Display Topic


One of the elements of the world

ఆదికాండము 1:2 – భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

God originally

-created the firmament to divide

ఆదికాండము 1:6 – మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను.

ఆదికాండము 1:7 – దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.

-collected into one place

ఆదికాండము 1:9 – దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.

– Created fowls and fishes, &c from

ఆదికాండము 1:20 – దేవుడు జీవముకలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.

ఆదికాండము 1:21 – దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.

Necessary to vegetation

ఆదికాండము 2:5 – అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు

ఆదికాండము 2:6 – అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.

యోబు 14:9 – నీటి వాసన మాత్రముచేత అది చిగుర్చును లేత మొక్కవలె అది కొమ్మలు వేయును.

యెషయా 1:30 – మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను నీరులేని తోటవలెను అగుదురు.

Some plants particularly require

యోబు 8:11 – బురద లేకుండ జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?

Necessary to the comfort and happiness of man

యెషయా 41:17 – దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.

జెకర్యా 9:11 – మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను.

Collected in

-springs

యెహోషువ 15:19 – అందుకామెనాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చి యున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.

-Pools

1రాజులు 22:38 – వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.

నెహెమ్యా 2:14 – తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.

-Ponds

నిర్గమకాండము 7:19 – మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువులమీదను, వారి నీటి గుంటలన్నిటిమీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను.

యెషయా 19:10 – కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.

-fountains

1రాజులు 18:5 – అహాబు దేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటిని చూడబోయి, పశువులన్నిటిని పోగొట్టుకొనకుండ గుఱ్ఱములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసికొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను.

2దినవృత్తాంతములు 32:3 – పట్టణముబయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి, తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచన చేయగా వారతనికి సహాయము చేసిరి.

-Wells

ఆదికాండము 21:19 – మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.

-Brooks

2సమూయేలు 17:20 – అబ్షాలోము సేవకులు ఆ యింటి ఆమెయొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమె వారు ఏరుదాటి పోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

1రాజులు 18:5 – అహాబు దేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటిని చూడబోయి, పశువులన్నిటిని పోగొట్టుకొనకుండ గుఱ్ఱములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసికొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను.

-streams

కీర్తనలు 78:16 – బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.

యెషయా 35:6 – కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

-rivers

యెషయా 8:7 – కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటిమీదను పొర్లిపారును.

యిర్మియా 2:18 – నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.

-the sea

ఆదికాండము 1:9 – దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.

ఆదికాండము 1:10 – దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.

యెషయా 11:9 – నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిచేయదు నాశము చేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.

-the Clouds

ఆదికాండము 1:7 – దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.

యోబు 26:8 – వాటిక్రింద మేఘములు చినిగిపోకుండ ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.

యోబు 26:9 – దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను.

Rises in vapour to the clouds

ప్రసంగి 1:7 – నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును

కీర్తనలు 104:8 – నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.

Drops from the clouds in rain

ద్వితియోపదేశాకాండము 11:11 – మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.

2సమూయేలు 21:10 – అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసికొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశమునుండి వర్షము ఆ కళేబరములమీద కురియువరకు అచ్చటనే యుండి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండను రాత్రి అడవిమృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా

Described as

-Fluid

కీర్తనలు 78:16 – బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.

సామెతలు 30:4 – ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించినవాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?

-Unstable

ఆదికాండము 49:4 – నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను.

-Penetrating

కీర్తనలు 109:18 – తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది

-Reflecting images

సామెతలు 27:9 – తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.

-Wearing the hardest substances

యోబు 14:19 – జలము రాళ్లను అరగదీయును దాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.

-cleansing

యెహెజ్కేలు 36:25 – మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.

ఎఫెసీయులకు 5:26 – అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

-Refreshing

యోబు 22:7 – దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివి ఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి.

సామెతలు 25:25 – దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును.

Congealed by cold

యోబు 38:29 – మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?

కీర్తనలు 147:16 – గొఱ్ఱబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే.

కీర్తనలు 147:17 – ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?

Was used by Jews

-as their principal beverage

ఆదికాండము 24:43 – నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు

1రాజులు 13:19 – అతడు తిరిగి అతనితోకూడ మరలిపోయి అతని యింట అన్నపానములు పుచ్చుకొనెను.

