Display Topic
God is the true object of
కీర్తనలు 65:5 – మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతినిబట్టి భీకరక్రియలచేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు
The fear of God leads to
సామెతలు 14:26 – యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును
ENCOURAGEMENTS TO
-the Everlasting strength of God
యెషయా 26:4 – యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
-the goodness of God
నహూము 1:7 – యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును.
-the Loving-kindness of God
కీర్తనలు 36:7 – దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
-the rich bounty of God
1తిమోతి 6:17 – ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.
-the care of God for us
1పేతురు 5:7 – ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
-Former deliverances
కీర్తనలు 9:10 – యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు
2కొరిందీయులకు 1:10 – ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థన చేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.
Should be with the whole heart
సామెతలు 3:5 – నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము
Should be from youth up
కీర్తనలు 71:5 – నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.
OF SAINTS IS
-Not in the flesh
ఫిలిప్పీయులకు 3:3 – ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.
ఫిలిప్పీయులకు 3:4 – కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును; మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును.
-Not in Themselves
2కొరిందీయులకు 1:9 – మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మికయుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.
-Not in Carnal weapons
1సమూయేలు 17:38 – పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవచము తొడిగించెను.
1సమూయేలు 17:39 – ఈ సామగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్లకలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి
1సమూయేలు 17:45 – దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.
కీర్తనలు 44:6 – నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు
2కొరిందీయులకు 10:4 – మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి.
-in God
కీర్తనలు 11:1 – యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల?
కీర్తనలు 31:14 – యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను.
2కొరిందీయులకు 1:9 – మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మికయుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.
-in the word of God
కీర్తనలు 119:42 – అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయగలను ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను.
-in the mercy of God
కీర్తనలు 13:5 – నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను.
కీర్తనలు 52:8 – నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను
-in Christ
ఎఫెసీయులకు 3:12 – ఆయన యందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.
-through Christ
2కొరిందీయులకు 3:4 – క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు.
-grounded on the covenant
2సమూయేలు 23:5 – నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.
-Strong in the prospect of death
కీర్తనలు 23:4 – గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
-fixed
2సమూయేలు 22:3 – నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.
కీర్తనలు 112:7 – వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.
-Unalterable
యోబు 13:15 – ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.
-Despised by the Wicked
యెషయా 36:4 – అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి?
యెషయా 36:7 – మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే; యెరూషలేమందున్న యీ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా యెవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా.
-for ever
కీర్తనలు 52:8 – నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను
కీర్తనలు 62:8 – జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మికయుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము.(సెలా.)
యెషయా 26:4 – యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
Saints plead, in prayer
కీర్తనలు 25:20 – నేను నీ శరణుజొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడనియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.
కీర్తనలు 31:1 – యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.
కీర్తనలు 141:8 – యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయకుము.
The Lord knows those who have
నహూము 1:7 – యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును.
Exhortations to
కీర్తనలు 4:5 – నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి
కీర్తనలు 115:9 – ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
కీర్తనలు 115:10 – అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
కీర్తనలు 115:11 – యెహోవాయందు భయభక్తులు గలవారలారా యెహోవాయందు నమ్మికయుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
Leads to
-Being compassed with mercy
కీర్తనలు 32:10 – భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది.
-Enjoyment of Perfect peace
యెషయా 26:3 – ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు.
-Enjoyment of all temporal and spiritual blessings
యెషయా 57:13 – నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు.
-Enjoyment of happiness
సామెతలు 16:20 – ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.
-rejoicing in God
కీర్తనలు 5:11 – నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.
కీర్తనలు 33:21 – మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు.
-fulfilment of all holy Desires
కీర్తనలు 37:5 – నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.
-deliverance from Enemies
కీర్తనలు 37:40 – ఆయన భక్తిహీనులచేతిలోనుండి వారిని విడిపించి రక్షించును.
-safety in times of danger
సామెతలు 29:25 – భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.
-Stability
కీర్తనలు 125:1 – యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
-Prosperity
సామెతలు 28:25 – పేరాస గలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.
KEEPS FROM
-fear
కీర్తనలు 56:11 – నేను దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు?
యెషయా 12:2 – ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
హెబ్రీయులకు 13:6 – కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
-Sliding
కీర్తనలు 26:1 – యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను.
-desolation
కీర్తనలు 34:22 – యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.
