Display Topic


God makes

కీర్తనలు 74:17 – భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.

Yearly return of, secured by covenant

ఆదికాండము 8:22 – భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.

Coldness and inclemency of, noticed

సామెతలు 20:4 – విత్తులువేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.

యోహాను 10:22 – ఆలయప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను.

Unsuited for

-Travelling

మత్తయి 24:20 – అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.

2తిమోతి 4:21 – శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.

-Navigation

అపోస్తలులకార్యములు 27:9 – చాలకాలమైన తరువాత ఉపవాసదినము కూడ అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై యుండెను.

Ships were laid up in port during

అపోస్తలులకార్యములు 27:12 – మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకుచేరి అక్కడ శీతకాలము గడపవలెనని యెక్కువమంది ఆలోచన చెప్పిరి. అది నైఋతి వాయవ్యదిక్కుల తట్టుననున్న క్రేతురేవైయున్నది.

అపోస్తలులకార్యములు 28:11 – మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడపిన అశ్వినీ చిహ్నముగల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి

The Jews frequently had special houses for

యిర్మియా 36:22 – తొమ్మిదవ మాసమున రాజు శీతకాలపు నగరులో కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను.

ఆమోసు 3:15 – చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు.

Illustrative of seasons of spiritual adversity

పరమగీతము 2:11 – నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.