Display Topic


An instrument of war

ఆదికాండము 48:22 – నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయులచేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.

యెషయా 7:24 – ఈ దేశమంతయు గచ్చపొదలతోను బలురక్కసి చెట్లతోను నిండియుండును గనుక బాణములను విండ్లనుచేత పట్టుకొని జనులు అక్కడికి పోవుదురు.

Sometimes used in hunting

ఆదికాండము 27:3 – కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులపొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము.

For shooting arrows

1దినవృత్తాంతములు 12:2 – వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైనవారు.

Called the battle bow

జెకర్యా 9:10 – ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపువిల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును.

జెకర్యా 10:4 – వారిలోనుండి మూలరాయి పుట్టును, మేకును యుద్ధపువిల్లును వారిచేత కలుగును, బాధించువాడు వారిలోనుండి బయలుదేరును,

Those who used, called

-Bowmen

యిర్మియా 4:29 – రౌతులును విలుకాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరు పారిపోవుచున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు, ప్రతి పట్టణము నిర్జనమాయెను వాటిలొ నివాసులెవరును లేరు,

-Archers

1సమూయేలు 31:3 – యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులువేయువారి కంటబడి వారిచేత బహు గాయములనొందెను. అప్పుడు సౌలు

యిర్మియా 51:3 – విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును

Usually of steel

2సమూయేలు 22:35 – నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును.

యోబు 20:24 – ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడుచును.

Held in the left hand

యెహెజ్కేలు 39:3 – నీ యెడమచేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడిచేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను,

Drawn with full force

2రాజులు 9:24 – అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసిపోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను.

The Jews taught to use

2సమూయేలు 1:18 – అది యాషారు గ్రంథమందు లిఖింపబడియున్నది. ఎట్లనగా

Used expertly by

-Lydians

యిర్మియా 46:9 – గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.

-Elamites

యిర్మియా 49:35 – ఈలాగు సెలవిచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను.

-Philistines

1సమూయేలు 31:2 – సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.

1సమూయేలు 31:3 – యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులువేయువారి కంటబడి వారిచేత బహు గాయములనొందెను. అప్పుడు సౌలు

-Sons of Reuben, Gad, and Manasseh

1దినవృత్తాంతములు 5:18 – రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.

-Benjamites

1దినవృత్తాంతములు 12:2 – వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైనవారు.

2దినవృత్తాంతములు 14:8 – ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించి విల్లువేయు రెండు లక్షల ఎనుబది వేలమంది బెన్యామీనీయులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.

Given as a token of friendship

1సమూయేలు 18:4 – మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదున కిచ్చెను.

Often furnished by the state

2దినవృత్తాంతములు 26:14 – ఉజ్జియా యీ సైన్యమంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలలను చేయించెను.

Of the vanquished, broken and burned

కీర్తనలు 37:15 – వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.

యెహెజ్కేలు 39:9 – ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి, కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసికొని పొయ్యిలో కాల్చుదురు, వాటివలన ఏడు సంవత్సరములు అగ్ని మండును.

Illustrative

-of strength and Power

యోబు 29:20 – నాకు ఎడతెగని ఘనత కలుగును నాచేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా నుండును.

-of the tongue of the Wicked

కీర్తనలు 11:2 – దుష్టులు విల్లెక్కుపెట్టి యున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు

యిర్మియా 9:3 – విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.

– (When deceitful,) of the hypocrite

కీర్తనలు 78:57 – తమ పితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి.

హోషేయ 7:16 – వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తి పాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు.

– (When broken,) of the overthrow of power

1సమూయేలు 2:4 – ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు తొట్రిల్లినవారు బలము ధరించుదురు.

యిర్మియా 49:35 – ఈలాగు సెలవిచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను.

హోషేయ 1:5 – ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును.

హోషేయ 2:18 – ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకు జంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును.