Display Topic


To be offered only to the Lord

న్యాయాధిపతులు 13:16 – యెహోవా దూతనీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను; నీవు దహనబలి అర్పించ నుద్దేశించినయెడల యెహోవాకు దాని నర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు.

Specially acceptable

ఆదికాండము 8:21 – అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇకమీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను

లేవీయకాండము 1:9 – అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠముమీద దహింపవలెను.

లేవీయకాండము 1:13 – దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

లేవీయకాండము 1:17 – అతడు దాని రెక్కలసందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

The most ancient of all sacrifices

ఆదికాండము 4:4 – హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను;

ఆదికాండము 8:20 – అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.

ఆదికాండము 22:2 – అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను

ఆదికాండము 22:13 – అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను

యోబు 1:5 – వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.

Offered by the Jews before the law

నిర్గమకాండము 10:25 – మోషే మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను.

నిర్గమకాండము 24:5 – ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహన బలులనర్పించి యెహోవాకు సమాధాన బలులగా కోడెలను వధించిరి.

To be taken from

-the flock or herd

లేవీయకాండము 1:2 – నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవుల మందలోనుండిగాని గొఱ్ఱల మందలోనుండిగాని మేకల మందలోనుండిగాని దానిని తీసికొనిరావలెను.

-the Fowls

లేవీయకాండము 1:14 – అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షిజాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలోనుండి గాని పావురపు పిల్లలలోనుండి గాని తేవలెను.

Was an atonement for sin

లేవీయకాండము 9:7 – మరియు మోషే అహరోనుతో ఇట్లనెను నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి ప్రజల కొరకు అర్పణము చేసి, యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము.

Guilt transferred to, by imposition of hands

లేవీయకాండము 1:4 – అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.

సంఖ్యాకాండము 8:12 – లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి

Required to be

-Killed, If A beast, by the person who Brought it

లేవీయకాండము 1:5 – అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.

లేవీయకాండము 1:11 – బలిపీఠపు ఉత్తరదిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

-Killed, If A bird, by the Priest

లేవీయకాండము 1:15 – యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠముమీద దాని దహింపవలెను, దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను.

-for the people at large, Killed and Prepared by the Levites

యెహెజ్కేలు 44:11 – అయినను వారు నా పరిశుద్ధస్థలములో పరిచర్య చేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలి పశువులను వధించువారు, పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు.

-A male without blemish

లేవీయకాండము 1:3 – అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగదానిని తీసికొనిరావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.

లేవీయకాండము 22:19 – వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱమేకలలోనుండి యైనను దోషములేని మగదానిని అర్పింపవలెను.

-Voluntary

లేవీయకాండము 1:3 – అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగదానిని తీసికొనిరావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.

లేవీయకాండము 22:18 – నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఇట్లు చెప్పుము ఇశ్రాయేలీయుల యింటివారిలోనేగాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశులలోనేగాని యెవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబళ్లనైనను అర్పించునో

లేవీయకాండము 22:19 – వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱమేకలలోనుండి యైనను దోషములేని మగదానిని అర్పింపవలెను.

-Presented at the door of the Tabernacle

లేవీయకాండము 1:3 – అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగదానిని తీసికొనిరావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.

ద్వితియోపదేశాకాండము 12:6 – అక్కడికే మీరు మీ దహనబలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱమేకలలోను తొలిచూలు వాటిని తీసికొనిరావలెను.

ద్వితియోపదేశాకాండము 12:11 – నేను మికాజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహనబలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొనిరావలెను.

ద్వితియోపదేశాకాండము 12:14 – యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకాజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను.

-offered by Priests Only

లేవీయకాండము 1:9 – అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠముమీద దహింపవలెను.

యెహెజ్కేలు 44:15 – ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధస్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి, క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

-offered in righteousness

కీర్తనలు 51:19 – అప్పుడు నీతియుక్తములైన బలులును దహనబలులును సర్వాంగ హోమములును నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠముమీద కోడెల నర్పించెదరు.

-Entirely burned

లేవీయకాండము 1:8 – అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను.

లేవీయకాండము 1:9 – అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠముమీద దహింపవలెను.

లేవీయకాండము 1:12 – దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను.

లేవీయకాండము 1:13 – దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

లేవీయకాండము 6:9 – నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము ఇది దహనబలిని గూర్చిన విధి. దహనబలి ద్రవ్యము ఉదయమువరకు రాత్రి అంతయు బలిపీఠముమీద దహించుచుండును; బలిపీఠముమీది అగ్ని దానిని దహించుచుండును.

Blood of, sprinkled round about upon the altar

లేవీయకాండము 1:5 – అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.

లేవీయకాండము 1:11 – బలిపీఠపు ఉత్తరదిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

If a bird, the blood was wrung out at the side of the altar

లేవీయకాండము 1:15 – యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠముమీద దాని దహింపవలెను, దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను.

Ashes of, collected at foot of the altar, and conveyed without the camp

లేవీయకాండము 6:11 – తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదెను తీసికొనిపోవలెను.

Skin of, given to the priests for clothing

లేవీయకాండము 7:8 – ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది; అది అతనిదగును.

ఆదికాండము 3:21 – దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.

Was offered

-Every morning and evening

నిర్గమకాండము 29:38 – నీవు బలిపీఠముమీద నిత్యమును అర్పింపవలసినదేమనగా, ఏడాదివి రెండు గొఱ్ఱపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱపిల్లను

నిర్గమకాండము 29:39 – సాయంకాలమందు ఒక గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.

నిర్గమకాండము 29:40 – దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.

నిర్గమకాండము 29:41 – అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను.

నిర్గమకాండము 29:42 – ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును.

-Every Sabbath day

సంఖ్యాకాండము 28:9 – విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను.

సంఖ్యాకాండము 28:10 – నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతిదినమున చేయవలసిన దహనబలి.

-the First day of Every month

సంఖ్యాకాండము 28:11 – నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,

-the seven days of unleavened bread

సంఖ్యాకాండము 28:19 – అయితే యెహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను

సంఖ్యాకాండము 28:24 – అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను.

-the day of atonement

లేవీయకాండము 16:3 – అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.

లేవీయకాండము 16:5 – మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొనిరావలెను.

సంఖ్యాకాండము 29:8 – ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలియు నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములునుగాక, మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై యుండవలెను.

-at consecration of Levites

సంఖ్యాకాండము 8:12 – లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి

-at consecration Priests

లేవీయకాండము 9:2 – అహరోనుతో ఇట్లనెను నీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసికొనిరమ్ము.

లేవీయకాండము 9:12 – అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తమునప్పగింపగా అతడు బలిపీఠముచుట్టు దానిని ప్రోక్షించెను.

లేవీయకాండము 9:13 – మరియు వారు దహనబలి పశువుయొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠముమీద వాటిని దహించెను.

లేవీయకాండము 9:14 – అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠముమీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను.

-at consecration of Kings

1దినవృత్తాంతములు 29:21 – తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱపొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱపిల్లలను వాటి పానార్పణలతో కూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి.

1దినవృత్తాంతములు 29:22 – ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.

1దినవృత్తాంతములు 29:23 – అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులైయుండిరి.

-at purification of Women

లేవీయకాండము 12:6 – కుమారునికొరకే గాని కుమార్తెకొరకే గాని ఆమె శుద్ధిదినములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.

-for Nazarites after defilement, or at the end of their vow

సంఖ్యాకాండము 6:11 – అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవ దానితో దహనబలిని అర్పించి, వాడు శవము ముట్టుటవలన పాపియైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధ పరపవలెను.

సంఖ్యాకాండము 6:14 – అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను, సమాధానబలిగాను నిర్దోషమైన యొక పొట్టేలును,

-for the healed leper

లేవీయకాండము 14:13 – అతడు పాపపరిహారార్థబలి పశువును దహనబలి పశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱపిల్లను వధింపవలెను. పాపపరిహారార్థమైన దానివలె అపరాధపరిహారార్థమైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము.

లేవీయకాండము 14:19 – అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరువాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలెను.

లేవీయకాండము 14:20 – యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠముమీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును.

-at dedication of Sacred places

సంఖ్యాకాండము 7:15 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను

1రాజులు 8:64 – ఆ దినమున యెహోవా సముఖమందున్న యిత్తడి బలిపీఠముఆ దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్యనుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించెను.

-after great mercies

1సమూయేలు 6:14 – ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండి యొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి.

2సమూయేలు 24:22 – అందుకు అరౌనానా యేలినవాడవగు నీవు చూచి యేది నీకు అనుకూలమో దాని తీసికొని బలి అర్పించుము; చిత్తగించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకఱ్ఱ సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును.

2సమూయేలు 24:25 – అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను.

-before going to war

1సమూయేలు 7:9 – సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగబలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.

-with sounds of trumpets at feasts

సంఖ్యాకాండము 10:10 – మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలులనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.

The fat, &c of all peace offerings laid on, and consumed with the daily

లేవీయకాండము 3:5 – అహరోను కుమారులు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

లేవీయకాండము 6:12 – బలిపీఠముమీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలువేసి, దానిమీద దహనబలి ద్రవ్యమును ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను.

Of the wicked, not accepted by God

యెషయా 1:10 – సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆలకించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి.

యెషయా 1:11 – యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

యిర్మియా 6:19 – భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.

యిర్మియా 6:20 – షేబనుండి వచ్చు సాంబ్రాణి నాకేల? దూరదేశమునుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల? మీ దహనబలులు నాకిష్టమైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు.

ఆమోసు 5:22 – నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను.

Obedience better than

1సమూయేలు 15:22 – అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.

యిర్మియా 7:21 – సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి.

యిర్మియా 7:22 – నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులను గూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టివాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చితిని

యిర్మియా 7:23 – ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనైయుందును మీరు నాకు జనులైయుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞాపించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.

Knowledge of God better than

హోషేయ 6:6 – నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.

Love of God better than

మార్కు 12:33 – పూర్ణహృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణబలముతోను, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగహోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను.

Abraham tried by the command to offer Isaac as

ఆదికాండము 22:1 – ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా, అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను.

ఆదికాండము 22:2 – అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను

ఆదికాండము 22:3 – తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంతకట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.

ఆదికాండము 22:4 – మూడవనాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి

ఆదికాండము 22:5 – తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి

ఆదికాండము 22:6 – దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తనచేతితో నిప్పును కత్తిని పట్టుకొనిపోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా

ఆదికాండము 22:7 – ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱపిల్ల ఏది అని అడుగగా

ఆదికాండము 22:8 – అబ్రాహాము నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱపిల్లను చూచుకొనునని చెప్పెను.

ఆదికాండము 22:9 – ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.

ఆదికాండము 22:10 – అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా

ఆదికాండము 22:11 – యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

ఆదికాండము 22:12 – అప్పుడు ఆయన ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతనినేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను

ఆదికాండము 22:13 – అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను

ఆదికాండము 22:14 – అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడును.

ఆదికాండము 22:15 – యెహోవా దూత రెండవమారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను

ఆదికాండము 22:16 – నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున

ఆదికాండము 22:17 – నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

ఆదికాండము 22:18 – మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.

ఆదికాండము 22:19 – తరువాత అబ్రాహాము తన పనివారియొద్దకు తిరిగిరాగా వారు లేచి అందరును కలిసి బెయేర్షెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను.

ఆదికాండము 22:20 – ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను.

ఆదికాండము 22:21 – వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,

ఆదికాండము 22:22 – కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను.

ఆదికాండము 22:23 – ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.

ఆదికాండము 22:24 – మరియు రయూమా అను అతని, ఉపపత్నియు తెబహును, గహమును తహషును మయకాను కనెను.

Incapable of removing sin, and reconciling to God

కీర్తనలు 40:6 – బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు.

కీర్తనలు 50:8 – నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి.

హెబ్రీయులకు 10:6 – పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవి కావు.

The most costly, no adequate tribute to God

యెషయా 40:16 – సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు

కీర్తనలు 50:9 – నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను.

కీర్తనలు 50:10 – అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా

కీర్తనలు 50:11 – కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి.

కీర్తనలు 50:12 – లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.

కీర్తనలు 50:13 – వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?

Guilt of unauthorised persons offering

1సమూయేలు 13:12 – ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నామీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితిననెను.

1సమూయేలు 13:13 – అందుకు సమూయేలు ఇట్లనెను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమును ఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను; అయితే నీ రాజ్యము నిలువదు.

Guilt of offering, except in the place appointed

లేవీయకాండము 17:8 – మరియు నీవు వారితో ఇట్లనుము ఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలోగాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను

లేవీయకాండము 17:9 – యెహోవాకు అర్పింప నుద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును.

Of human victims execrated

ద్వితియోపదేశాకాండము 12:31 – తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవానుగూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కూమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా.

2రాజులు 3:27 – అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసికొని, పట్టణపు ప్రాకారముమీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.

యిర్మియా 7:31 – నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.

యిర్మియా 19:5 – నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారము నాచరించిరి; తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి.

Illustrative of

-the offering of Christ

ఎఫెసీయులకు 5:2 – క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.

హెబ్రీయులకు 10:8 – బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరిహారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత

హెబ్రీయులకు 10:9 – ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

హెబ్రీయులకు 10:10 – యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమునుబట్టి మనము పరిశుద్ధపరచబడి యున్నాము.

-Devotedness to God

రోమీయులకు 12:1 – కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.