To be accompanied by doing good
కీర్తనలు 37:3 – యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము
Blessedness of placing, in God
కీర్తనలు 2:12 – ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.
కీర్తనలు 34:8 – యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
కీర్తనలు 40:4 – గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
యిర్మియా 17:7 – యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
OF THE WICKED
-is Not in God
కీర్తనలు 78:22 – వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు.
జెఫన్యా 3:2 – అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవునియొద్దకు రాదు.
-is in idols
యెషయా 42:17 – చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు.
హబక్కూకు 2:18 – చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించినదానియందు నమ్మికయుంచుటవలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమ్మికయుంచుటవలన ప్రయోజనమేమి?
-is in Man
న్యాయాధిపతులు 9:26 – ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్ర యించిరి.
కీర్తనలు 118:8 – మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
కీర్తనలు 118:9 – రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
-is in their own heart
సామెతలు 28:26 – తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.
-is in their own righteousness
లూకా 18:9 – తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.
లూకా 18:12 – వారమునకు రెండుమారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను.
-is in Vanity
యోబు 15:31 – వారు మాయను నమ్ముకొనకుందురు గాక; వారు మోసపోయినవారు మాయయే వారికి ఫలమగును.
యెషయా 59:4 – నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.
-is in falsehood
యెషయా 28:15 – మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతివిు ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.
యిర్మియా 13:25 – నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
-is in earthly alliances
యెషయా 30:2 – వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు.
యెహెజ్కేలు 17:15 – అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యమునిచ్చి సహాయము చేయవలెనని యడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజుమీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసినవాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు
-is in Wealth
కీర్తనలు 49:6 – తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధనవిస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను?
కీర్తనలు 52:7 – ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమ్మికయుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు.
సామెతలు 11:28 – ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు
యిర్మియా 48:7 – నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషు దేవత చెరలోనికిపోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.
మార్కు 10:24 – ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము;
-is vain and delusive
యెషయా 30:7 – ఐగుప్తువలని సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమియు చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను.
యిర్మియా 2:37 – చేతులు నెత్తిని బెట్టుకొని ఆ జనమునొద్దనుండి బయలువెళ్లెదవు; యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటివలన నీకు క్షేమము కలుగదు.
-Shall make them ashamed
యెషయా 20:5 – వారు తాము నమ్ముకొనిన కూషీయులనుగూర్చియు, తాము అతి శయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులనుగూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు.
యెషయా 30:3 – ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును.
యెషయా 30:5 – వారందరును తమకు అక్కరకు రాకయే సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు.
యిర్మియా 48:13 – ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు
-Shall be destroyed
యోబు 18:14 – వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురు వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
యెషయా 28:18 – మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయబడును పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలువదు ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగుదురు
Woe and curse of false
యెషయా 30:1 – యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు
యెషయా 30:2 – వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు.
యెషయా 31:1 – ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.
యెషయా 31:2 – అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల యింటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును.
యెషయా 31:3 – ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.
యిర్మియా 17:5 – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.
Of saints-Illustrated
కీర్తనలు 91:12 – నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమచేతులమీద ఎత్తి పట్టుకొందురు
సామెతలు 18:10 – యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
Of the wicked-Illustrated
2రాజులు 18:21 – నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వానిచేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొను వారికందరికిని అట్టివాడే.
యోబు 8:14 – అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.
Of saints-Exemplified
-David
1సమూయేలు 17:45 – దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.
1సమూయేలు 30:6 – దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులనుబట్టియు కుమార్తెలనుబట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను.
-Hezekiah
2రాజులు 18:5 – అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు; అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వికులైన రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడు.
-Jehoshaphat
2దినవృత్తాంతములు 20:12 – మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.
– Shadrach &c
దానియేలు 3:28 – నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.
-Paul
2తిమోతి 1:12 – ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.
Of the wicked-Exemplified
-Goliath
1సమూయేలు 17:43 – ఫిలిష్తీయుడు కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను.
1సమూయేలు 17:44 – నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగముల కును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీ యుడు దావీదుతో అనగా
1సమూయేలు 17:45 – దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.
-Benhadad
1రాజులు 20:10 – బెన్హదదు మరల అతనియొద్దకు దూతలను పంపి నాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొనిపోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను.
-Sennacherib
2దినవృత్తాంతములు 32:8 – మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.
-Israelites
యెషయా 31:1 – ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.