Display Topic
First mention of
ఆదికాండము 9:20 – నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.
ఆదికాండము 9:21 – పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.
Was made of
-the juice of the grape
ఆదికాండము 49:11 – ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
-the juice of the Pomegranate
పరమగీతము 8:2 – నేను నీకు మార్గదర్శినౌదును నా తల్లియింట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమఫల రసమును నేను నీకిత్తును.
First mode of making, notice
ఆదికాండము 40:11 – మరియు ఫరో గిన్నె నాచేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరోచేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను.
Generally made by treading the grapes in a press
నెహెమ్యా 13:15 – ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతిదినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానావిధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొనివచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని.
యెషయా 63:2 – నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్నవేమి?
యెషయా 63:3 – ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే.
Refining of, alluded to
యెషయా 25:6 – ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.
Improved by age
లూకా 5:39 – పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదనునని చెప్పెను.
Places celebrated for
-Canaan in general
ద్వితియోపదేశాకాండము 33:28 – ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును.
-possessions of Judah
ఆదికాండము 49:8 – యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
ఆదికాండము 49:11 – ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
ఆదికాండము 49:12 – అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
-Lebanon
హోషేయ 14:7 – అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.
-Helbon
యెహెజ్కేలు 27:18 – దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులును కొనుక్కొందురు.
-Assyria
2రాజులు 18:32 – అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లును గల దేశమునకును, ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొనిపోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు.
యెషయా 36:17 – అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమునుగల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొనిపోదును; యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు.
-Moab
యెషయా 16:8 – ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షా వల్లులు వాడిపోయెను దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరువరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకెను దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను.
యెషయా 16:9 – అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షా వల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపెదను ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు.
యెషయా 16:10 – ఆనందసంతోషములు ఫలభరితమైన పొలమునుండి మానిపోయెను ద్రాక్షలతోటలో సంగీతము వినబడదు ఉత్సాహధ్వని వినబడదు గానుగులలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడును లేడు ద్రాక్షలతొట్టి త్రొక్కువాని సంతోషపుకేకలు నేను మాన్పించియున్నాను.
యిర్మియా 48:32 – సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరును గూర్చిన యేడ్పును మించునట్లు నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజెరు సముద్రమువరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను పాడుచేయువాడు పడెను.
యిర్మియా 48:33 – ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమును లేకుండ చేయుచున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను.
Many kinds of
నెహెమ్యా 5:18 – నా నిమిత్తము ప్రతి దినము ఒక యెద్దును శ్రేష్ఠమైన ఆరు గొఱ్ఱలును సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను, పదిరోజులకు ఒకమారు నానావిధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు.
Sweet, esteemed for flavour and strength
యెషయా 49:26 – యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించెదను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తముచేత వారు మత్తులగుదురు.
ఆమోసు 9:13 – రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు; విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్షపండ్లు త్రొక్కువారు వత్తురు; పర్వతములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్ని రసధారలగును; ఇదే యెహోవా వాక్కు.
మీకా 6:15 – నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యక యుందువు, ఒలీవపండ్లను ద్రాక్షపండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసికొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు.
Red, most esteemed
సామెతలు 23:31 – ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
యెషయా 27:2 – ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును దానిగూర్చి పాడుడి.
Often spiced to increase its strength, &c
సామెతలు 9:2 – పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది
సామెతలు 9:5 – వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి
సామెతలు 23:30 – ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.
పరమగీతము 8:2 – నేను నీకు మార్గదర్శినౌదును నా తల్లియింట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమఫల రసమును నేను నీకిత్తును.
Was used
-as A beverage from the earliest age
ఆదికాండము 9:21 – పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.
ఆదికాండము 27:25 – అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము; నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను; అతడు తెచ్చినప్పుడు అతడు తినెను; ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.
-at all feasts and Entertainments
ఎస్తేరు 1:7 – అచ్చట కూడినవారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి.
ఎస్తేరు 5:6 – రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడు నని చెప్పగా
యెషయా 5:12 – వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.
