Display Topic
Created by God
ఆదికాండము 1:20 – దేవుడు జీవముకలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.
ఆదికాండము 1:21 – దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.
ఆదికాండము 2:19 – దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతనియొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.
Created for the glory of God
కీర్తనలు 148:10 – మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా,
Herb of the field given as food to
ఆదికాండము 1:30 – భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.
Differ in flesh from beasts and fishes
1కొరిందీయులకు 15:39 – మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు.
Power over given to man
ఆదికాండము 1:26 – దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
కీర్తనలు 8:8 – సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటిని వాని పాదములక్రింద నీవు ఉంచియున్నావు.
Names given to, by Adam
ఆదికాండము 2:19 – దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతనియొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.
ఆదికాండము 2:20 – అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేకపోయెను.
Instinctively fear man
ఆదికాండము 9:2 – మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీచేతికప్పగింపబడి యున్నవి.
Instinct of, inferior to man’s reason
యోబు 35:11 – భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకొను వారెవరును లేరు.
Lessons of wisdom to be learned from
యోబు 12:7 – అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.
Can all be tamed
యాకోబు 3:7 – మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతిచేత సాధు కాజాలును, సాధు ఆయెను గాని
Given as food to man
ఆదికాండము 9:2 – మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీచేతికప్పగింపబడి యున్నవి.
ఆదికాండము 9:3 – ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.
The blood of, not to be eaten
లేవీయకాండము 7:26 – మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు.
The property of God
కీర్తనలు 50:11 – కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి.
God provides for
కీర్తనలు 104:1 – నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనత వహించినవాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు.
కీర్తనలు 104:2 – వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచియున్నావు.
కీర్తనలు 104:3 – జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
కీర్తనలు 104:4 – వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను2 తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు.
కీర్తనలు 104:5 – భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.
కీర్తనలు 104:6 – దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె కప్పితివి. కొండలకుపైగా నీళ్లు నిలిచెను.
కీర్తనలు 104:7 – నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.
కీర్తనలు 104:8 – నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.
కీర్తనలు 104:9 – అవి మరలివచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.
కీర్తనలు 104:10 – ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును.
కీర్తనలు 104:11 – అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును. వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును.
కీర్తనలు 104:12 – వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును.
మత్తయి 6:26 – ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
లూకా 12:23 – ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
లూకా 12:24 – కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.
Called
-Fowls of the air
ఆదికాండము 7:3 – ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి యేడును ఆడువి యేడును, నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము;
-Fowls of heaven
యోబు 35:11 – భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకొను వారెవరును లేరు.
-Feathered fowl
యెహెజ్కేలు 39:17 – నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సకలజాతుల పక్షులకును భూమృగములకన్నిటికిని యీ సమాచారము తెలియజేయుము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి; ఇశ్రాయేలీయుల పర్వతములమీద నొక గొప్ప బలి జరుగును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు;
-Winged fowl
ద్వితియోపదేశాకాండము 4:17 – ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను
-Birds of the air
మత్తయి 8:20 – అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
Many kinds of, graniverous
మత్తయి 13:4 – వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చి వాటిని మింగివేసెను
Many kinds of, carnivorous
ఆదికాండము 15:11 – గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.
ఆదికాండము 40:19 – ఇంక మూడు దినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను.
ద్వితియోపదేశాకాండము 28:26 – నీ కళేబరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించువాడెవడును ఉండడు.
Furnished with claws
దానియేలు 4:33 – ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభవించెను; మానవులలోనుండి అతని తరిమిరి, అతడు పశువులవలె గడ్డి మేసెను, ఆకాశపుమంచు అతని దేహమును తడపగా అతని తలవెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివియు నాయెను.
Propagated by eggs
ద్వితియోపదేశాకాండము 22:6 – గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనే గాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడినయెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్నయెడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును
యిర్మియా 17:11 – న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.
Make, and dwell in nests
మత్తయి 8:20 – అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
Are hostile to strange kinds
యిర్మియా 12:9 – నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయెనా? క్రూరపక్షులు దానిచుట్టు కూడుచున్నవా? రండి అడవిజంతువులన్నిటిని పోగుచేయుడి; మింగివేయుటకై అవి రావలెను.
Have each their peculiar note or song
కీర్తనలు 104:12 – వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును.
ప్రసంగి 12:4 – తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్టయొక్క కూతకు ఒకడు లేచును; సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్చబ్దముగా ఉంచబడుదురు.
పరమగీతము 2:12 – దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలముచేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
Fly above the earth
ఆదికాండము 1:20 – దేవుడు జీవముకలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.
Rapid flight of, alluded to
యెషయా 31:5 – పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును.
హోషేయ 9:11 – ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలె ఎగిరిపోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.
హోషేయ 11:11 – వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే యెహోవా వాక్కు.
Many kinds of, migratory
యిర్మియా 8:7 – ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తి పిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.
Often remove from places suffering calamities
యిర్మియా 4:25 – నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షులన్నియు ఎగిరిపోయియుండెను.
యిర్మియా 9:10 – పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలాపము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులును జంతువులును పారిపోయియున్నవి, అవి తొలగిపోయియున్నవి.
Rest on trees
దానియేలు 4:12 – దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను; దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెను; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను.
మత్తయి 13:32 – అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూరమొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును.
Inhabit
-Mountains
కీర్తనలు 50:11 – కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి.
-Deserts
కీర్తనలు 102:6 – నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడికంటెవలె నున్నాను.
-Marshes
యెషయా 14:23 – నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
-Deserted Cities
యెషయా 34:11 – గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించుకొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును.
యెషయా 34:14 – అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును
యెషయా 34:15 – చిత్తగూబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లుపెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కూడుకొనును.
Make their nests
-in trees
కీర్తనలు 104:17 – అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి.
యెహెజ్కేలు 31:6 – ఆకాశపక్షులన్నియు దాని శాఖలలో గూళ్లుకట్టుకొనెను, భూజంతువులన్నియు దాని కొమ్మలక్రింద పిల్లలు పెట్టెను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను.
-on the ground
ద్వితియోపదేశాకాండము 22:6 – గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనే గాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడినయెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్నయెడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును
-in clefts of rocks
సంఖ్యాకాండము 24:21 – మరియు అతడు కేనీయులవైపు చూచి ఉపమానరీతిగా ఇట్లనెను నీ నివాసస్థలము దుర్గమమైనది. నీ గూడు కొండమీద కట్టబడియున్నది.
యిర్మియా 48:28 – మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వలవలె కొండలో కాపురముండుడి.
-in Deserted Cities
యెషయా 34:15 – చిత్తగూబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లుపెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కూడుకొనును.
-under the roofs of houses
కీర్తనలు 84:3 – సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను.
Early distinguished into clean and clean
ఆదికాండము 8:20 – అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.
Clean
-Dove
ఆదికాండము 8:8 – మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తనయొద్దనుండి నల్ల పావురమొకటి వెలుపలికి పోవిడిచెను.
-Turtle
లేవీయకాండము 14:22 – వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒక దానిని తీసికొనిరావలెను.
పరమగీతము 2:12 – దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలముచేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
-Pigeon
లేవీయకాండము 1:14 – అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షిజాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలోనుండి గాని పావురపు పిల్లలలోనుండి గాని తేవలెను.
లేవీయకాండము 12:6 – కుమారునికొరకే గాని కుమార్తెకొరకే గాని ఆమె శుద్ధిదినములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.
-Quail
నిర్గమకాండము 16:12 – నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.
నిర్గమకాండము 16:13 – కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెము చుట్టు పడియుండెను.
సంఖ్యాకాండము 11:31 – తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దినప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను.
సంఖ్యాకాండము 11:32 – కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రిఅంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి.
-Sparrow
లేవీయకాండము 14:4 – యాజకుడు పవిత్రత పొందగోరు వానికొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.
మత్తయి 10:29 – రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
మత్తయి 10:30 – మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
మత్తయి 10:31 – గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
-Swallow
కీర్తనలు 84:3 – సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను.
యెషయా 38:14 – మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచలాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నత స్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూటబడియుండుము.
-Cock and Hen
మత్తయి 23:37 – యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.
మత్తయి 26:34 – యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
మత్తయి 26:74 – అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను
-Partridge
1సమూయేలు 26:20 – నా దేశమునకు దూరముగాను, యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోవుదును గాక. ఒకడు పర్వతములమీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజవైన నీవు మిన్నల్లిని వెదకుటకై బయలుదేరి వచ్చితివి.
యిర్మియా 17:11 – న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.
-Crane
యెషయా 38:14 – మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచలాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నత స్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూటబడియుండుము.
యిర్మియా 8:7 – ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తి పిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.
-to be Eaten
ద్వితియోపదేశాకాండము 14:11 – పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును.
ద్వితియోపదేశాకాండము 14:20 – ఎగురు ప్రతి పురుగు మీకు హేయము; వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును.
-offered in sacrifice
ఆదికాండము 8:20 – అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.
లేవీయకాండము 1:14 – అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షిజాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలోనుండి గాని పావురపు పిల్లలలోనుండి గాని తేవలెను.
Unclean
-eagle
లేవీయకాండము 11:13 – పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,
యోబు 39:27 – పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?
-Ossifrage
లేవీయకాండము 11:13 – పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,
-Osprey
లేవీయకాండము 11:13 – పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,
-Vulture
లేవీయకాండము 11:14 – క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,
యోబు 28:7 – ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని చూడలేదు
యెషయా 34:15 – చిత్తగూబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లుపెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కూడుకొనును.
