Display Topic

Abominable branches

యెషయా 14:19 – నీవు సమాధిపొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలె నున్నావు

Ashes under the feet

మలాకీ 4:3 – నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదములక్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

Bad fishes

మత్తయి 13:48 – అది నిండినప్పుడు దానిని దరికిలాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు.

Beasts

కీర్తనలు 49:12 – ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు.

2పేతురు 2:12 – వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములనుగూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,

Blind, the

జెఫన్యా 1:17 – జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును, వారి మాంసము పెంటవలె పారవేయబడును.

మత్తయి 15:14 – వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను.

Brass and iron

యిర్మియా 6:28 – వారందరు బహు ద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు.

యెహెజ్కేలు 22:18 – నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి, వారు వెండి మష్టువంటివారైరి.

Briars and thorns

యెషయా 55:13 – ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును.

యెహెజ్కేలు 2:6 – నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు;

Bulls of Bashan

కీర్తనలు 22:12 – వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి.

Carcasses trodden under feet

యెషయా 14:19 – నీవు సమాధిపొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలె నున్నావు

Chaff

యోబు 21:18 – వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెను గాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.

కీర్తనలు 1:4 – దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.

మత్తయి 3:12 – ఆయన చేట ఆయనచేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.

Clouds without water

యూదా 1:12 – వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను,

Corn blasted

2రాజులు 19:26 – కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.

Corrupt trees

లూకా 6:43 – ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు.

Deaf adders

కీర్తనలు 58:4 – వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను

Dogs

సామెతలు 26:11 – తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు.

మత్తయి 7:6 – పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును.

2పేతురు 2:22 – కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.

Dross

కీర్తనలు 119:119 – భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి

యెహెజ్కేలు 22:18 – నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి, వారు వెండి మష్టువంటివారైరి.

యెహెజ్కేలు 22:19 – కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరందరును మష్టువంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగుచేసెదను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగుచేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు

Early dew that passes away

హోషేయ 13:3 – కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.

Evil figs

యిర్మియా 24:8 – మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువైనందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

Fading oaks

యెషయా 1:30 – మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను నీరులేని తోటవలెను అగుదురు.

Fiery oven

కీర్తనలు 21:9 – నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురు తన కోపమువలన యెహోవా వారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును.

హోషేయ 7:4 – రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారందరు మానని కామాతురత గలవారై యున్నారు.

Fire of thorns

కీర్తనలు 118:12 – కందిరీగలవలె నామీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

Fools building upon sand

మత్తయి 7:26 – మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

Fuel of fire

యెషయా 9:19 – సైన్యముల కధిపతియగు యెహోవా ఉగ్రతవలన దేశము కాలిపోయెను. జనులును అగ్నికి కట్టెలవలె నున్నారు వారిలో ఒకనినొకడు కరుణింపడు.

Garden without water

యెషయా 1:30 – మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను నీరులేని తోటవలెను అగుదురు.

Goats

మత్తయి 25:32 – అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి

Grass

కీర్తనలు 37:2 – వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు

కీర్తనలు 92:7 – నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.

Grass on the housetop

2రాజులు 19:26 – కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.

Green bay-trees

కీర్తనలు 37:35 – భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లియుండెను.

Green herbs

కీర్తనలు 37:2 – వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు

Heath in the desert

యిర్మియా 17:6 – వాడు ఎడారిలోని అరుహావృక్షమువలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.

Horses rushing into the battle

యిర్మియా 8:6 – నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమునుగూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేకపోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు.

Idols

కీర్తనలు 115:8 – వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.

Lions greedy of prey

కీర్తనలు 17:12 – వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహమువలెను ఉన్నారు.

Melting wax

కీర్తనలు 68:2 – పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక.

Morning-clouds

హోషేయ 13:3 – కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.

Moth-eaten garments

యెషయా 50:9 – ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.

యెషయా 51:8 – వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును బొద్దీక గొఱ్ఱబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును.

Passing whirlwinds

సామెతలు 10:25 – సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.

Potsherds

సామెతలు 26:23 – చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము.

Raging waves of the sea

యూదా 1:13 – తమ అవమానమను నురుగు వెళ్లగ్రక్కువారై, సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది.

Reprobate silver

యిర్మియా 6:30 – యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండియని వారికి పేరు పెట్టబడును.

Scorpions

యెహెజ్కేలు 2:6 – నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు;

Serpents

కీర్తనలు 58:4 – వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను

మత్తయి 23:33 – సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీరేలాగు తప్పించుకొందురు?

Smoke

హోషేయ 13:3 – కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.

Stony ground

మత్తయి 13:5 – కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని

Stubble

యోబు 21:18 – వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెను గాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.

మలాకీ 4:1 – ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవుదినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

Swine

మత్తయి 7:6 – పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును.

2పేతురు 2:22 – కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.

Tares

మత్తయి 13:38 – పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు? గురుగులు దుష్టుని సంబంధులు?

Troubled sea

యెషయా 57:20 – భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.

Visions of the night

యోబు 20:8 – కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.

Wandering stars

యూదా 1:13 – తమ అవమానమను నురుగు వెళ్లగ్రక్కువారై, సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది.

Wayward children

మత్తయి 11:16 – ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి

Wells without water

2పేతురు 2:17 – వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.

Wheels

కీర్తనలు 83:13 – నా దేవా, సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము

Whited sepulchres

మత్తయి 23:27 – అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి

Wild ass’s colt

యోబు 11:12 – అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు.