Display Topic


Soldiers generally acted as

మత్తయి 27:65 – అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీచేతనైనంతమట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను.

మత్తయి 27:66 – వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రము చేసిరి.

Citizens sometimes acted as

నెహెమ్యా 7:3 – అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కువరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు; మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థులందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.

Were stationed

-on Watch towers

2రాజులు 9:17 – యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచియుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.

యెషయా 21:5 – వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి; ప్రభువు నాతో ఇట్లనెను

-on the walls of Cities

యెషయా 62:6 – యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలివారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.

-in the streets of Cities

కీర్తనలు 127:1 – యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే.

-around the temple in Jerusalem on Special occasions

2రాజులు 11:6 – ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను, ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను.

Paraded the streets at night to preserve order

పరమగీతము 3:3 – పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగితిని

పరమగీతము 5:7 – పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్నుకొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.

In time of danger

-Increase in number

యిర్మియా 51:12 – బబులోను ప్రాకారములమీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి కావలి బలముచేయుడి కావలివారిని పెట్టుడి మాటులను సిద్ధపరచుడి బబులోను నివాసులనుగూర్చి తాను సెలవిచ్చిన దానినిబట్టి యెహోవా తీర్మానముచేసిన పని తాను జరిగింపబోవుచున్నాడు.

-vigilant night and day

నెహెమ్యా 4:9 – మేము మా దేవునికి ప్రార్థనచేసి, వారి భయముచేత రాత్రింబగళ్లు కావలి యుంచితివిు.

యెషయా 21:8 – సింహము గర్జించునట్టు కేకలు వేసి నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను

-Reported the approach of all strangers

2సమూయేలు 18:24 – దావీదు రెండు గుమ్మముల మధ్యను నడవలో కూర్చొనియుండెను; కావలికాడు గుమ్మముపైనున్న గోడమీదికి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరుగెత్తికొని వచ్చుచున్న యొకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా

2సమూయేలు 18:25 – రాజు వాడు ఒంటరిగా ఉండినయెడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగుమీద వచ్చుచుండగా

2సమూయేలు 18:26 – కావలికాడు పరుగెత్తికొని వచ్చు మరియొకని కనుగొని అదిగో మరియొకడు ఒంటరిగానే పరుగెత్తికొని వచ్చుచున్నాడని ద్వారపుతట్టు తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానము తెచ్చుచున్నాడనెను.

2సమూయేలు 18:27 – కావలికాడు మొదటివాడు పరుగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలొ

2రాజులు 9:18 – కాబట్టి యొకడు గుఱ్ఱమెక్కి పోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలిసికొనెను గాని తిరిగిరాక నిలిచెనని సమాచారము తెలిపెను.

2రాజులు 9:19 – రాజు రెండవ రౌతును పంపగా వాడు వారియొద్దకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ సమధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను.

2రాజులు 9:20 – అప్పుడు కావలి వాడు వీడును వారిని కలిసికొని తిరిగిరాక నిలిచెను మరియు అతడు వెఱ్ఱి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీ కుమారుడైన యెహూ తోలడమువలెనే యున్నదనెను.

యెషయా 21:6 – నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.

యెషయా 21:7 – జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును

యెషయా 21:9 – ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను.

-Sounded An alarm at the approach of Enemies

యెహెజ్కేలు 33:2 – నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము నేను ఒకానొక దేశముమీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించినయెడల

యెహెజ్కేలు 33:3 – అతడు దేశముమీదికి ఖడ్గము వచ్చుట చూచి, బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున

Vigilance of, vain without God’s protection

కీర్తనలు 127:1 – యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే.

Were relieved by turns

నెహెమ్యా 7:3 – అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కువరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు; మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థులందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.

Danger of sleeping on their posts, referred to

మత్తయి 28:13 – మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి;

మత్తయి 28:14 – ఇది అధిపతి చెవినిబడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి.

Neglecting to give warning punished with death

యెహెజ్కేలు 33:6 – అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు, బాకా ఊదనందుచేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించినయెడల వాడు తన దోషమునుబట్టి పట్టబడినను, నేను కావలివానియొద్ద వాని ప్రాణమునుగూర్చి విచారణ చేయుదును.

Often interrogated by passengers

యెషయా 21:11 – దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు

Illustrative

-of Ministers

యెషయా 5:28 – వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కుపెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమానములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును

యెషయా 62:6 – యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలివారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.

యెహెజ్కేలు 3:17 – నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము.

హెబ్రీయులకు 13:17 – మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.

– (Blind,) of careless ministers

యెషయా 56:10 – వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగకుక్కలు మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.

– (Looking for the morning,) of anxious waiting for God

కీర్తనలు 130:5 – యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.

కీర్తనలు 130:6 – కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.