Display Topic


H758

Originally included Mesopotamia

ఆదికాండము 25:20 – ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.

ఆదికాండము 28:5 – యాకోబును పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.

ద్వితియోపదేశాకాండము 26:5 – నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు; అతడు ఐగుప్తునకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను.

అపోస్తలులకార్యములు 7:2 – అందుకు స్తెఫను చెప్పినదేమనగా సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై

More properly the country around Damascus

2సమూయేలు 8:6 – దమస్కు వశముననున్న సిరియదేశమందు దండును ఉంచగా, సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.

Damascus the capital of

యెషయా 7:8 – దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీను రాజు; అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును.

Abana and Pharpar rivers of

2రాజులు 5:12 – దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను.

Governed by kings

1రాజులు 22:31 – సరియారాజు తన రథములమీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు; ఇశ్రాయేలురాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా

2రాజులు 5:1 – సిరియా రాజు సైన్యాధిపతియైన నయమాను అను నొకడుండెను. అతనిచేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసియుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహా పరాక్రమశాలియై యుండెను గాని అతడు కుష్ఠ రోగి.

Inhabitants of

-Called Syrians

2సమూయేలు 10:11 – అబీషైకి అప్పగించి సిరియనుల బలము నాకు మించినయెడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించినయెడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తనవారిని వ్యూహపరచెను.

2రాజులు 5:20 – అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన యీ నయమాను తీసికొనివచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొనిపోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందుననుకొని

-Called Syrians of Damascus

2సమూయేలు 8:5 – మరియు దమస్కులోనున్న సిరియనులు సోబా రాజగు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరువదిరెండు వేలమందిని ఓడించి

-An Idolatrous people

న్యాయాధిపతులు 10:6 – ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్‌ ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజిం చుచువచ్చిరి.

2రాజులు 5:18 – నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నాచేతిమీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారముచేసిన సంగతినిగూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని

-A Warlike people

1రాజులు 20:23 – అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఈలాగు మనవి చేసిరి వారి దేవతలు కొండదేవతలు గనుక వారు మనకంటె బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసినయెడల నిశ్చయముగా వారిని గెలుచుదుము.

1రాజులు 20:25 – నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును, గుఱ్ఱములకు గుఱ్ఱములను రథములకు రథములను లెక్కించి పోగుచేయుము; అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసినయెడల అవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవిచేయగా అతడు వారు చెప్పినమాట విని ఆ ప్రకారము చేసెను.

-A Commercial people

యెహెజ్కేలు 27:18 – దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులును కొనుక్కొందురు.

-Spoke the Syriack language

2రాజులు 18:26 – హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా

ఎజ్రా 4:7 – అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ యుత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది.

దానియేలు 2:4 – కల్దీయులు సిరియా బాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.

Israel followed the idolatry of

న్యాయాధిపతులు 10:6 – ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్‌ ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజిం చుచువచ్చిరి.

David

-destroyed the army of, which assisted Hadadezer

2సమూయేలు 8:5 – మరియు దమస్కులోనున్న సిరియనులు సోబా రాజగు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరువదిరెండు వేలమందిని ఓడించి

-Garrisoned and made tributary

2సమూయేలు 8:6 – దమస్కు వశముననున్న సిరియదేశమందు దండును ఉంచగా, సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.

-dedicated the Spoils of

2సమూయేలు 8:11 – రాజైన దావీదు తాను జయించిన జనములయొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటినిచేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను.

2సమూయేలు 8:12 – వాటిని అతడు సిరియనుల యొద్దనుండియు మోయాబీయుల యొద్దనుండియు అమ్మోనీయుల యొద్దనుండియు ఫిలిష్తీయుల యొద్దనుండియు అమాలేకీయుల యొద్దనుండియు రెహోబు కుమారుడగు హదదెజెరు అను సోబా రాజునొద్దనుండియు పట్టుకొనియుండెను.

-Obtained renown by His victory over

2సమూయేలు 8:13 – దావీదు ఉప్పు లోయలో సిరియనులగు పదునెనిమిది వేలమందిని హతము చేసి తిరిగిరాగా అతని పేరు ప్రసిద్ధమాయెను.

-sent Joab against the armies of, Hired by the Ammonites

2సమూయేలు 10:6 – దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి, బేత్రెహోబుతోను అరాము సోబాతోను చేరిన సిరియనులలోనుండి యిరువదివేల మంది కాల్బలమును, మయకా రాజు నొద్దనుండి వెయ్యిమంది బంటులను, టోబులోనుండి పండ్రెండు వేలమంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి.

2సమూయేలు 10:7 – దావీదు ఈ సంగతి విని, యోవాబును శూరుల దండంతటిని పంపెను.