దానియేలు 5:1 – రాజగు బెల్షస్సరు తన యధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందుచేయించి, ఆ వెయ్యిమందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను.
దానియేలు 5:2 – బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను.
దానియేలు 5:3 – అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చియుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి.
దానియేలు 5:4 – వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా
యోహాను 2:3 – ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా
-for drink offerings in the worship of God
నిర్గమకాండము 29:40 – దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.
సంఖ్యాకాండము 15:4 – యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.
సంఖ్యాకాండము 15:5 – ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో కూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను.
సంఖ్యాకాండము 15:6 – పొట్టేలుతో కూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను.
సంఖ్యాకాండము 15:7 – పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన.
సంఖ్యాకాండము 15:8 – మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచినయెడల
సంఖ్యాకాండము 15:9 – ఆ కోడెతో కూడ పడిన్నర నూనె కలుపబడిన ఆరు పళ్ల గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను.
సంఖ్యాకాండము 15:10 – మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా
-for drink offerings in Idolatrous worship
ద్వితియోపదేశాకాండము 32:37 – నిర్బంధింపబడినవాడును స్వతంత్రుడును లేకపోవును యెహోవా చూచును తన సేవకులనుగూర్చి సంతాపపడును.
ద్వితియోపదేశాకాండము 32:38 – నిజముగా తన ప్రజలకు తీర్పుచేయును. ఆయనవారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి? వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును వారు మీకు శరణము కానియ్యుడి అని చెప్పును.
-as A medicine
లూకా 10:34 – అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను
1తిమోతి 5:23 – ఇకమీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము.
First fruits of, to be offered to God
ద్వితియోపదేశాకాండము 18:4 – నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱల మొదటి బొచ్చును అతనికియ్యవలెను.
2దినవృత్తాంతములు 31:5 – ఆ యాజ్ఞ వెల్లడియగుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొనివచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొనివచ్చిరి.
With corn and oil, denoted all temporal blessings
ఆదికాండము 27:28 – ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించు గాక
ఆదికాండము 27:37 – అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలననిఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా
కీర్తనలు 4:7 – వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి.
హోషేయ 2:8 – దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను.
యోవేలు 2:19 – మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తినొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను
Given in abundance to the Jews when obedient
హోషేయ 2:22 – భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును.
యోవేలు 2:19 – మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తినొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను
యోవేలు 2:24 – కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును.
జెకర్యా 9:17 – వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు; ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షారసముచేత యౌవన స్త్రీలును వృద్ధినొందుదురు.
The Jews frequently deprived of, as a punishment
యెషయా 24:7 – క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను
యెషయా 24:11 – ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశములో ఆనందము లేదు.
హోషేయ 2:9 – కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీనియొద్ద నుండి తీసివేసెదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొఱ్ఱబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండ నేను ఉంచుకొందును;
యోవేలు 1:10 – పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను.
హగ్గయి 1:11 – నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోనుచేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.
హగ్గయి 2:16 – నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుచున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమే దొరకును.
The Jews frequently drank, to excess
యెషయా 5:11 – మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించువరకు చాల రాత్రివరకు పానము చేయువారికి శ్రమ.
యోవేలు 3:3 – వారు నా జనులమీద చీట్లువేసి, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా?
ఆమోసు 6:6 – పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళతైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.
In times of scarcity, was mixed with water
యెషయా 1:22 – నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.
Sometimes mixed with milk as a beverage
పరమగీతము 5:1 – నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి.
Characterised as
-Cheering God and Man
న్యాయాధిపతులు 9:13 – దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునై యుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.
జెకర్యా 9:17 – వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు; ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షారసముచేత యౌవన స్త్రీలును వృద్ధినొందుదురు.
