Display Topic


God often made known his will by

కీర్తనలు 89:19 – అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను.

God especially made himself known to prophets by

సంఖ్యాకాండము 12:6 – వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు.

Often accompanied

-A representative of the divine person and glory

యెషయా 6:1 – రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

-An audible voice from heaven

ఆదికాండము 15:1 – ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.

1సమూయేలు 3:4 – యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి

1సమూయేలు 3:5 – ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను.

-An appearance of angels

లూకా 1:22 – అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై యుండెను

లూకా 1:11 – ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా

లూకా 24:23 – కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.

అపోస్తలులకార్యములు 10:3 – పగలు ఇంచుమించు మూడుగంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.

-An appearance of human beings

అపోస్తలులకార్యములు 9:12 – అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను.

అపోస్తలులకార్యములు 16:9 – అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను.

Frequently difficult and perplexing to those who received them

దానియేలు 7:15 – నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని.

దానియేలు 8:15 – దానియేలను నేను ఈ దర్శనము చూచితిని; దాని తెలిసికొనదగిన వివేకము పొందవలెనని యుండగా; మనుష్యుని రూపము గల యొకడు నాయెదుట నిలిచెను.

అపోస్తలులకార్యములు 10:17 – పేతురు తనకు కలిగిన దర్శనమేమైయుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి

Often communicated

-in the night season

ఆదికాండము 46:2 – అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

దానియేలు 2:19 – అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.

-in A trance

సంఖ్యాకాండము 24:16 – దేవవాక్కులను వినినవాని వార్త మహాన్నతుని విద్యనెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.

అపోస్తలులకార్యములు 11:5 – నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొక విధమైన పాత్ర ఆకాశమునుండి దిగి నాయొద్దకు వచ్చెను

Often recorded for the benefit of the people

హబక్కూకు 2:2 – యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.

Often multiplied for the benefit of the people

హోషేయ 12:10 – ప్రవక్తలతో నేను మాటలాడి యున్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చి యున్నాను, ఉపమానరీతిగా అనేక పర్యాయములు ప్రవక్తలద్వారా మాటలాడి యున్నాను.

Mentioned in scripture

-to Abraham

ఆదికాండము 15:1 – ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.

-to Jacob

ఆదికాండము 46:2 – అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

-to Moses

నిర్గమకాండము 3:2 – ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు.

నిర్గమకాండము 3:3 – అప్పుడు మోషే ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.

అపోస్తలులకార్యములు 7:30 – నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.

అపోస్తలులకార్యములు 7:31 – మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా

అపోస్తలులకార్యములు 7:32 – నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింపలేదు.

-to Samuel

1సమూయేలు 3:2 – ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తనస్థలమందు పండుకొనియుండగాను

1సమూయేలు 3:3 – దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొనియుండగాను

1సమూయేలు 3:4 – యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి

1సమూయేలు 3:5 – ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను.

1సమూయేలు 3:6 – యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను.

1సమూయేలు 3:7 – సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు.

1సమూయేలు 3:8 – యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి

1సమూయేలు 3:9 – నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచిన యెడల యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను.

1సమూయేలు 3:10 – తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలూ సమూయేలూ, అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ యిమ్మనెను.

1సమూయేలు 3:11 – అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోవుచున్నాను; దానిని వినువారందరి చెవులు గింగురుమనును.

1సమూయేలు 3:12 – ఆ దినమున ఏలీయొక్క యింటివారిని గురించి నేను చెప్పినదంతయు వారిమీదికి రప్పింతును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును.

1సమూయేలు 3:13 – తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.

1సమూయేలు 3:14 – కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని.

1సమూయేలు 3:15 – తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను.

-to Nathan

2సమూయేలు 7:4 – అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

2సమూయేలు 7:17 – తనకు కలిగిన దర్శనమంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను.

-to Eliphaz

యోబు 4:13 – గాఢనిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.

యోబు 4:14 – భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.

యోబు 4:15 – ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను.

యోబు 4:16 – అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేకపోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?

-to Isaiah

యెషయా 6:1 – రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

యెషయా 6:2 – ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.

యెషయా 6:3 – వారు సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

యెషయా 6:4 – వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమముచేత నిండగా

యెషయా 6:5 – నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

యెషయా 6:6 – అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నాయొద్దకు ఎగిరివచ్చి నా నోటికి దాని తగిలించి

యెషయా 6:7 – ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను.

