Display Topic


For burning incense

లేవీయకాండము 10:1 – అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా

2దినవృత్తాంతములు 26:19 – ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తినిచేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచునేయున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను.

Made of

-Brass

సంఖ్యాకాండము 16:39 – అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి,

-gold

1రాజులు 7:50 – మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరమను అతి పరిశుద్ధమైన స్థలముయొక్క తలుపులకును మందిరమను ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్నిటిని చేయించెను, ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను.

One of gold in the most holy place

హెబ్రీయులకు 9:4 – అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోనుచేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను

Directions for removing

సంఖ్యాకాండము 4:14 – దానిమీద తమ సేవోపకరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లుగరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను.

Often used in idolatrous worship

యెహెజ్కేలు 8:11 – మరియు ఒక్కొకడు తనచేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బదిమందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆ యాకారములకు ఎదురుగా నిలిచియుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను.

Of Korah, &c made into plates to cover the altar

సంఖ్యాకాండము 16:18 – కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్నియుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి.

సంఖ్యాకాండము 16:39 – అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి,

Typical of Christ’s intercession

ప్రకటన 8:3 – మరియు సువర్ణ ధూపార్తిచేత పట్టుకొనియున్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.

ప్రకటన 8:5 – ఆ దూత ధూపార్తిని తీసికొని, బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.