-Gladdening the heart
కీర్తనలు 104:15 – అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు
-Strengthening
2సమూయేలు 16:2 – రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలును అంజూరపు అడలును పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసటనొందినవారు త్రాగుటకును తెచ్చితిననగా
పరమగీతము 2:5 – ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్లయడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరుపండ్లు పెట్టి నన్నాదరించుడి
-Making mirthful
ఎస్తేరు 1:10 – ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు
ప్రసంగి 10:19 – నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు సంతోషకరము; ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చును.
Custom of presenting to travellers
ఆదికాండము 14:18 – మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.
1సమూయేలు 25:18 – అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱల మాంసమును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్దభములమీద వేయించి
Custom of giving to persons in pain or suffering, mixed with drugs
సామెతలు 31:6 – ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నియ్యుడి.
మార్కు 15:23 – అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు.
Forbidden to the priests while engaged in the tabernacle
లేవీయకాండము 10:9 – మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు.
Forbidden to Nazarites during their separation
సంఖ్యాకాండము 6:3 – ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.
The Rechabites never drank
యిర్మియా 35:5 – నేను రేకాబీయుల యెదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా
యిర్మియా 35:6 – వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతివారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకాజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము.
In excess
-Forbidden
ఎఫెసీయులకు 5:18 – మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మపూర్ణులై యుండుడి.
-Infuriates the temper
సామెతలు 20:1 – ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానము లేనివారు.
-Impairs the health
1సమూయేలు 25:37 – ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయముచేత అతని గుండెపగిలెను, అతడు రాతివలె బిగిసికొనిపోయెను.
హోషేయ 4:11 – వ్యభిచార క్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానము చేయుటచేతను మద్యపానముచేతను వారు మతిచెడిరి.
-Impairs the judgment and Memory
సామెతలు 31:4 – ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ, అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు.
సామెతలు 31:5 – త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు
యెషయా 28:7 – అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చు కాలమున తత్తరపడుదురు.
-Inflames the passions
యెషయా 5:11 – మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించువరకు చాల రాత్రివరకు పానము చేయువారికి శ్రమ.
-Leads to sorrow and contention
సామెతలు 23:29 – ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?
సామెతలు 23:30 – ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.
-Leads to remorse
సామెతలు 23:31 – ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
సామెతలు 23:32 – పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.
An article of extensive commerce
యెహెజ్కేలు 27:18 – దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులును కొనుక్కొందురు.
Was stored in cellars
1దినవృత్తాంతములు 27:27 – ద్రాక్షతోటలమీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి.
Was kept in bottles
1సమూయేలు 25:18 – అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱల మాంసమును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్దభములమీద వేయించి
హబక్కూకు 2:15 – తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.
Consequence of putting (when new), into old bottles
మత్తయి 2:22 – అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము
The love of Christ to be preferred to
పరమగీతము 1:2 – నోటిముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనునుగాక నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.
పరమగీతము 1:4 – నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు.
Water miraculously turned into
యోహాను 2:9 – ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి
Illustrative
-of the blood of Christ
మత్తయి 26:27 – మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి.
మత్తయి 26:28 – ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.
మత్తయి 26:29 – నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.
-of the blessing of the gospel
సామెతలు 9:2 – పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది
సామెతలు 9:5 – వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి
యెషయా 25:6 – ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.
యెషయా 55:1 – దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలు లేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి.
-of the wrath and judgments of God
కీర్తనలు 60:3 – నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి
కీర్తనలు 75:8 – యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను.
యిర్మియా 13:12 – కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడును ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనినయెడల
యిర్మియా 13:13 – నీవు వారితో ఈ మాట చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ దేశనివాసులనందరిని, దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.
యిర్మియా 13:14 – అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏకముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపకపోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింపజేసెదను.
యిర్మియా 25:15 – ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నాచేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము.
యిర్మియా 25:16 – వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు.
యిర్మియా 25:17 – అంతట యెహోవా చేతిలోనుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.
యిర్మియా 25:18 – నేటివలెనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని.
-of the Abominations of the Apostasy
ప్రకటన 17:2 – భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.
ప్రకటన 18:3 – ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి.
-of Violence and rapine
సామెతలు 4:17 – కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు