Display Topic

Natural

హెబ్రీయులకు 11:38 – అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.

Artificial

న్యాయాధిపతులు 6:2 – మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.

Found in the

-open fields

ఆదికాండము 23:20 – ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.

-rocks

యెషయా 2:19 – యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.

Were used as

-dwelling-places

ఆదికాండము 19:30 – లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.

-places of concealment

1సమూయేలు 13:6 – ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి.

1సమూయేలు 14:11 – వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండు కాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులు చూడుడి, తాము దాగియుండిన గుహలలోనుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు

1రాజులు 18:4 – యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.

హెబ్రీయులకు 11:38 – అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.

-Resting places

1సమూయేలు 24:3 – మార్గముననున్న గొఱ్ఱదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక

1రాజులు 19:9 – అచ్చట ఉన్న యొక గుహలో చేరి బసచేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా

-burial places

ఆదికాండము 23:19 – ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.

యోహాను 11:38 – యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.

-Haunts of robbers

యిర్మియా 7:11 – నాదని చాటబడిన యీ మందిరము మీ దృష్టికి దొంగలగుహయైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.

మత్తయి 21:13 – నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.

-Hiding Placed of wild beasts

నహూము 2:12 – తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కిపట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడిపట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను?

Often capacious

1సమూయేలు 22:1 – దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి.

1సమూయేలు 22:2 – మరియు ఇబ్బంది గలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండువారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందలమంది వచ్చియుండిరి.

1సమూయేలు 24:3 – మార్గముననున్న గొఱ్ఱదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక

Afford no protection from the judgments of God

యెషయా 2:19 – యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.

యెహెజ్కేలు 33:27 – నా జీవముతోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గముచేత కూలుదురు, బయట పొలములో ఉండువారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను, కోటలలోనివారును గుహలలోనివారును తెగులుచేత చచ్చెదరు.

ప్రకటన 6:15 – భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను

Mentioned in scripture

-Adullam

1సమూయేలు 22:1 – దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి.

-Engedi

1సమూయేలు 23:29 – తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.

1సమూయేలు 24:1 – సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగిరాగా దావీదు ఏన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను.

1సమూయేలు 24:3 – మార్గముననున్న గొఱ్ఱదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక

-Machpelah

ఆదికాండము 23:9 – సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీ మధ్యను శ్మశానభూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను.

-Makkedah

యెహోషువ 10:16 – ఆ రాజులయిదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి.

యెహోషువ 10:17 – మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజులయిదుగురు దొరికిరని యెహోషు వకు తెలుపబడినప్పుడు