Display Topic


Placed in the breastplate of the high priest

నిర్గమకాండము 28:30 – మరియు నీవు న్యాయవిధానపతకములో ఊరీము తుమ్మీము అనువాటిని ఉంచవలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.

లేవీయకాండము 8:8 – ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి

God to be consulted by

సంఖ్యాకాండము 27:21 – యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను.

Instances of consulting God by

న్యాయాధిపతులు 1:1 – యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీయులుకనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా

న్యాయాధిపతులు 20:18 – వీరు లేచి బేతేలుకు పోయిఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవునియొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను.

న్యాయాధిపతులు 20:28 – అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధమునకు పోదుమా,మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వెళ్లుడి రేపు నీచేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.

1సమూయేలు 23:9 – సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను.

1సమూయేలు 23:10 – అప్పుడు దావీదు ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడుచేయ నుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడియున్నది.

1సమూయేలు 23:11 – కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను.

1సమూయేలు 30:7 – పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను.

1సమూయేలు 30:8 – నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.

Sometimes no answer by, in consequence of the sin of those consulting

1సమూయేలు 28:6 – యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను.

Were wanting in the second temple

ఎజ్రా 2:63 – మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీముును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడువరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను.

నెహెమ్యా 7:65 – కాగా అధికారి ఊరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.

Illustrative of the light and perfection of Christ, the true high priest

ద్వితియోపదేశాకాండము 33:8 – లేవినిగూర్చి యిట్లనెను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి.

యోహాను 1:4 – ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

యోహాను 1:9 – నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.

యోహాను 1:17 – ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసుక్రీస్తుద్వారా కలిగెను.

కొలొస్సయులకు 2:3 – బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.