Display Topic


Moses was commanded to make after a divine pattern

నిర్గమకాండము 25:9 – నేను నీకు కనుపరచు విధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.

నిర్గమకాండము 26:30 – అప్పుడు కొండమీద నీకు కనుపరచబడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.

హెబ్రీయులకు 8:5 – మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు.

Made of the free-will offerings of the people

నిర్గమకాండము 25:1 – యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

నిర్గమకాండము 25:2 – నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యునియొద్ద దాని తీసికొనవలెను.

నిర్గమకాండము 25:3 – మీరు వారియొద్ద తీసికొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,

నిర్గమకాండము 25:4 – నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,

నిర్గమకాండము 25:5 – ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,

నిర్గమకాండము 25:6 – ప్రదీపమునకు తైలము, అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,

నిర్గమకాండము 25:7 – లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.

నిర్గమకాండము 25:8 – నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.

నిర్గమకాండము 35:4 – మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజముతో ఇట్లనెను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా

నిర్గమకాండము 35:5 – మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగుచేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి,

నిర్గమకాండము 35:21 – తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పనికొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రములకొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.

నిర్గమకాండము 35:22 – స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి.

నిర్గమకాండము 35:23 – మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి యెవరియొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి.

నిర్గమకాండము 35:24 – వెండిగాని యిత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవనియొద్దనుండెనో వాడు దాని తెచ్చెను.

నిర్గమకాండము 35:25 – మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి.

నిర్గమకాండము 35:26 – ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి.

నిర్గమకాండము 35:27 – ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను

నిర్గమకాండము 35:28 – సుగంధ ద్రవ్యమును, దీపమునకును అభిషేకతైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి.

నిర్గమకాండము 35:29 – మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటికొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.

Divine wisdom given to Bezaleel to make

నిర్గమకాండము 31:2 – చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.

నిర్గమకాండము 31:3 – విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై

నిర్గమకాండము 31:4 – రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును

నిర్గమకాండము 31:5 – సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను.

నిర్గమకాండము 31:6 – మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను.

నిర్గమకాండము 31:7 – ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దానిమీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటిని

నిర్గమకాండము 35:30 – మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను చూడుడి;

నిర్గమకాండము 35:31 – యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును,

నిర్గమకాండము 35:32 – రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును,

నిర్గమకాండము 35:33 – విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు.

నిర్గమకాండము 35:34 – అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను.

నిర్గమకాండము 35:35 – చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పనియైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు.

నిర్గమకాండము 36:1 – పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను.

Called the

-Tabernacle of the Lord

యెహోషువ 22:19 – మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్ర ముగా నుండినయెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసికొనుడి, మన దేవుడైన యెహోవా బలి పీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి,

1రాజులు 2:28 – యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనీయా పక్షము అవలంబించియుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.

1దినవృత్తాంతములు 16:39 – గిబియోనులోని ఉన్నత స్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము

-Tabernacle of testimony or witness

నిర్గమకాండము 38:21 – మందిరపదార్థముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయులచేత మోషే మాటచొప్పున లెక్క పెట్టించెను.

సంఖ్యాకాండము 1:50 – నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటిమీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసినవారై యుందురు.

సంఖ్యాకాండము 17:7 – మోషే వారి కఱ్ఱలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను.

సంఖ్యాకాండము 17:8 – మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చియుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను.

2దినవృత్తాంతములు 24:6 – రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడుచేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణములనన్నిటిని బయలుదేవత పూజకు ఉపయోగించిరి.

అపోస్తలులకార్యములు 7:44 – అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను.

-Tabernacle of the congregation

నిర్గమకాండము 27:21 – సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.

నిర్గమకాండము 33:7 – అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్లుచు వచ్చెను

నిర్గమకాండము 40:26 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర యెదుట బంగారు ధూపవేదికను ఉంచి

-Tabernacle of Shiloh

కీర్తనలు 78:60 – షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను.

-Tabernacle of Joseph

కీర్తనలు 78:67 – పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు.

-temple of the Lord

1సమూయేలు 1:9 – వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనముమీద కూర్చునియుండగా

1సమూయేలు 3:3 – దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొనియుండగాను

-house of the Lord

యెహోషువ 6:24 – అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి; వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుపపాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో నుంచిరి.