1రాజులు 13:22 – ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చట అన్న పానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక, నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని యెలుగెత్తి చెప్పెను.

1రాజులు 18:4 – యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.

హోషేయ 2:5 – అది నాకు అన్నపానములను గొఱ్ఱబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది.

-for culinary purposes

నిర్గమకాండము 12:9 – దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను;

-for Washing the person

ఆదికాండము 18:4 – నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగుకొని ఈ చెట్టుక్రింద అలసట తీర్చుకొనుడి.

ఆదికాండము 24:32 – ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి

-for legal purification

నిర్గమకాండము 29:4 – మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి

హెబ్రీయులకు 9:10 – ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి.

హెబ్రీయులకు 9:19 – ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసికొని

Kept for purification in large waterpots

యోహాను 2:6 – యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను.

Carried in vessels

ఆదికాండము 21:14 – కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.

1సమూయేలు 26:11 – యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపును గాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి

మార్కు 14:13 – ఆయన మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును;

Artificial mode of conveying, into large cities

2రాజులు 20:20 – హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమంతటినిగూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించినదానినిగూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

Frequently brackish and unfit for use

నిర్గమకాండము 15:23 – మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను.

2రాజులు 2:19 – అంతట ఆ పట్టణపువారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమైయున్నదని ఎలీషాతో అనగా

The want of, considered a great calamity

నిర్గమకాండము 17:1 – తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాటచొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున

నిర్గమకాండము 17:2 – మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.

నిర్గమకాండము 17:3 – అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషేమీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులోనుండి ఇక్కడికి తీసికొనివచ్చితిరనిరి.

సంఖ్యాకాండము 20:2 – ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.

2రాజులు 3:9 – ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను.

2రాజులు 3:10 – ఇశ్రాయేలు రాజు కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా

యెషయా 3:1 – ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు

In times of scarcity, sold at an enormous price

విలాపవాక్యములు 5:4 – ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితివిు క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి.

Miracles connected with

-turned into blood

నిర్గమకాండము 7:17 – కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిబట్టి నీవు తెలిసికొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నాచేతిలోనున్న యీ కఱ్ఱతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును.

నిర్గమకాండము 7:20 – యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను.

-turned into Wine

యోహాను 2:7 – యేసు–ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి.

యోహాను 2:8 – అప్పుడాయన వారితో మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి.

యోహాను 2:9 – ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి

-Brought from the rock

నిర్గమకాండము 17:6 – ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.

సంఖ్యాకాండము 20:11 – అప్పుడు మోషే తన చెయ్యియెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.

-Brought from the jaw-bone of An ass

న్యాయాధిపతులు 15:19 – దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దానినుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రదికెను. కాబట్టి దానిపేరు నేటివరకు ఏన్హక్కోరె అనబడెను; అది లేహీలో నున్నది.

-Consumed by fire from heaven

1రాజులు 18:38 – అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.

-divided and made to Stand on heap

నిర్గమకాండము 14:21 – మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.

నిర్గమకాండము 14:22 – నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

యెహోషువ 3:16 – పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్ర మునకు పారునవి బొత్తిగా ఆపబడెను.

-Trenches Filled with

2రాజులు 3:17 – యెహోవా సెలవిచ్చునదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.

2రాజులు 3:18 – ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును.

2రాజులు 3:19 – మీరు ప్రాకారములుగల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి, మంచి చెట్లనెల్ల నరికి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను.

2రాజులు 3:20 – ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను.

2రాజులు 3:21 – తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని, అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి.

2రాజులు 3:22 – ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను

-Iron made to swim in

2రాజులు 6:5 – ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా యేలినవాడా, అది యెరవు తెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక

2రాజులు 6:6 – ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగెను; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను.

– Our Lord, &c walking on

మత్తయి 14:26 – ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.

మత్తయి 14:27 – వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా

మత్తయి 14:28 – పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.

మత్తయి 14:29 – ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని

-Healing powers communicated to

2రాజులు 5:14 – అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.

యోహాను 5:4 – గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి.

యోహాను 9:7 – నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.

