనియున్నావు గనుక నాచేతిలో నీవు చిక్కితివి.
2రాజులు 17:17 – మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.
Stiff-hearted
యెహెజ్కేలు 2:4 – వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారియొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు
Stiff-necked
నిర్గమకాండము 33:5 – కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.
అపోస్తలులకార్యములు 7:51 – ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
Uncircumcised in heart
యిర్మియా 9:26 – ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.
అపోస్తలులకార్యములు 7:51 – ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
Unjust
సామెతలు 11:7 – భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.
యెషయా 26:10 – దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.
Unmerciful
రోమీయులకు 1:31 – మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.
Ungodly
సామెతలు 16:27 – పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది.
Unholy
2తిమోతి 3:2 – ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
Unprofitable
మత్తయి 25:30 – మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.
రోమీయులకు 3:12 – అందరును త్రోవతప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.
Unruly
తీతుకు 1:10 – అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు.
Unthankful
లూకా 6:35 – మీరైతే ఎట్టి వారినిగూర్చి యైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.
2తిమోతి 3:2 – ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
Untoward
అపోస్తలులకార్యములు 2:40 – ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను.
Unwise
ద్వితియోపదేశాకాండము 32:6 – బుద్ధిలేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా?ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.