-Glede
ద్వితియోపదేశాకాండము 14:13 – పెద్ద బోరువ, క్రౌంచుపక్షి,
-Kite
లేవీయకాండము 11:14 – క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,
-Raven
లేవీయకాండము 11:15 – ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,
యోబు 38:41 – తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
-Owl
లేవీయకాండము 11:16 – కపిరిగాడు, కోకిల,
యోబు 30:29 – నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.
-Nighthawk
లేవీయకాండము 11:16 – కపిరిగాడు, కోకిల,
-Cuckoo
లేవీయకాండము 11:16 – కపిరిగాడు, కోకిల,
-Hawk
లేవీయకాండము 11:17 – ప్రతివిధమైన డేగ,
యోబు 39:26 – డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?
-Little Owl
లేవీయకాండము 11:17 – ప్రతివిధమైన డేగ,
-Cormorant
లేవీయకాండము 11:17 – ప్రతివిధమైన డేగ,
యెషయా 34:11 – గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించుకొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును.
-great Owl
లేవీయకాండము 11:17 – ప్రతివిధమైన డేగ,
-Swan
లేవీయకాండము 11:18 – పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,
-Pelican
లేవీయకాండము 11:18 – పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,
కీర్తనలు 102:6 – నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడికంటెవలె నున్నాను.
-Gier eagle
లేవీయకాండము 11:18 – పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,
-Stork
లేవీయకాండము 11:19 – సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము.
కీర్తనలు 104:17 – అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి.
-Heron
లేవీయకాండము 11:19 – సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము.
-Lapwing
లేవీయకాండము 11:19 – సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము.
-Bat
లేవీయకాండము 11:19 – సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము.
యెషయా 2:20 – ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను
-Ostrich
యోబు 39:13 – నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దానికున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
యోబు 39:18 – అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును.
-Bittern
యెషయా 14:23 – నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యెషయా 34:11 – గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించుకొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును.
-Peacock
1రాజులు 10:22 – సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగియుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.
యోబు 39:13 – నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దానికున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
-Not to be Eaten
లేవీయకాండము 11:13 – పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,
లేవీయకాండము 11:17 – ప్రతివిధమైన డేగ,
ద్వితియోపదేశాకాండము 14:12 – మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు,
Not to be eaten with their young
ద్వితియోపదేశాకాండము 22:6 – గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనే గాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడినయెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్నయెడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును
ద్వితియోపదేశాకాండము 22:7 – నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసికొనవచ్చును.
Taken in snares or nets
సామెతలు 1:17 – పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము.
Often suffered for man’s sin
ఆదికాండము 6:7 – అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను
యిర్మియా 12:4 – భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవుచున్నవి.
యెహెజ్కేలు 38:20 – సముద్రపు చేపలును ఆకాశపక్షులును భూజంతువులును భూమిమీద ప్రాకు పురుగులన్నియు భూమిమీదనుండు నరులందరును నాకు భయపడి వణకుదురు, పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నియు నేలపడును
హోషేయ 4:3 – కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశపక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడ గతించిపోవుచున్నవి.
Solomon wrote the history of
1రాజులు 4:33 – మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినిగూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటినిగూర్చియు అతడు వ్రాసెను.
Confinement of, in cages alluded to
యిర్మియా 5:27 – పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులును అగుదురు.
No likeness of, to be made for worship
ద్వితియోపదేశాకాండము 4:17 – ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను
Often worshipped by idolaters
రోమీయులకు 1:23 – వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.
Illustrative
-of Cruel and rapacious Kings
యెషయా 46:11 – తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.
-of hostile nations
యిర్మియా 12:9 – నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయెనా? క్రూరపక్షులు దానిచుట్టు కూడుచున్నవా? రండి అడవిజంతువులన్నిటిని పోగుచేయుడి; మింగివేయుటకై అవి రావలెను.
-of people of different countries
యెహెజ్కేలు 31:6 – ఆకాశపక్షులన్నియు దాని శాఖలలో గూళ్లుకట్టుకొనెను, భూజంతువులన్నియు దాని కొమ్మలక్రింద పిల్లలు పెట్టెను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను.
మత్తయి 13:32 – అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూరమొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును.
– Of unsettled person, &c
సామెతలు 27:8 – తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.
యెషయా 16:2 – గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు.
-of the devil and His spirits
మత్తయి 13:4 – వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చి వాటిని మింగివేసెను
మత్తయి 13:19 – ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.
– (Snaring,) of death
ప్రసంగి 9:12 – తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు.
– (Snaring,) of designs of the wicked
కీర్తనలు 124:7 – పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొనియున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొనియున్నాము.
సామెతలు 1:10 – నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
సామెతలు 1:11 – మాతోకూడ రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము
సామెతలు 1:12 – పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.
సామెతలు 1:13 – పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము
సామెతలు 1:14 – నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు.
సామెతలు 1:15 – నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.
సామెతలు 1:16 – కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
సామెతలు 1:17 – పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము.
సామెతలు 7:23 – తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.