The world and its inhabitants once destroyed by

ఆదికాండము 7:20 – పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగిపోయెను.

ఆదికాండము 7:21 – అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.

ఆదికాండము 7:22 – పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను.

ఆదికాండము 7:23 – నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితోకూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.

2పేతురు 3:6 – ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.

The world not to be again destroyed by

ఆదికాండము 9:8 – మరియు దేవుడు నోవహు అతని కుమారులతో

ఆదికాండము 9:9 – ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడ నున్న ప్రతి జీవితోను,

ఆదికాండము 9:10 – పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.

ఆదికాండము 9:11 – నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహజలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.

ఆదికాండము 9:12 – మరియు దేవుడు నాకును మీకును మీతోకూడ నున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే.

ఆదికాండము 9:13 – మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును.

ఆదికాండము 9:14 – భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.

ఆదికాండము 9:15 – అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు

2పేతురు 3:7 – అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

Illustrative

-of the support of God

యెషయా 8:6 – ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు.

-of the gifts and graces of the holy spirit

యెషయా 41:17 – దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.

యెషయా 41:18 – జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు

యెషయా 44:3 – నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

యెహెజ్కేలు 36:25 – మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.

యోహాను 7:38 – నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.

యోహాను 7:39 – తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.

-of Persecutors

కీర్తనలు 124:4 – జలములు మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును

కీర్తనలు 124:5 – ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.

-of persecutions

కీర్తనలు 88:17 – నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూర చుట్టుకొనియున్నవి

-of hostile armies

యెషయా 8:7 – కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటిమీదను పొర్లిపారును.

యెషయా 17:13 – జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.

– (Still,) of the ordinances of the gospel

కీర్తనలు 23:2 – పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.

– (Deep,) of severe affliction

కీర్తనలు 66:12 – నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించియున్నావు.

కీర్తనలు 69:1 – దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.

యెషయా 30:20 – ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు

యెషయా 43:2 – నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

– (Deep,) of counsel in the heart

సామెతలు 20:5 – నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును.

– (Deep,) of the words of the wise of the wise

సామెతలు 18:4 – మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.

– (Poured out,) of the wrath of God

హోషేయ 5:10 – యుదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారివలె నున్నారు; నీళ్లు ప్రవహించినట్లు నేను వారిమీద నా ఉగ్రతను కుమ్మరింతును.

– (Poured out,) of faintness by terror

కీర్తనలు 22:14 – నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.

– (Pouring, out of buckets,) of a numerous progeny

సంఖ్యాకాండము 24:7 – నీళ్లు అతని బొక్కెనలనుండి కారును అతని సంతతి బహు జలములయొద్ద నివసించును అతని రాజు అగగుకంటె గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును.

– (Spilled on the ground,) of death

2సమూయేలు 14:14 – మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.

– (Its instability,) of a wavering disposition

ఆదికాండము 49:4 – నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను.

– (Its weakness,) of faintness and cowardice

యెహోషువ 7:5 – అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరు గురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమగవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను.

యెహెజ్కేలు 7:17 – అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్లు నీళ్లవలె తత్తరిల్లును.

– (Difficulty of stopping,) of strife and contention

సామెతలు 17:14 – కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు

– (Rapidly flowing away,) of the career of the wicked

యోబు 24:18 – జలములమీద వారు తేలికగా కొట్టుకొనిపోవుదురు వారి స్వాస్థ్యము భూమిమీద శాపగ్రస్తము ద్రాక్షతోటల మార్గమున వారు ఇకను నడువరు.

కీర్తనలు 58:7 – పారు నీళ్లవలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును.

– (Many,) of different nations and people

ప్రకటన 17:1 – ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహా వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను;

ప్రకటన 17:15 – మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.

యిర్మియా 51:13 – విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు.

– (Many,) of a variety of afflictions

2సమూయేలు 22:17 – ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.

– (Noise of many,) of the word of Christ

ప్రకటన 1:15 – ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైయుండెను; ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.

(Covering the sea,) of the general diffusion of the knowledge of God

యెషయా 11:9 – నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిచేయదు నాశము చేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.

హబక్కూకు 2:14 – ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మాహాత్మ్యమునుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.