
A part of defensive armour
1రాజులు 22:34 – పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపుకీలు మధ్యను తగిలెను గనుక అతడునాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను.
A part of the high priest’s dress
నిర్గమకాండము 28:4 – పతకము ఏఫోదు నిలువుటంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
For soldiers
-made of Iron
ప్రకటన 9:9 – ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.
-Bright and shining
ప్రకటన 9:17 – మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండి యున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలువెడలుచుండెను.
For the high priest
-Materials of
నిర్గమకాండము 28:15 – మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధానపతకము చేయవలెను. ఏఫోదు పనివలె దాని చేయవలెను; బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.
నిర్గమకాండము 39:8 – మరియు అతడు ఏఫోదు పనివలె బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పంక్తులతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా పతకమును చేసెను.
-Form and dimensions of
నిర్గమకాండము 28:16 – అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను.
నిర్గమకాండము 39:9 – అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలది.
-made from the offering of the people
నిర్గమకాండము 35:9 – ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొనిరావలెను.
Had names of the tribes engraved on precious stones
నిర్గమకాండము 28:17 – దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది;
నిర్గమకాండము 28:18 – పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది;
నిర్గమకాండము 28:19 – గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది;
నిర్గమకాండము 28:20 – రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.
నిర్గమకాండము 28:21 – ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పండ్రెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరుచొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.
నిర్గమకాండము 39:10 – వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది;
నిర్గమకాండము 39:14 – ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేళ్లచొప్పున, పండ్రెండు ముద్రలవలె చెక్కబడిన వారి పేళ్లచొప్పున, పండ్రెండు గోత్రముల పేళ్ళు ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను.
Inseparably united to the ephod
నిర్గమకాండము 28:22 – మరియు ఆ పతకము అల్లికపనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను.
నిర్గమకాండము 28:23 – పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి
నిర్గమకాండము 28:24 – ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.
నిర్గమకాండము 28:25 – అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.
నిర్గమకాండము 28:26 – మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.
నిర్గమకాండము 28:27 – మరియు నీవు రెండు బంగారు ఉంగరములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను.
నిర్గమకాండము 28:28 – అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను
నిర్గమకాండము 39:15 – మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన గొలుసులు చేసిరి.
నిర్గమకాండము 39:16 – వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి ఆ రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి
నిర్గమకాండము 39:17 – అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలో వేసి
నిర్గమకాండము 39:18 – అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండు జవలకు తగిలించి ఏఫోదు భుజఖండములమీద దాని యెదుట ఉంచిరి.
నిర్గమకాండము 39:19 – మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి.
నిర్గమకాండము 39:20 – మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పునొద్దనున్న దాని యెదుటి ప్రక్కను, ఏఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి.
నిర్గమకాండము 39:21 – ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదునుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలిసూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
The Urim and Thummim placed in
నిర్గమకాండము 28:30 – మరియు నీవు న్యాయవిధానపతకములో ఊరీము తుమ్మీము అనువాటిని ఉంచవలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.
లేవీయకాండము 8:8 – ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి
Worn as a memorial
నిర్గమకాండము 28:29 – అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లునప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధానపతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను
యెషయా 49:16 – చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా యెదుటనున్నవి
Illustrative of the
-Righteous judgment of Christ
యెషయా 59:17 – నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను
-Defence of righteousness
ఎఫెసీయులకు 6:14 – ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని
-Defence of faith and love
1దెస్సలోనీకయులకు 5:8 – మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాసప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.