Display Topic


Solemn promises made to God

కీర్తనలు 76:11 – మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.

Were made in reference to

-Devoting the person to God

సంఖ్యాకాండము 6:2 – పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించుకొనినయెడల వాడు ద్రాక్షారసమద్యములను మానవలెను.

-Dedicating Children to God

1సమూయేలు 1:11 – సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన యెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,

-Devoting property to God

ఆదికాండము 28:22 – మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.

-offering sacrifices

లేవీయకాండము 7:16 – అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దానినర్పించునాడే తినవలెను.

లేవీయకాండము 22:18 – నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఇట్లు చెప్పుము ఇశ్రాయేలీయుల యింటివారిలోనేగాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశులలోనేగాని యెవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబళ్లనైనను అర్పించునో

లేవీయకాండము 22:22 – గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరతగలదేమి గడ్డగలదేమి గజ్జిరోగము గలదేమి చిరుగుడు గలదేమి అట్టివాటిని యెహోవాకు అర్పింపకూడదు; వాటిలో దేనిని బలిపీఠముమీద యెహోవాకు హోమము చేయకూడదు.

సంఖ్యాకాండము 15:3 – యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినేకాని, గొఱ్ఱమేకలలోని దానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల

-afflicting the soul

సంఖ్యాకాండము 30:13 – ప్రతి మ్రొక్కుబడిని, తన్ను తాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దుచేయవచ్చును.

To be voluntary

ద్వితియోపదేశాకాండము 23:21 – నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.

ద్వితియోపదేశాకాండము 23:22 – నీవు మ్రొక్కుకొననియెడల నీయందు ఆ పాపముండదు.

To be performed faithfully

సంఖ్యాకాండము 30:2 – ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనినయెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసినయెడల, అతడు తన మాటతప్పక తననోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను.

To be performed without delay

ద్వితియోపదేశాకాండము 23:21 – నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.

ద్వితియోపదేశాకాండము 23:23 – నీ పెదవులనుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను.

Danger of inconsiderately making

సామెతలు 20:25 – వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును.

Of children void without the consent of parents

సంఖ్యాకాండము 30:3 – మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రియింట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైనయెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును.

సంఖ్యాకాండము 30:4 – ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును.

సంఖ్యాకాండము 30:5 – ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణ చేసినయెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువకపోవును.

Of married women void without consent of husbands

సంఖ్యాకాండము 30:6 – ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెనుగనుక యెహోవా ఆమెను క్షమించును.

సంఖ్యాకాండము 30:7 – ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లయినను, నిరాలోచనగా ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమెమీదనుండుట ఆమె భర్త విని, దానిగూర్చి వినినదినమున అతడు ఊరకుండుట తటస్థించినయెడల, ఆమె మ్రొక్కుబళ్లును ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును.

సంఖ్యాకాండము 30:8 – ఆమె భర్త వినినదినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టుకొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.

సంఖ్యాకాండము 30:10 – ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కుకొనినయెడలనేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనినయెడలనేమి,

సంఖ్యాకాండము 30:11 – తరువాత ఆమె భర్త విని దానిగూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును; ఆమె తనమీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును.

సంఖ్యాకాండము 30:12 – ఆమె భర్త వినినదినమందే వాటిని బొత్తిగా రద్దుచేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియు, ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువకపోవును; ఆమె భర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.

సంఖ్యాకాండము 30:13 – ప్రతి మ్రొక్కుబడిని, తన్ను తాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దుచేయవచ్చును.

Of widows and women divorced from their husbands binding

సంఖ్యాకాండము 30:9 – విధవరాలుగాని విడనాడబడినదిగాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును.

Of wives, could only be objected to at the time of making

సంఖ్యాకాండము 30:14 – అయితే ఆమె భర్త నానాట దానిగూర్చి ఊరకొనుచు వచ్చినయెడల, వాడు ఆమెమీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటిని ఆమె ఒట్టులన్నిటిని స్థిరపరచినవాడగును. అతడు వినినదినమున దానిగూర్చి ఊరకుండుటవలన వాటిని స్థిరపరచెను.

సంఖ్యాకాండము 30:15 – అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దుచేసినయెడల, తానే ఆమె దోషశిక్షను భరించును.

Might be redeemed by paying a suitable compensation

లేవీయకాండము 27:1 – మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

లేవీయకాండము 27:2 – నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను.

లేవీయకాండము 27:3 – నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను.

లేవీయకాండము 27:4 – ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.

లేవీయకాండము 27:5 – అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.

లేవీయకాండము 27:6 – ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను.

లేవీయకాండము 27:7 – అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.