1సమూయేలు 1:7 – ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను.

1సమూయేలు 1:24 – పాలు మాన్పించిన తరువాత అతడు ఇంక చిన్నవాడై యుండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తినితీసికొని షిలోహులోని మందిరమునకు వచ్చెను.

Was a moveable tent suited to the unsettled condition of Israel

2సమూయేలు 7:6 – ఐగుప్తులోనుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని.

2సమూయేలు 7:7 – ఇశ్రాయేలీయులతోకూడ నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా?

Designed for manifestation of God’s presence and for his worship

నిర్గమకాండము 25:8 – నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.

నిర్గమకాండము 29:42 – ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును.

నిర్గమకాండము 29:43 – అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసికొందును; అది నా మహిమవలన పరిశుద్ధపరచబడును.

The boards of

-made of shittim wood

నిర్గమకాండము 26:15 – మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.

నిర్గమకాండము 36:20 – మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను.

-ten cubits High by one and A Half Broad

నిర్గమకాండము 26:16 – పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.

నిర్గమకాండము 36:21 – పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.

-had each Two tenons fitted into Sockets of Silver

నిర్గమకాండము 26:17 – ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసి పెట్టవలెను.

నిర్గమకాండము 26:19 – మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.

నిర్గమకాండము 36:22 – ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను. అట్లు మందిరముయొక్క పలకలన్నిటికి చేసెను.

నిర్గమకాండము 36:23 – కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను.

నిర్గమకాండము 36:24 – ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను.

-twenty on south Side

నిర్గమకాండము 26:18 – ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.

నిర్గమకాండము 36:23 – కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను.

-twenty on north Side

నిర్గమకాండము 26:20 – మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున,

నిర్గమకాండము 36:25 – మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తరదిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను,

-six, and Two corner boards for west Side

నిర్గమకాండము 26:22 – పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.

నిర్గమకాండము 26:23 – మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.

నిర్గమకాండము 26:24 – అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితోఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.

నిర్గమకాండము 26:25 – పలకలు ఎనిమిది; వాటి వెండి దిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలుండవలెను.

నిర్గమకాండము 36:27 – పడమటిదిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను.

నిర్గమకాండము 36:28 – వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను.

నిర్గమకాండము 36:29 – అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరముదాక ఒకదానితోఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను.

నిర్గమకాండము 36:30 – ఎనిమిది పలకలుండెను; వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు; ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను.

-supported by Bars of shittim wood Resting in Rings of gold

నిర్గమకాండము 26:26 – తుమ్మకఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒకప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును

నిర్గమకాండము 26:27 – మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును ఉండవలెను;

నిర్గమకాండము 26:28 – ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను.

నిర్గమకాండము 26:29 – ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకఱ్ఱలకును బంగారు రేకును పొదిగింపవలెను.

నిర్గమకాండము 36:31 – మరియు అతడు తుమ్మకఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒకప్రక్క పలకకు అయిదు అడ్డకఱ్ఱలను

నిర్గమకాండము 36:32 – మందిరముయొక్క రెండవప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను, పడమటివైపున మందిరము యొక్క వెనుకప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను చేసెను.

నిర్గమకాండము 36:33 – పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండచేసెను.

-with the Bars, Covered with gold

నిర్గమకాండము 26:26 – తుమ్మకఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒకప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును

నిర్గమకాండము 26:27 – మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును ఉండవలెను;

నిర్గమకాండము 26:28 – ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను.

నిర్గమకాండము 26:29 – ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకఱ్ఱలకును బంగారు రేకును పొదిగింపవలెను.

నిర్గమకాండము 36:34 – ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను.

The door of, a curtain of blue and purple suspended by gold rings from five pillars of shittim wood

నిర్గమకాండము 26:36 – మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.

నిర్గమకాండము 26:37 – ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోత పోయవలెను.

నిర్గమకాండము 36:37 – మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పనియైన అడ్డతెరను చేసెను.

నిర్గమకాండము 36:38 – దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండెబద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు ఇత్తడివి.

Coverings of

– The first or inner, ten curtains of blue, purple, &c joined with loops and golden taches

నిర్గమకాండము 26:1 – మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేయవలెను.

నిర్గమకాండము 26:2 – ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత.

నిర్గమకాండము 26:3 – అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను.

నిర్గమకాండము 26:4 – తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను.

నిర్గమకాండము 26:5 – ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనునట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.

నిర్గమకాండము 26:6 – మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.

నిర్గమకాండము 36:8 – ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను.

నిర్గమకాండము 36:9 – ప్రతి తెరపొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు; ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే.

నిర్గమకాండము 36:10 – అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్చెను; మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను.

నిర్గమకాండము 36:11 – మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను.

నిర్గమకాండము 36:12 – ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను, రెండవ కూర్పునున్న తెర అంచున ఏబది కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒక దానితో ఒకటి సరిగా నుండెను.

నిర్గమకాండము 36:13 – మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒక దానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను.

– The second, eleven curtains of goats’ hair

నిర్గమకాండము 26:7 – మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.

నిర్గమకాండము 26:8 – ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే.

నిర్గమకాండము 26:9 – అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.

నిర్గమకాండము 26:10 – తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.

నిర్గమకాండము 26:11 – మరియు ఏబది యిత్తడి గుండీలను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను.

నిర్గమకాండము 26:12 – ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.

నిర్గమకాండము 26:13 – మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.

నిర్గమకాండము 36:14 – మరియు మందిరముమీద గుడారముగా మేక వెండ్రుకలతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగా చేసెను.

నిర్గమకాండము 36:15 – ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు;

నిర్గమకాండము 36:16 – ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను.

నిర్గమకాండము 36:17 – మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకులను చేసెను.

నిర్గమకాండము 36:18 – ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను.

– The third of rams’ skins dyed red

నిర్గమకాండము 26:14 – మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను.

నిర్గమకాండము 36:19 – మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారముకొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను.

– The fourth or outward of badgers’ skins

నిర్గమకాండము 26:14 – మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను.

నిర్గమకాండము 36:19 – మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారముకొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను.

Divided by a vail of blue, purple, suspended from four pillars of shittim

నిర్గమకాండము 26:31 – మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.

నిర్గమకాండము 26:32 – తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి.

నిర్గమకాండము 26:33 – ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.

నిర్గమకాండము 36:35 – మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను, చిత్రకారునిపనియైన కెరూబులు గలదానిగా దాని చేసెను.

నిర్గమకాండము 36:36 – దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటికొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను.

నిర్గమకాండము 40:21 – మందిరములోనికి మందసమును తెచ్చి కప్పుతెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.

Divided into

-the holy place

నిర్గమకాండము 26:33 – ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.

హెబ్రీయులకు 9:2 – ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.

హెబ్రీయులకు 9:3 – రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.

హెబ్రీయులకు 9:4 – అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోనుచేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను

హెబ్రీయులకు 9:5 – దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.

హెబ్రీయులకు 9:6 – ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని

-the Most holy place

నిర్గమకాండము 26:34 – అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసముమీద కరుణాపీఠము నుంచవలెను.

హెబ్రీయులకు 9:3 – రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.

హెబ్రీయులకు 9:7 – సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధానయాజకుడొక్కడే రక్తముచేతపట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.

Had a court round about

నిర్గమకాండము 40:8 – తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను.

The table of show-bread, the golden candlestick, and the altar of incense were place in the holy place

నిర్గమకాండము 26:35 – అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచవలెను.

నిర్గమకాండము 40:22 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తరదిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి

నిర్గమకాండము 40:24 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణదిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి

నిర్గమకాండము 40:26 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర యెదుట బంగారు ధూపవేదికను ఉంచి

హెబ్రీయులకు 9:2 – ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.

The ark and mercy-seat put in the most holy place

నిర్గమకాండము 26:33 – ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.

నిర్గమకాండము 26:34 – అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసముమీద కరుణాపీఠము నుంచవలెను.

నిర్గమకాండము 40:20 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.

నిర్గమకాండము 40:21 – మందిరములోనికి మందసమును తెచ్చి కప్పుతెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.

హెబ్రీయులకు 9:4 – అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోనుచేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను

Court of

-one hundred cubits Long and fifty cubits Wide

నిర్గమకాండము 27:18 – ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబది మూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.

-Surrounded by Curtains of Fine line suspended from pillars in Sockets of Brass

నిర్గమకాండము 27:9 – మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.

నిర్గమకాండము 27:10 – దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

నిర్గమకాండము 27:11 – అట్లే పొడుగులో ఉత్తరదిక్కున నూరు మూరల పొడుగు గల యవనికలుండవలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దులును వెండివి

నిర్గమకాండము 27:12 – పడమటిదిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది.

నిర్గమకాండము 27:13 – తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.

నిర్గమకాండము 27:14 – ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

నిర్గమకాండము 27:15 – రెండవ ప్రక్కను పరునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు.

నిర్గమకాండము 38:9 – మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారవియునైన తెరలుండెను.

నిర్గమకాండము 38:10 – వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

నిర్గమకాండము 38:11 – ఉత్తరదిక్కుననున్న తెరలు నూరు మూరలవి; వాటి స్తంభములు ఇరువది, వాటి యిత్తడి దిమ్మలు ఇరువది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

నిర్గమకాండము 38:12 – పడమటిదిక్కున తెరలు ఏబది మూరలవి; వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

నిర్గమకాండము 38:13 – తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు;

నిర్గమకాండము 38:14 – ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

నిర్గమకాండము 38:15 – అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

నిర్గమకాండము 38:16 – ఆవరణము చుట్టునున్న దాని తెరలన్నియు పేనిన సన్ననారవి.

– The gate of, a hanging of blue, purple, &c twenty cubits wide, suspended from four pillars, &c

నిర్గమకాండము 27:16 – ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు.

నిర్గమకాండము 38:18 – ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటాపనిది. దాని పొడుగు ఇరువది మూరలు; దాని యెత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, అయిదు మూరలు.

-Contained the brazen altar and laver of Brass

నిర్గమకాండము 40:29 – దానిమీద దహనబలినర్పించి నైవేద్యమును సమర్పించెను.

నిర్గమకాండము 40:30 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.

– All the pillars of, filleted with silver, &c

నిర్గమకాండము 27:17 – ఆవరణము చుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.

నిర్గమకాండము 38:17 – స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నియు వెండి బద్దలతో కూర్పబడెను.

-all the vessels of, made of Brass

నిర్గమకాండము 27:19 – మందిర సంబంధమైన సేవోపకరణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.

First reared, on the first day of the second year after the exodus

నిర్గమకాండము 40:2 – మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.

నిర్గమకాండము 40:17 – రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను.

Was set up

-by Moses at mount Sinai

నిర్గమకాండము 40:18 – యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి

నిర్గమకాండము 40:19 – మందిరముమీద గుడారమును పరచి దానిపైని గుడారపు కప్పును వేసెను.

సంఖ్యాకాండము 10:11 – రెండవ సంవత్సరము రెండవ నెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరముమీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి.

సంఖ్యాకాండము 10:12 – తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.

-at Gilgal

యెహోషువ 5:10 – ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి.

యెహోషువ 5:11 – పస్కా పోయిన మరు నాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియునున్న భక్ష్య ములను తినిరి.

-in Shiloh

యెహోషువ 18:1 – ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరు షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి.

యెహోషువ 19:51 – యాజకుడైన ఎలియాజ రును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్లవలన పంపకముచేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.

-in Nob

1సమూయేలు 21:1 – దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను; అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుగగా

1సమూయేలు 21:2 – దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీ కాజ్ఞాపించి పంపిన పని యేదో అదెవనితోనైనను చెప్పవద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని;

1సమూయేలు 21:3 – నీయొద్ద ఏమియున్నది? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండినయెడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా

1సమూయేలు 21:4 – యాజకుడు సాధారణమైన రొట్టె నాయొద్ద లేదు; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను.

1సమూయేలు 21:5 – అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పనివారి బట్టలు పవిత్రములే; ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను.

1సమూయేలు 21:6 – అంతట యెహోవా సన్నిధినుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చనిరొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను.

-finally at Gibeon

1దినవృత్తాంతములు 16:39 – గిబియోనులోని ఉన్నత స్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము

1దినవృత్తాంతములు 21:29 – మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను.

Anointed and consecrated with oil

నిర్గమకాండము 40:9 – మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.

లేవీయకాండము 8:10 – మరియు మోషే అభిషేకతైలమును తీసికొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను.

సంఖ్యాకాండము 7:1 – మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి,

Sprinkled and purified with blood

హెబ్రీయులకు 9:21 – అదేవిధముగా గుడారము మీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను.

Sanctified by the glory of the Lord

నిర్గమకాండము 29:43 – అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసికొందును; అది నా మహిమవలన పరిశుద్ధపరచబడును.

నిర్గమకాండము 40:34 – అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.

సంఖ్యాకాండము 9:15 – వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను.

The Lord appeared in, over the mercy-seat

నిర్గమకాండము 25:22 – అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠము మీదనుండియు, శాసనములుగల మందసము మీదనుండు రెండు కెరూబుల మధ్యనుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను

లేవీయకాండము 16:2 – నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసముమీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.

సంఖ్యాకాండము 7:89 – మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీదనుండి, అనగా రెండు కెరూబుల నడమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.

The cloud of glory rested on, by night and day during its abode in The wilderness

నిర్గమకాండము 40:38 – ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.

సంఖ్యాకాండము 9:15 – వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను.

సంఖ్యాకాండము 9:16 – నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.

The journeys of Israel regulated by the cloud on

నిర్గమకాండము 40:36 – మేఘము మందిరము మీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి.

నిర్గమకాండము 40:37 – ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.

The priests

-Alone Could enter

సంఖ్యాకాండము 18:3 – వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠమునొద్దకైనను సమీపింపవలదు.

సంఖ్యాకాండము 18:5 – అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడవలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు.

-performed all services in

సంఖ్యాకాండము 3:10 – నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించినయెడల వాడు మరణశిక్ష నొందును.

సంఖ్యాకాండము 18:1 – యెహోవా అహరోనుతో ఇట్లనెను నీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధస్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు; నీవును నీ కుమారులును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు

సంఖ్యాకాండము 18:2 – మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొనిరావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను

హెబ్రీయులకు 9:6 – ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని

-were the Ministers of

హెబ్రీయులకు 8:2 – మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.

The Levites

-appointed over, and had Charge of

సంఖ్యాకాండము 1:50 – నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటిమీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసినవారై యుందురు.

సంఖ్యాకాండము 8:24 – ఇరువదియైదేండ్లు మొదలుకొని పై ప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పనిచేయుటకు రావలెను.

సంఖ్యాకాండము 18:2 – మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొనిరావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను

సంఖ్యాకాండము 18:3 – వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠమునొద్దకైనను సమీపింపవలదు.

సంఖ్యాకాండము 18:4 – వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను.

-Did the inferior service of

సంఖ్యాకాండము 3:6 – వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము.

సంఖ్యాకాండము 3:7 – వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసినదానిని, సర్వసమాజము కాపాడవలసినదానిని, వారు కాపాడవలెను.

సంఖ్యాకాండము 3:8 – మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని, వారే కాపాడవలెను.

-Took down, and put up

సంఖ్యాకాండము 1:51 – మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించినయెడల వాడు మరణశిక్ష నొందును.

-Carried

సంఖ్యాకాండము 4:15 – దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము.

సంఖ్యాకాండము 4:25 – వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను

సంఖ్యాకాండము 4:31 – ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను

-Pitched their tents around

సంఖ్యాకాండము 1:53 – ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.

సంఖ్యాకాండము 3:23 – గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటిదిక్కున దిగవలెను.

సంఖ్యాకాండము 3:29 – కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.

సంఖ్యాకాండము 3:35 – మెరారీయుల పితరుల కుటుంబములో అబీహాయిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.

Free-will offerings made at the first rearing of

సంఖ్యాకాండము 7:1 – మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి,

సంఖ్యాకాండము 7:2 – దాని ఉపకరణములన్నిటిని బలిపీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులును గోత్ర ముఖ్యులును లెక్కింపబడిన వారిమీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి.

సంఖ్యాకాండము 7:3 – వారు ఇద్దరిద్దరికి ఒక్కొక బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక యెద్దు చొప్పునను, ఆరు గూడుబండ్లను పండ్రెండు ఎద్దులను యెహోవా సన్నిధికి తీసికొనివచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసికొనివచ్చిరి.

సంఖ్యాకాండము 7:4 – అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు వారియొద్ద ఈ వస్తువులను తీసికొనుము;

సంఖ్యాకాండము 7:5 – అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై యుండును; నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను.

సంఖ్యాకాండము 7:6 – మోషే ఆ బండ్లను ఆ యెద్దులను తీసికొని లేవీయులకిచ్చెను.

సంఖ్యాకాండము 7:7 – అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవచొప్పున గెర్షోనీయులకిచ్చెను.

సంఖ్యాకాండము 7:8 – అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద సేవచేయు మెరారీయులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను.

సంఖ్యాకాండము 7:9 – కహాతీయులకియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజములమీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు.

Free-will offerings made at the dedication of the altar of

సంఖ్యాకాండము 7:10 – బలిపీఠము అభిషేకింపబడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి.

సంఖ్యాకాండము 7:11 – బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను.

సంఖ్యాకాండము 7:12 – మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను.

సంఖ్యాకాండము 7:13 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:14 – ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని

సంఖ్యాకాండము 7:15 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను

సంఖ్యాకాండము 7:16 – అపరాధపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

సంఖ్యాకాండము 7:17 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము.

సంఖ్యాకాండము 7:18 – రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడునైన నెతనేలు.

సంఖ్యాకాండము 7:19 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:20 – ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని

సంఖ్యాకాండము 7:21 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

సంఖ్యాకాండము 7:22 – ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

సంఖ్యాకాండము 7:23 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము.

సంఖ్యాకాండము 7:24 – మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను

సంఖ్యాకాండము 7:25 – నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:26 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

సంఖ్యాకాండము 7:27 – ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

సంఖ్యాకాండము 7:28 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

సంఖ్యాకాండము 7:29 – అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము.

సంఖ్యాకాండము 7:30 – నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను

సంఖ్యాకాండము 7:31 – డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:32 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

సంఖ్యాకాండము 7:33 – ఏడాది గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

సంఖ్యాకాండము 7:34 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.

సంఖ్యాకాండము 7:35 – ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము.

సంఖ్యాకాండము 7:36 – అయిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీషదాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు.

సంఖ్యాకాండము 7:37 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:38 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్నకోడెను

సంఖ్యాకాండము 7:39 – ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను

సంఖ్యాకాండము 7:40 – పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

సంఖ్యాకాండము 7:41 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము.

సంఖ్యాకాండము 7:42 – ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయాసాపా.

సంఖ్యాకాండము 7:43 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:44 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

సంఖ్యాకాండము 7:45 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను

సంఖ్యాకాండము 7:46 – పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.

సంఖ్యాకాండము 7:47 – ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము.

సంఖ్యాకాండము 7:48 – ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడునైన ఎలీషామా.

సంఖ్యాకాండము 7:49 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:50 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

సంఖ్యాకాండము 7:51 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును, ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

సంఖ్యాకాండము 7:52 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

సంఖ్యాకాండము 7:53 – అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా అర్పణము.

సంఖ్యాకాండము 7:54 – ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదాసూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీయేలు.

సంఖ్యాకాండము 7:55 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని

సంఖ్యాకాండము 7:56 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను

సంఖ్యాకాండము 7:57 – అపరాధపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను

సంఖ్యాకాండము 7:58 – అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.

సంఖ్యాకాండము 7:59 – ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము.

సంఖ్యాకాండము 7:60 – తొమ్మిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను.

సంఖ్యాకాండము 7:61 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది షెకెలుల బంగారు ధూపార్తిని

సంఖ్యాకాండము 7:62 – దహనబలిగా ఒక చిన్న కోడెను

సంఖ్యాకాండము 7:63 – ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను

సంఖ్యాకాండము 7:64 – పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

సంఖ్యాకాండము 7:65 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము.

సంఖ్యాకాండము 7:66 – పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీషదాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీయెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి

సంఖ్యాకాండము 7:67 – నూటముప్పది తులముల యెత్తు గల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:68 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

సంఖ్యాకాండము 7:69 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

సంఖ్యాకాండము 7:70 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

సంఖ్యాకాండము 7:71 – అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఆమీషదాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము.

సంఖ్యాకాండము 7:72 – పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు.

సంఖ్యాకాండము 7:73 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:74 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

సంఖ్యాకాండము 7:75 – దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

సంఖ్యాకాండము 7:76 – ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

సంఖ్యాకాండము 7:77 – సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము.

సంఖ్యాకాండము 7:78 – పండ్రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర.

సంఖ్యాకాండము 7:79 – అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 7:80 – ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్నకోడెను

సంఖ్యాకాండము 7:81 – ఒక పొట్టెలును ఏడాది గొఱ్ఱపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను

సంఖ్యాకాండము 7:82 – అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీర అర్పణము.

సంఖ్యాకాండము 7:83 – బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి, వెండి గిన్నెలు పండ్రెండు, వెండి ప్రోక్షణపాత్రలు పండ్రెండు, బంగారు ధూపార్తులు పండ్రెండు, ప్రతి వెండిగిన్నె నూట ముప్పది తులములది.

సంఖ్యాకాండము 7:84 – ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్బది తులములది; ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుధ్దమైన తులపు పరిమాణమునుబట్టి రెండువేల నాలుగువందల తులములది.

సంఖ్యాకాండము 7:85 – ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపార్తులు పండ్రెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది.

సంఖ్యాకాండము 7:86 – ఆ ధూపార్తుల బంగారమంతయు నూట ఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పండ్రెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు, ఏడాదివైన గొఱ్ఱపిల్లలు పండ్రెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగ మేకపిల్లలు పండ్రెండు,

సంఖ్యాకాండము 7:87 – సమాధానబలి పశువులన్నియు ఇరువది నాలుగు కోడెలు,

All offerings to be made at

లేవీయకాండము 17:4 – ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును;

ద్వితియోపదేశాకాండము 12:5 – మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను.

ద్వితియోపదేశాకాండము 12:6 – అక్కడికే మీరు మీ దహనబలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱమేకలలోను తొలిచూలు వాటిని తీసికొనిరావలెను.

ద్వితియోపదేశాకాండము 12:11 – నేను మికాజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహనబలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొనిరావలెను.

ద్వితియోపదేశాకాండము 12:13 – నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ.

ద్వితియోపదేశాకాండము 12:14 – యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకాజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను.

Punishment for defiling

లేవీయకాండము 15:31 – ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను.

సంఖ్యాకాండము 19:13 – నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వానికుండును.

A permanent house substituted for, when the kingdom was established

2సమూయేలు 7:5 – నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము యెహోవా నీకాజ్ఞ ఇచ్చునదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా?

2సమూయేలు 7:6 – ఐగుప్తులోనుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని.

2సమూయేలు 7:7 – ఇశ్రాయేలీయులతోకూడ నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా?

2సమూయేలు 7:8 – కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా గొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.

2సమూయేలు 7:9 – నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలము చేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను.

2సమూయేలు 7:10 – మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి

2సమూయేలు 7:11 – నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును.

2సమూయేలు 7:12 – నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.

2సమూయేలు 7:13 – అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;

Illustrative

-of Christ

యెషయా 4:6 – మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

యోహాను 1:14 – ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

హెబ్రీయులకు 9:8 – దీనినిబట్టి ఆ మొదటి గుడారమింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు.

హెబ్రీయులకు 9:9 – ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.

హెబ్రీయులకు 9:11 – అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా

-of the Church

కీర్తనలు 15:1 – యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?

యెషయా 16:5 – కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.

యెషయా 54:2 – నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.

హెబ్రీయులకు 8:2 – మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.

ప్రకటన 21:2 – మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవునియొద్దనుండి దిగివచ్చుట చూచితిని.

ప్రకటన 21:3 – అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

-of the body

2కొరిందీయులకు 5:1 – భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.

2పేతురు 1:13 – మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చునని యెరిగి,

– (The holy of holies,) of heaven

హెబ్రీయులకు 6:19 – ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.

హెబ్రీయులకు 6:20 – నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.

హెబ్రీయులకు 9:12 – మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

హెబ్రీయులకు 9:24 – అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలొకమందే ప్రవేశించెను

హెబ్రీయులకు 10:19 – సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,

– (The vail,) of Christ’s body

హెబ్రీయులకు 10:20 – ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

– (The vail,) of the obscurity of the Mosaic age

హెబ్రీయులకు 9:8 – దీనినిబట్టి ఆ మొదటి గుడారమింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు.

హెబ్రీయులకు 9:10 – ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి.

రోమీయులకు 16:25 – సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారముగాను,

రోమీయులకు 16:26 – యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును

ప్రకటన 11:19 – మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.