Display Topic


Descended from Jacob’s tenth son

ఆదికాండము 30:19 – లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.

ఆదికాండము 30:20 – అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను

Predictions respecting

ఆదికాండము 49:13 – జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును.

ద్వితియోపదేశాకాండము 33:18 – జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలువెళ్లు స్థలమందు సంతోషించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.

ద్వితియోపదేశాకాండము 33:19 – వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతిబలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు.

Persons selected from

-to number the people

సంఖ్యాకాండము 1:9 – జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు

-to spy out the land

సంఖ్యాకాండము 13:10 – జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;

-to divide the land

సంఖ్యాకాండము 34:25 – జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని,

Strength of, on leaving Egypt

సంఖ్యాకాండము 1:30 – జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

సంఖ్యాకాండము 1:31 – జెబూలూను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది యేడువేల నాలుగు వందలమంది యైరి.

Formed the rear of the first division of the army of Israel in its journeys

సంఖ్యాకాండము 10:14 – యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.

సంఖ్యాకాండము 10:16 – జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి.

Encamped under the standard of Judah, east of the tabernacle

సంఖ్యాకాండము 2:3 – సూర్యుడు ఉదయించు తూర్పుదిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 2:7 – అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.

Offering of, at the dedication

సంఖ్యాకాండము 7:24 – మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను

సంఖ్యాకాండము 7:25 – నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:26 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

సంఖ్యాకాండము 7:27 – ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

సంఖ్యాకాండము 7:28 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

సంఖ్యాకాండము 7:29 – అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము.

Families of

సంఖ్యాకాండము 26:26 – ఏలోనీయులు ఏలోను వంశస్థులు; యహలేలీయులు యహలేలు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:27 – వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.

Strength of, on entering Canaan

సంఖ్యాకాండము 26:27 – వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.

On Ebal said amen to the curses

ద్వితియోపదేశాకాండము 27:13 – రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను.

A naval and commercial people

ఆదికాండము 49:13 – జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును.

Furnished scribes or writers to Israel

న్యాయాధిపతులు 5:14 – అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయు లును నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులును మాకీరునుండి న్యాయాధిపతులును జెబూలూనీయులనుండి నాయకదండము వహించు వారునువచ్చిరి.

Bounds of their inheritance

యెహోషువ 19:10 – మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.

యెహోషువ 19:11 – వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి

యెహోషువ 19:12 – శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి

యెహోషువ 19:13 – అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.

యెహోషువ 19:14 – దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.

యెహోషువ 19:15 – కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.

యెహోషువ 19:16 – ఆ పట్టణము లును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూ నీయులకు కలిగిన స్వాస్థ్యము.

Unable to drive out the Canaanites from their cities, but made them tributary

న్యాయాధిపతులు 1:30 – జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టిపనులు చేయువారైరి.

Praised for assisting Deborah and Barak in opposing Sisera

న్యాయాధిపతులు 5:14 – అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయు లును నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులును మాకీరునుండి న్యాయాధిపతులును జెబూలూనీయులనుండి నాయకదండము వహించు వారునువచ్చిరి.

న్యాయాధిపతులు 5:18 – జెబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము నఫ్తాలీయులు భూమి మెట్టలమీద ప్రాణము తృణీక రించిరి.

న్యాయాధిపతులు 4:10 – బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషు నకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుష్యులు అతనివెంట వెళ్లిరి;

Aided Gideon against the army of the Midianites

న్యాయాధిపతులు 6:35 – అతడు మనష్షీ యులందరియొద్దకు దూతలను పంపగా వారును కూడు కొని అతనియొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు జెబూలూను నఫ్తాలి గోత్రములవారియొద్దకు దూతలను పంపగా వారును కూడినవారిని ఎదుర్కొనుటకు వచ్చిరి.

Furnished a judge to Israel

న్యాయాధిపతులు 12:11 – అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను; అతడు పదియేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.

న్యాయాధిపతులు 12:12 – జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలో నులో పాతిపెట్టబడెను.

Some of, at David’s coronation

1దినవృత్తాంతములు 12:33 – జెబూలూనీయులలో సకలవిధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగినవారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపులేకుండ యుద్ధము చేయగలవారును ఏబదివేలమంది.

Officer appointed over by David

1దినవృత్తాంతములు 27:19 – ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను, అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను,

Only some of, assisted in Hezekiah’s reformation

2దినవృత్తాంతములు 30:10 – అంచెవాండ్రు జెబూలూను దేశమువరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరిగాని అచ్చటివారు ఎగతాళిచేసి వారిని అపహసించిరి.

2దినవృత్తాంతములు 30:11 – అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.

2దినవృత్తాంతములు 30:18 – ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా

Country of, blessed with the presence and instruction of Christ

యెషయా 9:1 – అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువలేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.

మత్తయి 4:13 – నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.

మత్తయి 4:14 – జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు

మత్తయి 4:15 – చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను

NA

NA