లేవీయకాండము 27:8 – ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైనయెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమిచొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను.

లేవీయకాండము 27:11 – జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను.

లేవీయకాండము 27:12 – అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును.

లేవీయకాండము 27:13 – అయితే ఒకడు అట్టిదానిని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను.

లేవీయకాండము 27:14 – ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినయెడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును.

లేవీయకాండము 27:15 – తన యిల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరినయెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను; అప్పుడు ఆ యిల్లు అతనిదగును.

లేవీయకాండము 27:16 – ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినయెడల దాని చల్లబడు విత్తనముల కొలచొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది.

లేవీయకాండము 27:17 – అతడు సునాద సంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము.

లేవీయకాండము 27:18 – సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్కచొప్పున, అనగా మరుసటి సునాద సంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.

లేవీయకాండము 27:19 – పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును.

లేవీయకాండము 27:20 – అతడు ఆ పొలమును విడిపింపనియెడలను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.

లేవీయకాండము 27:21 – ఆ పొలము సునాద సంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.

లేవీయకాండము 27:22 – ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల

లేవీయకాండము 27:23 – యాజకుడు సునాద సంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను.

Clean beasts the subjects of, not to be redeemed

లేవీయకాండము 27:9 – యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను.

లేవీయకాండము 27:10 – అట్టిదానిని మార్చకూడదు; చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును.

Recorded in scripture

-of Jacob

ఆదికాండము 28:20 – అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,

ఆదికాండము 28:21 – తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినయెడల యెహోవా నాకు దేవుడై యుండును.

ఆదికాండము 28:22 – మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.

ఆదికాండము 31:13 – నీవెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.

-of Israelites

సంఖ్యాకాండము 21:2 – ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని నీవు మాచేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి.

-of Jephthah

న్యాయాధిపతులు 11:30 – అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగానీవు నాచేతికి అమ్మోనీయులను నిశ్చ యముగా అప్పగించినయెడల

న్యాయాధిపతులు 11:31 – నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొను టకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదననెను.

-of Hannah

1సమూయేలు 1:1 – ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.

-of Elkanah

1సమూయేలు 1:24 – పాలు మాన్పించిన తరువాత అతడు ఇంక చిన్నవాడై యుండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తినితీసికొని షిలోహులోని మందిరమునకు వచ్చెను.

-of David

కీర్తనలు 132:2 – అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి

కీర్తనలు 132:3 – యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.

కీర్తనలు 132:4 – ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు

కీర్తనలు 132:5 – నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్నురెప్పలకు కునికిపాటు రానియ్యననెను.

-of mariners who cast out Jonah

యోనా 1:16 – ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి.

-of Jonah

యోనా 2:9 – కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులనర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను.

– Of Lemuel’s mother

సామెతలు 31:1 – రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికుపదేశించిన దేవోక్తి,

సామెతలు 31:2 – నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును?

-of Paul

అపోస్తలులకార్యములు 18:18 – పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితో కూడ వెళ్లిరి.

-of Certain Jews with Paul

అపోస్తలులకార్యములు 21:23 – కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడియున్న నలుగురు మనుష్యులు మాయొద్ద ఉన్నారు.

అపోస్తలులకార్యములు 21:24 – నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితో కూడ శుద్ధిచేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్నుగూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలిసికొందురు

అపోస్తలులకార్యములు 21:26 – అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంట బెట్టుకొనిపోయి, వారితోకూడ శుద్ధిచేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుద్ధిదినములు నెరవేర్చుదుమని తెలిపెను

All things dedicated by, to be brought to the tabernacle

ద్వితియోపదేశాకాండము 12:6 – అక్కడికే మీరు మీ దహనబలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱమేకలలోను తొలిచూలు వాటిని తీసికొనిరావలెను.

ద్వితియోపదేశాకాండము 12:11 – నేను మికాజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహనబలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొనిరావలెను.

ద్వితియోపదేశాకాండము 12:17 – నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱమేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్చార్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక

ద్వితియోపదేశాకాండము 12:18 – నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ యింటనుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు.

ద్వితియోపదేశాకాండము 12:26 – నీకు నియమింపబడిన ప్రతిష్టితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసికొనిపోవలెను.

Of things corrupt or blemished an insult to God

లేవీయకాండము 22:23 – కురూపియైన కోడెనైనను గొఱ్ఱ మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు.

మలాకీ 1:14 – నేను ఘనమైన మహారాజునై యున్నాను; అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది యుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయినదానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు.

The hire of a prostitute or price of a dog could not be the subject of

ద్వితియోపదేశాకాండము 23:18 – పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు.