Display Topic


Designed for separation

యెహెజ్కేలు 43:8 – నా గడపదగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి, తాముచేసిన హేయక్రియలచేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసితిని.

ఎఫెసీయులకు 2:14 – ఆయన మన సమాధానమై యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

Designed for defence

1సమూయేలు 25:16 – మేము గొఱ్ఱలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మాచుట్టు ప్రాకారముగా ఉండిరి.

Mentioned in scripture

-of Cities

సంఖ్యాకాండము 13:28 – అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు.

-of temples

1దినవృత్తాంతములు 29:4 – గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను

యెషయా 56:5 – నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను

-of houses

1సమూయేలు 18:11 – ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను.

-of Vineyards

సంఖ్యాకాండము 22:24 – యెహోవా దూత యిరుప్రక్కలను గోడలుగల ద్రాక్షతోటల సందులో నిలిచెను.

సామెతలు 24:31 – ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసియుండెను. దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను.

Frequently made of stone and wood together

ఎజ్రా 5:8 – రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితివిు, అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది; అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిచేతిలో వృద్ధియగుచున్నది.

హబక్కూకు 2:11 – గోడలలోని రాళ్లు మొఱ్ఱ పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి.

Were probably often strengthened with plates of iron or brass

యిర్మియా 15:20 – అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించెదను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెహెజ్కేలు 4:3 – మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుపగోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖదృష్టిని పట్టణముమీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడివేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును.

Of cities

-Often very High

ద్వితియోపదేశాకాండము 1:28 – మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్తరులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.

ద్వితియోపదేశాకాండము 3:5 – ఆ పురములన్నియు గొప్ప ప్రాకారములు గవునులు గడియలును గల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టుకొంటిమి.

-Strongly fortified

యెషయా 2:15 – ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

యెషయా 25:12 – మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రుంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలు చేయును.

-had towers built on them

2దినవృత్తాంతములు 26:9 – మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపుస్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూలదగ్గరను, దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను.

2దినవృత్తాంతములు 32:5 – మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగుచేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.

కీర్తనలు 48:12 – ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి

పరమగీతము 8:10 – నేను ప్రాకారమువంటి దాననైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని.

-houses Often built on

యెహోషువ 2:15 – ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను.

-were Broad and places of public resort

2రాజులు 6:26 – అంతట ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారముమీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని

2రాజులు 6:30 – రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని యింక ప్రాకారముమీద నడిచి పోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటిమీద గోనెపట్ట కనబడెను.

కీర్తనలు 55:10 – రాత్రింబగళ్లు వారు పట్టణపు ప్రాకారములమీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.

-were Strongly manned in war

2రాజులు 18:26 – హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా

-kept by Watchmen night and day

పరమగీతము 5:7 – పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్నుకొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.

యెషయా 62:6 – యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలివారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.

-houses Sometimes Broken down to repair, and fortify

యెషయా 22:10 – యెరూషలేము యిండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి

-danger of Approaching Too Near to, in Time of war

2సమూయేలు 11:20 – గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయెనా?

2సమూయేలు 11:21 – ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటిరాతి తునక ఎత్తి గోడమీదనుండి అతనిమీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయెను గదా? ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగినయెడల నీవు తమరి సేవకుడగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను.

-were battered by Besieging armies

2సమూయేలు 20:15 – ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకాయందు బిక్రిని ముట్టడివేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరు ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి.

యెహెజ్కేలు 4:2 – మరియు అది ముట్టడి వేయబడినట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము.

యెహెజ్కేలు 4:3 – మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుపగోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖదృష్టిని పట్టణముమీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడివేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును.

-Adroitness of soldiers in scaling Alluded to

యోవేలు 2:7 – బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవుచున్నవి

యోవేలు 2:8 – ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.

యోవేలు 2:9 – పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి.

-Sometimes burned

యిర్మియా 49:27 – నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను అది బెన్హదదు నగరులను కాల్చివేయును.

ఆమోసు 1:7 – గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;

-Frequently laid in ruins

2దినవృత్తాంతములు 25:23 – అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోయాషు యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదారాజునైన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసికొనివచ్చి, యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మమువరకు నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.

2దినవృత్తాంతములు 36:19 – అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడుచేసిరి.

యిర్మియా 50:15 – చుట్టు కూడి దానినిబట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవా చేయు ప్రతికారము. దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి.

-Destruction of, A Punishment and cause of grief

ద్వితియోపదేశాకాండము 28:52 – మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడివేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడివేయుదురు.

నెహెమ్యా 1:3 – వారు చెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు; మరియు యెరూషలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి.

నెహెమ్యా 2:12 – రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితివిు. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి యే పశువును నాయొద్ద ఉండలేదు.

నెహెమ్యా 2:13 – నేను రాత్రికాలమందు లోయద్వారము గుండ భుజంగపు బావి యెదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.

నెహెమ్యా 2:14 – తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.

నెహెమ్యా 2:15 – నేను రాత్రియందు మడుగు దగ్గరనుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని.

నెహెమ్యా 2:16 – అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరమైనవారికే గాని నేను ఆ సంగతి చెప్పియుండలేదు.

నెహెమ్యా 2:17 – అయితే వారితో నేనిట్లంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేము యొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి.

-the Falling of, Sometimes occasioned great Destruction

1రాజులు 20:30 – తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న యొక ప్రాకారము శేషించినవారిలో ఇరువదియేడు వేలమంది మీదపడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ యా గదులలో చొరగా

-the bodies of Enemies Sometimes Fastened on, as A disgrace

1సమూయేలు 31:10 – మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవిగుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి.

-Custom of Dedicating

నెహెమ్యా 12:27 – యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి

-Idolatrous rites performed on

2రాజులు 3:27 – అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసికొని, పట్టణపు ప్రాకారముమీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.

-Instances of Persons let down from

యెహోషువ 2:15 – ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను.

అపోస్తలులకార్యములు 9:24 – వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి

అపోస్తలులకార్యములు 9:25 – గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి.

2కొరిందీయులకు 11:33 – అప్పుడు నేను కిటికీగుండ గోడమీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.

Small towns and villages were not surrounded by

లేవీయకాండము 25:31 – చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగిపోవును.

ద్వితియోపదేశాకాండము 3:5 – ఆ పురములన్నియు గొప్ప ప్రాకారములు గవునులు గడియలును గల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టుకొంటిమి.

Of houses

-Usually Plastered

యెహెజ్కేలు 13:10 – సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.

దానియేలు 5:5 – ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూతమీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా

-had Nails or pegs Fastened into them when built

ప్రసంగి 12:11 – జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి.

యెషయా 22:23 – దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును.

-liable to leprosy

లేవీయకాండము 14:37 – అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చదాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండినయెడల

-Often Infested with serpents

ఆమోసు 5:19 – ఒకడు సింహము నొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.

-Could be Easily Dug through

ఆదికాండము 49:6 – నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి.

యెహెజ్కేలు 8:7 – అప్పుడు ఆవరణద్వారముదగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను.

యెహెజ్కేలు 8:8 – నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను.

యెహెజ్కేలు 12:5 – వారు చూచుచుండగా గోడకు కన్నమువేసి నీ సామగ్రిని తీసికొని దాని ద్వారా బయలుదేరుము

-the seat next, Was the place of distinction

1సమూయేలు 20:25 – మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు తన ఆసనముమీద కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను; అయితే దావీదు స్థలము ఖాళిగా నుండెను.

Hyssop frequently grew on

1రాజులు 4:33 – మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినిగూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటినిగూర్చియు అతడు వ్రాసెను.

Miracles connected with

-Falling of the walls of Jericho

యెహోషువ 6:20 – యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.

– Handwriting on the wall of Belshazzar’s palace

దానియేలు 5:5 – ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూతమీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా

దానియేలు 5:25 – ఈ వాక్యభావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూచి దాని ముగించెను.

దానియేలు 5:26 – టెకేల్‌ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.

దానియేలు 5:27 – ఫెరేన్‌ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును.

దానియేలు 5:28 – బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని

Illustrative

-of salvation

యెషయా 26:1 – ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు.

యెషయా 60:18 – ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.

-of the protection of God

జెకర్యా 2:5 – నేను దానిచుట్టు అగ్నిప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.

-of Those who Afford protection

1సమూయేలు 25:16 – మేము గొఱ్ఱలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మాచుట్టు ప్రాకారముగా ఉండిరి.

యెషయా 2:15 – ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

-of the Church as A protection to the nation

పరమగీతము 8:9 – అది ప్రాకారము వంటిదాయెనా? మేము దానిపైన వెండి గోపురమొకటి కట్టుదుము. అది కవాటము వంటిదాయెనా? దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము

పరమగీతము 8:10 – నేను ప్రాకారమువంటి దాననైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని.

-of ordinances as A protection to the Church

పరమగీతము 2:9 – నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీ కంతగుండ తొంగి చూచుచున్నాడు

యెషయా 5:5 – ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను

-of the Wealth of the rich in His own conceit

సామెతలు 18:11 – ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.

– (Brazen,) of prophets in their testimony against the wicked

యిర్మియా 15:20 – అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించెదను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

– (Bowing or tottering,) of the wicked under judgments

కీర్తనలు 62:3 – ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరు ఎన్నాళ్లు ఒకని పడద్రోయ చూచుదురు?

యెషయా 30:13 – ఈ దోషము మీకు ఎత్తయిన గోడనుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.

– (Of partition,) of separation of Jews and Gentiles

ఎఫెసీయులకు 2:14 – ఆయన మన సమాధానమై యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

– (Daubed with untempered mortar,) of the teaching of false prophets

యెహెజ్కేలు 13:10 – సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.

యెహెజ్కేలు 13:11 – ఇందువలననే పూయుచున్న వారితో నీ విట్లనుము వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును.

యెహెజ్కేలు 13:12 – ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి మీరు పూసిన పూత యేమాయెనని అడుగుదురు గదా?

యెహెజ్కేలు 13:13 – ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుపానుచేత దానిని పడగొట్టుదును, నా కోపమునుబట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమునుబట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును,

యెహెజ్కేలు 13:14 – దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దానిక్రింద మీరును నాశనమగుదురు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలిసికొందురు.

యెహెజ్కేలు 13:15 – ఈలాగున ఆ గోడమీదను దానిమీద గచ్చుపూత పూసినవారిమీదను నా కోపము నేను తీర్చుకొని, ఆ గోడకును దానికి పూత పూసినవారికిని పని తీరెనని మీతో చెప్పుదును.

– (Whited,) of hypocrites

అపోస్తలులకార్యములు 23:3 – పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను.దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి.