Display Topic


Adversaries of the Lord

1సమూయేలు 2:10 – యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించినవానికి అధికబలము కలుగజేయును.

Children of Belial

ద్వితియోపదేశాకాండము 13:13 – పనికిమాలిన కొందరు మనుష్యులు నీమధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను.

2దినవృత్తాంతములు 13:7 – సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలోనుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తిలేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి.

Children of the devil

అపోస్తలులకార్యములు 13:10 – అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?

1యోహాను 3:10 – దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.

Children of the wicked one

మత్తయి 13:38 – పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు? గురుగులు దుష్టుని సంబంధులు?

Children of hell

మత్తయి 23:15 – అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాతృనిగా చేయుదురు

Children of base men

యోబు 30:8 – వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు.

Children of fools

యోబు 30:8 – వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు.

Children of strangers

యెషయా 2:6 – యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించియున్నావు.

Children of transgression

యెషయా 57:4 – మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?

Children of disobedience

ఎఫెసీయులకు 2:2 – మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి.

కొలొస్సయులకు 3:6 – వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును.

Children in whom is no faith

ద్వితియోపదేశాకాండము 32:20 – ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తము గలవారు విశ్వాసములేని పిల్లలు.

Children of the flesh

రోమీయులకు 9:8 – అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు.

Children of iniquity

హోషేయ 10:9 – ఇశ్రాయేలూ, గిబియా దినములనుండి నీవు పాపము చేయుచు వచ్చితివి, అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గులమీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదకి రాగా

Children that will not hear the law of the Lord

యెషయా 30:9 – వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు

Children of pride

యోబు 41:34 – అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికి అది రాజు.

Children of this world

లూకా 16:8 – అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులైయున్నారు

Children of wickedness

2సమూయేలు 7:10 – మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి

Children of wrath

ఎఫెసీయులకు 2:3 – వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

Children that are corrupters

యెషయా 1:4 – పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించియున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయియున్నారు.

Cursed children

2పేతురు 2:14 – వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులునైయుండి,

Enemies of God

కీర్తనలు 37:20 – భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.

యాకోబు 4:4 – వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

Enemies of the cross of Christ

ఫిలిప్పీయులకు 3:18 – అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరినిగూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను.

Enemies of all righteousness

అపోస్తలులకార్యములు 13:10 – అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?

Evil doers

కీర్తనలు 37:1 – చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.

1పేతురు 2:14 – రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.

Evil men

సామెతలు 4:14 – భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.

2తిమోతి 3:13 – అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.

Evil generation

ద్వితియోపదేశాకాండము 1:35 – బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచిదేశమును ఈ చెడ్డతరమువారిలో

Evil and adulterous generation

మత్తయి 12:39 – వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ యైనను వారికి అనుగ్రహింపబడదు.

Fools

సామెతలు 1:7 – యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

రోమీయులకు 1:22 – వారి అవివేకహృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

Froward generation

ద్వితియోపదేశాకాండము 32:20 – ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తము గలవారు విశ్వాసములేని పిల్లలు.

Generation of vipers

మత్తయి 3:7 – అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సునకు తగిన ఫలము ఫలించుడి

మత్తయి 12:34 – సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.

Grievous revolters

యిర్మియా 6:28 – వారందరు బహు ద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు.

Haters of God

కీర్తనలు 81:15 – యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును.

రోమీయులకు 1:30 – కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును

Impudent children

యెహెజ్కేలు 2:4 – వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారియొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు

Inventors of evil things

రోమీయులకు 1:30 – కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును

Lying children

యెషయా 30:9 – వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు

Men of the world

కీర్తనలు 17:14 – లోకుల చేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండి నీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.

People loaded with iniquity

యెషయా 1:4 – పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించియున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయియున్నారు.

Perverse and crooked generation

ద్వితియోపదేశాకాండము 32:5 – వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులు కారు; వారు కళంకులు మూర్ఖతగల వక్రవంశము.

మత్తయి 17:17 – అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను.

ఫిలిప్పీయులకు 2:15 – సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.

Rebellious children

యెషయా 30:1 – యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు

Rebellious people

యెషయా 30:9 – వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు

యెషయా 65:2 – తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచుకొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నాచేతులు చాపుచున్నాను.

Rebellious house

యెహెజ్కేలు 2:5 – గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను.

యెహెజ్కేలు 2:8 – వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము.

యెహెజ్కేలు 12:2 – నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారిమధ్య నీవు నివసించుచున్నావు; వారు ద్రోహులై యుండి, చూచుకన్నులు కలిగియు చూడకయున్నారు; విను చెవులు కలిగియు వినకయున్నారు.

Reprobates

2కొరిందీయులకు 13:5 – మీరు విశ్వాసము గలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మునుగూర్చి మీరే యెరుగరా?

2కొరిందీయులకు 13:6 – మేము భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను.

2కొరిందీయులకు 13:7 – మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము; మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు గాని, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము.

Scornful, the

కీర్తనలు 1:1 – దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక

Seed of falsehood

యెషయా 57:4 – మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?

Seed of the wicked

కీర్తనలు 37:28 – ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.

Seed of evil doers

యెషయా 1:4 – పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించియున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయియున్నారు.

యెషయా 14:20 – నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.

Serpents

మత్తయి 23:33 – సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీరేలాగు తప్పించుకొందురు?

Servants of corruption

2పేతురు 2:19 – తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా

Servants of sin

యోహాను 8:34 – అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

రోమీయులకు 6:20 – మీరు పాపమునకు దాసులైయున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.

Sinful generation

మార్కు 8:28 – అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.

Sinners

కీర్తనలు 26:9 – పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.

సామెతలు 1:10 – నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.

Sons of Belial

1సమూయేలు 2:12 – ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులై యుండిరి.

1రాజులు 21:10 – నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టుడి.

Sottish children

యిర్మియా 4:22 – నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియునుగాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు.

Strange children

కీర్తనలు 144:7 – పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహా జలములలోనుండి అన్యుల చేతిలోనుండి నన్ను విడిపింపుము.

Stubborn and rebellious generation

కీర్తనలు 78:8 – ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికాజ్ఞాపించెను

Transgressors

కీర్తనలు 37:38 – భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము

కీర్తనలు 51:13 – అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు.

Ungodly, the

కీర్తనలు 1:1 – దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక

Ungodly men

యూదా 1:4 – ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.

Unprofitable servants

మత్తయి 25:30 – మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.

Untoward generation

అపోస్తలులకార్యములు 2:40 – ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను.

Vessels of wrath

రోమీయులకు 9:22 – ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిననేమి?

Wicked of the earth

కీర్తనలు 75:8 – యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను.

Wicked transgressors

కీర్తనలు 59:5 – సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము.(సెలా.)

Wicked servants

మత్తయి 25:26 – అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లనిచోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా?

Wicked generation

మత్తయి 12:45 – అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించుననెను.

మత్తయి 16:4 – వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనానుగూర్చిన సూచక క్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారికనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను.

Wicked ones

యిర్మియా 2:33 – కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు; అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా.

Wicked doers

కీర్తనలు 101:8 – యెహోవా పట్టణములోనుండి పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను.

సామెతలు 17:4 – చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి యొగ్గును.

Workers of iniquity

కీర్తనలు 28:3 – భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు

కీర్తనలు 36:12 – అదిగో పాపము చేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు.