Display Topic


Canaan abounded with

ద్వితియోపదేశాకాండము 8:7 – నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.

Often ran over pebbles

1సమూయేలు 17:40 – తన కఱ్ఱ చేతపట్టుకొని యేటి లోయలోనుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను.

యోబు 22:24 – మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము

Borders of, favourable to

-Grass

1రాజులు 18:5 – అహాబు దేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటిని చూడబోయి, పశువులన్నిటిని పోగొట్టుకొనకుండ గుఱ్ఱములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసికొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను.

-Willows

లేవీయకాండము 23:40 – మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజిచెట్ల కొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.

యోబు 40:22 – తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును.

-Reeds

యెషయా 19:7 – నైలునదీ ప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొనిపోయి కనబడకపోవును.

Abounded with fish

యెషయా 19:8 – జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించెదరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు

Afforded protection to a country

యెషయా 19:6 – ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.

Mentioned in scripture

-Arnon

సంఖ్యాకాండము 21:14 – కాబట్టి యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా

సంఖ్యాకాండము 21:15 – ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది.

-Besor

1సమూయేలు 30:9 – కాబట్టి దావీదు అతని యొద్దనున్న ఆరువందల మందియును బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి.

-Gaash

2సమూయేలు 23:30 – పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,

1దినవృత్తాంతములు 11:32 – గాయషుతోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,

-Cherith

1రాజులు 17:3 – నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;

1రాజులు 17:5 – అతడు పోయి యెహోవా సెలవుచొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.

-Eshcol

సంఖ్యాకాండము 13:23 – వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి.

సంఖ్యాకాండము 13:24 – ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను.

-Kidron

2సమూయేలు 15:23 – వారు సాగిపోవుచుండగా జనులందరు బహుగా ఏడ్చుచుండిరి, ఈ ప్రకారము వారందరు రాజుతోకూడ కిద్రోనువాగు దాటి అరణ్యమార్గమున ప్రయాణమైపోయిరి.

1రాజులు 15:13 – మరియు తన అవ్వయైన మయకా అసహ్యమైన యొకదాని చేయించి, దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును ఛిన్నాభిన్నములుగా కొట్టించి, కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవికాకుండ ఆమెను తొలగించెను.

యోహాను 18:1 – యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను.

-Kishon

1రాజులు 18:40 – అప్పుడు ఏలీయా ఒకనినైన తప్పించుకొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను.

కీర్తనలు 83:9 – మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.

-Zered

ద్వితియోపదేశాకాండము 2:13 – కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటితివిు.

-of the Willows

యెషయా 15:7 – ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొనిపోవుదురు.

Illustrative

-of Wisdom

సామెతలు 18:4 – మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.

-of temporal abundance

యోబు 20:17 – ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు.

– (Deceptive,) of false friends

యోబు 6:15 – నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.

– (Drinking of, by the way,) of help in distress

కీర్తనలు 110:7 – మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.