యెషయా 6:8 – అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా

– To Ezekiel (See chapters 10,40-48 of Ezekiel)

యెహెజ్కేలు 1:4 – నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చుచుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతిదానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటిదొకటి కనబడెను.

యెహెజ్కేలు 1:5 – దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది.

యెహెజ్కేలు 1:6 – ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్క లును గలవు.

యెహెజ్కేలు 1:7 – వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను.

యెహెజ్కేలు 1:8 – వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను.

యెహెజ్కేలు 1:9 – వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను.

యెహెజ్కేలు 1:10 – ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.

యెహెజ్కేలు 1:11 – వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసియుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను.

యెహెజ్కేలు 1:12 – అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మ యే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను.

యెహెజ్కేలు 1:13 – ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను.

యెహెజ్కేలు 1:14 – మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను.

యెహెజ్కేలు 8:2 – అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజియైనట్టుగాను ఆయన నాకు కనబడెను.

యెహెజ్కేలు 8:3 – మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను.

యెహెజ్కేలు 8:4 – అంతట లోయలో నాకు కనబడిన దర్శనరూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను.

యెహెజ్కేలు 8:5 – నరపుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను.

యెహెజ్కేలు 8:6 – అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, వారు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు.

యెహెజ్కేలు 8:7 – అప్పుడు ఆవరణద్వారముదగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను.

యెహెజ్కేలు 8:8 – నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను.

యెహెజ్కేలు 8:9 – నీవు లోపలికి చొచ్చి, యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా

యెహెజ్కేలు 8:10 – నేను లోపలికిపోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను.

యెహెజ్కేలు 8:11 – మరియు ఒక్కొకడు తనచేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బదిమందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆ యాకారములకు ఎదురుగా నిలిచియుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను.

యెహెజ్కేలు 8:12 – అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.

యెహెజ్కేలు 8:13 – మరియు ఆయన నీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి

యెహెజ్కేలు 8:14 – యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని.

యెహెజ్కేలు 11:24 – తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మవశుడను కాగా, దర్శనములో నైనట్టు కల్దీయులదేశమునందు చెరలో ఉన్నవారియొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండ పైకెక్కెను.

యెహెజ్కేలు 11:25 – అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నిటిని చెరలో ఉన్నవారికి నేను తెలియజేసితిని.

యెహెజ్కేలు 37:1 – యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా

యెహెజ్కేలు 37:2 – యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి.

యెహెజ్కేలు 37:3 – ఆయన నరపుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుకగలవా? అని నన్నడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని.

యెహెజ్కేలు 37:4 – అందుకాయన ప్రవచనమెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము ఎండిపోయిన యెముకలారా, యెహోవామాట ఆలకించుడి.

యెహెజ్కేలు 37:5 – ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను;

యెహెజ్కేలు 37:6 – చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీమీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

యెహెజ్కేలు 37:7 – ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను.

యెహెజ్కేలు 37:8 – నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమును లేకపోయెను.

యెహెజ్కేలు 37:9 – అప్పడు ఆయన నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము.

యెహెజ్కేలు 37:10 – ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.

-to Nebuchadnezzar

దానియేలు 2:28 – అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినములయందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా

దానియేలు 4:5 – నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను.

– To Daniel (See chapters 7,8, and 10 of Daniel)

దానియేలు 2:19 – అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.

-to Amos

ఆమోసు 7:1 – కడవరిగడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపరచెను; ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది.

ఆమోసు 7:2 – నేలను మొలిచిన పచ్చిక యంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును? అని నేను మనవిచేయగా

ఆమోసు 7:3 – యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను.

ఆమోసు 7:4 – మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కనుపరచెను. అదివచ్చి అగాధమైన మహాజలమును మింగివేసి, స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు

ఆమోసు 7:5 – ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును? మానివేయుమని నేను మనవి చేయగా

ఆమోసు 7:6 – ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరుగదని సెలవిచ్చెను.

ఆమోసు 7:7 – మరియు యెహోవా తాను మట్టపుగుండుచేత పట్టుకొని గుండుపెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను.

ఆమోసు 7:8 – యెహోవా ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా నాకు మట్టపుగుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపుగుండు వేయబోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను

ఆమోసు 7:9 – ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గముచేత పట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.

ఆమోసు 8:1 – మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవికాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి

ఆమోసు 8:2 – ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణచేయక మానను.

ఆమోసు 8:3 – ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి.

ఆమోసు 8:4 – దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,

ఆమోసు 8:5 – తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొనువారలారా,

ఆమోసు 8:6 – దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదినమెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.

ఆమోసు 9:1 – యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నా కాజ్ఞ ఇచ్చిన దేమనగా గడపలు కదలిపోవునట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలలమీద వాటిని పడవేసి పగులగొట్టుము; తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను, తప్పించుకొనువారిలో ఎవడును బ్రదుకకుండను నేను వారినందరిని ఖడ్గముచేత వధింతును.

-to Zechariah

జెకర్యా 1:8 – రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజిచెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱములును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱములును కనబడెను.

జెకర్యా 3:1 – మరియు యెహోవా దూత యెదుట ప్రధానయాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.

జెకర్యా 4:2 – నీకు ఏమి కనబడుచున్నదని యడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడుచున్నవి.

జెకర్యా 5:2 – నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను, ఇరువైమూరల నిడివియు పదిమూరల వెడల్పునుగల యెగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడుచున్నదంటిని.

జెకర్యా 6:1 – నేను మరల తేరిచూడగా రెండు పర్వతముల మధ్యనుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను, ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై యుండెను.

-to Paul

అపోస్తలులకార్యములు 9:3 – అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను.

అపోస్తలులకార్యములు 9:6 – లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.

అపోస్తలులకార్యములు 16:9 – అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను.

అపోస్తలులకార్యములు 18:9 – రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము.

అపోస్తలులకార్యములు 22:18 – అప్పుడాయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను.

అపోస్తలులకార్యములు 27:23 – నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి పౌలా, భయపడకుము;

2దినవృత్తాంతములు 12:1 – రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి.

2దినవృత్తాంతములు 12:2 – వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు వెయ్యిన్ని రెండువందల రథములతోను అరువదివేల గుఱ్ఱపు రౌతులతోను యెరూషలేముమీదికి వచ్చెను.

2దినవృత్తాంతములు 12:3 – అతనితో కూడ ఐగుప్తునుండి వచ్చిన లూబీయులు సుక్కీయులు కూషీయులు అనువారు లెక్కకు మించియుండిరి.

2దినవృత్తాంతములు 12:4 – అతడు యూదాకు సమీపమైన ప్రాకార పురములను పట్టుకొని యెరూషలేమువరకు రాగా

-to Ananias

అపోస్తలులకార్యములు 9:10 – దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయా, అని అతనిని పిలువగా

అపోస్తలులకార్యములు 9:11 – అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు

-to Cornelius

అపోస్తలులకార్యములు 10:3 – పగలు ఇంచుమించు మూడుగంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.

-to Peter

అపోస్తలులకార్యములు 10:9 – మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెమీది కెక్కెను.

అపోస్తలులకార్యములు 10:10 – అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై

అపోస్తలులకార్యములు 10:11 – ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి దిగివచ్చుటయు చూచెను.

అపోస్తలులకార్యములు 10:12 – అందులో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకు పురుగులును, ఆకాశపక్షులును ఉండెను.

అపోస్తలులకార్యములు 10:13 – అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను.

అపోస్తలులకార్యములు 10:14 – అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా

అపోస్తలులకార్యములు 10:15 – దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను.

అపోస్తలులకార్యములు 10:16 – ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమున కెత్తబడెను.

అపోస్తలులకార్యములు 10:17 – పేతురు తనకు కలిగిన దర్శనమేమైయుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి

– To John (See also Rev chapters 4 – 22)

ప్రకటన 1:12 – ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.

Sometimes withheld for a long season

1సమూయేలు 3:1 – బాలుడైన సమూయేలు ఏలీ యెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు.

The withholding of a great calamity

సామెతలు 29:18 – దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు.

విలాపవాక్యములు 2:9 – పట్టణపు గవునులు భూమిలోనికి క్రుంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడుచేసెను దాని రాజును అధికారులును అన్యజనులలోనికి పోయియున్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు.

False prophets pretended to have seen

యిర్మియా 14:14 – యెహోవా నాతో ఇట్లనెను ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.

యిర్మియా 23:16 – సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు ప్రచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు.

The prophets of God skilled in interpreting

2దినవృత్తాంతములు 26:5 – దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివికలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను.

దానియేలు 1:17 – ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.