2సమూయేలు 10:8 – అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధపంక్తులు తీర్చిరి. సోబా సిరియనులును రెహోబు సిరియనులును మయకావారును టోబువారును విడిగా పొలములో నిలిచిరి.

2సమూయేలు 10:9 – యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధపంక్తులు తీర్చియుండుట చూచి, ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను.

2సమూయేలు 10:10 – అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలినవారిని తన సహోదరుడగు

2సమూయేలు 10:11 – అబీషైకి అప్పగించి సిరియనుల బలము నాకు మించినయెడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించినయెడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తనవారిని వ్యూహపరచెను.

2సమూయేలు 10:12 – అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము, తన దృష్టికి ఏది యనుకూలమో యెహోవా దానిని చేయును గాక అని అబీషైతో చెప్పి

2సమూయేలు 10:13 – యోవాబును అతనితోకూడ నున్నవారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని యెదుట నిలువజాలక పారిపోయిరి.

2సమూయేలు 10:14 – సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై యెదుట నిలువలేక పారిపోయి పట్టణములో చొరబడగా, యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను.

-destroyed A second army of

2సమూయేలు 10:15 – అయితే సిరియనులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని తెలిసికొని గుంపుకూడిరి.

2సమూయేలు 10:16 – హదదెజరు నదియవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి.

2సమూయేలు 10:17 – హదదెజరు సైన్యాధిపతియగు షోబకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చి యొర్దానునది దాటి హేలామునకు వచ్చెను.

2సమూయేలు 10:18 – సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొనవచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల యెదుట నిలువజాలక పారిపోగా, దావీదు సిరియనులలో ఏడు వందలమంది రథికులను నలువదివేల మంది గుఱ్ఱపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను.

2సమూయేలు 10:19 – హదదెజరునకు సేవకులగు రాజులందరు తాము ఇశ్రాయేలీయుల యెదుట నిలువలేకుండ కొట్టబడియుండుట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయుట మానిరి.

Asa sought aid of, against Israel

1రాజులు 15:18 – కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరుయొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులచేతి కప్పగించి, హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునైయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా

1రాజులు 15:19 – నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగియుండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను; నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయెషా నాయొద్దనుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను.

1రాజులు 15:20 – కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును దానును ఆబేల్బేత్మయకాను కిన్నెరెతును నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లపెట్టెను.

Elijah anointed Hazael king over, by divine direction

1రాజులు 19:15 – అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్యమార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము;

Benhadad king of, besieged Samaria

1రాజులు 20:1 – తనయొద్ద గుఱ్ఱములను రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడివేసి దానిమీద యుద్ధము చేసెను.

1రాజులు 20:2 – అతడు పట్టణమందున్న ఇశ్రాయేలురాజైన అహాబునొద్దకు దూతలను పంపి

1రాజులు 20:3 – నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యముగలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారిచేత వర్తమానము తెలియజేసెను.

1రాజులు 20:4 – అందుకు ఇశ్రాయేలు రాజు నా యేలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా

1రాజులు 20:5 – ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగివచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీయొద్దకు నా సేవకులను పంపియున్నాను.

1రాజులు 20:6 – రేపు ఈ వేళకు వారు నీ యింటిని నీ సేవకుల యిండ్లను పరిశోధించుదురు; అప్పుడు నీ కంటికి ఏది యింపుగా నుండునో దానిని వారు చేతపట్టుకొని తీసికొనిపోవుదురు.

1రాజులు 20:7 – కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలనందరిని పిలువనంపించి బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు; ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలిసికొనుడనెను.

1రాజులు 20:8 – నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలును జనులందరును అతనితో చెప్పిరి,

1రాజులు 20:9 – గనుక అతడు మీరు రాజైన నా యేలినవానితో తెలియజెప్పవలసినదేమనగా నీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని, నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా

1రాజులు 20:10 – బెన్హదదు మరల అతనియొద్దకు దూతలను పంపి నాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొనిపోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను.

1రాజులు 20:11 – అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసివేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.

1రాజులు 20:12 – బన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరిగించుకొనుచుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా

The Israelites

-under Ahab Encouraged and assisted by God, Overcame

1రాజులు 20:13 – ప్రవక్తయైన యొకడు ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే; నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీచేతి కప్పగించెదను.

1రాజులు 20:14 – ఇది యెవరిచేత జరుగునని అహాబు అడుగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యౌవనులచేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడు నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను.

1రాజులు 20:15 – వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్కచూడగా వారు రెండువందల ముప్పది ఇద్దరైరి. తరువాత జనులను, అనగా ఇశ్రాయేలు వారినందరిని లెక్కింపగా వారు ఏడువేల మందియైరి.

1రాజులు 20:16 – మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ ముప్పది ఇద్దరు రాజులును గుడారములలో త్రాగి మత్తులైయుండిరి.

1రాజులు 20:17 – రాజ్యాధిపతులలోనున్న ఆ యౌవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలిసికొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోనులోనుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా

1రాజులు 20:18 – అతడువారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొనిరండని ఆజ్ఞాపించెను.

1రాజులు 20:19 – రాజ్యాధిపతులలోనున్న ఆ యౌవనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి

1రాజులు 20:20 – ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొనిపోయెను.

-Forewarned of Invasion by, at the return of the year

1రాజులు 20:22 – అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి యుండుము, ఏడాదినాటికి సిరియారాజు నీమీదికి మరల వచ్చునని అతనితో చెప్పెను.

1రాజులు 20:23 – అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఈలాగు మనవి చేసిరి వారి దేవతలు కొండదేవతలు గనుక వారు మనకంటె బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసినయెడల నిశ్చయముగా వారిని గెలుచుదుము.

1రాజులు 20:24 – ఇందుకు మీరు చేయవలసినదేమనగా, ఆ రాజులలో ఒక్కొకని వాని వాని ఆధిపత్యములోనుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి

1రాజులు 20:25 – నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును, గుఱ్ఱములకు గుఱ్ఱములను రథములకు రథములను లెక్కించి పోగుచేయుము; అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసినయెడల అవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవిచేయగా అతడు వారు చెప్పినమాట విని ఆ ప్రకారము చేసెను.

-Insignificant before

1రాజులు 20:26 – కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్కచూచి బయలుదేరి పోయి ఇశ్రాయేలువారితో యుద్ధము చేయుటకై ఆఫెకునకు వచ్చెను.

1రాజులు 20:27 – ఇశ్రాయేలు వారందరును పోగుచేయబడి సిద్ధమైవారిని ఎదిరింప బయలుదేరిరి. ఇశ్రాయేలువారు మేకపిల్లల మందలు రెంటివలె వారియెదుట దిగియుండిరి గాని దేశము సిరియనులచేత కప్పబడియుండెను.

-Encouraged and assisted by God Overcame A second Time

1రాజులు 20:28 – అప్పుడు దైవజనుడైన యొకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను యెహోవా సెలవిచ్చునదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడేగాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు; అయితే నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు ఈ గొప్ప సమూహమంతయు నీచేతికి అప్పగించెదను.

1రాజులు 20:29 – వారు ఎదురుముఖములుగా ఏడుదినములు గుడారములు వేసికొని యుండినతరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలిసికొనగా ఇశ్రాయేలువారు ఒక దినమందే సిరియనుల కాల్బలము లక్షమందిని హతముచేసిరి.

1రాజులు 20:30 – తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న యొక ప్రాకారము శేషించినవారిలో ఇరువదియేడు వేలమంది మీదపడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ యా గదులలో చొరగా

-Craftily Drawn into A league with

1రాజులు 20:31 – అతని సేవకులు ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైనయెడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసికొని ఇశ్రాయేలు రాజునొద్దకు పోవుదుము; అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను.

1రాజులు 20:32 – కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసికొని ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రదుకనిమ్మని మనవిచేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై యున్నాడా అని యడిగెను.

1రాజులు 20:33 – అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఏలాగుననున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటనుబట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్లి అతనిని తోడుకొని రండనెను. బెన్హదదు తనయొద్దకు రాగా అతడు తన రథముమీద అతని ఎక్కించుకొనెను.

1రాజులు 20:34 – అంతట బెన్హదదు తమ తండ్రిచేతిలోనుండి నా తండ్రి తీసికొనిన పట్టణములను నేను మరల అప్పగించెదను; మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమకొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా అహాబు ఈ ప్రకారముగా నీతో సంధిచేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధిచేసి అతని పోనిచ్చెను.

1రాజులు 20:35 – అంతట ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞచేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు

1రాజులు 20:36 – అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్లిపోగానే సింహమొకటి అతనికి ఎదురై అతనిని చంపెను.

1రాజులు 20:37 – తరువాత మరియొకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరచెను.

1రాజులు 20:38 – అప్పుడు ఆ ప్రవక్త పోయి, కండ్లమీద పాగా కట్టుకొని మారు వేషము వేసికొని, మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని యుండి

1రాజులు 20:39 – రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేసికొనెను నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయియుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నాయొద్దకు తోడుకొని వచ్చి యీ మనుష్యుని కనిపెట్టుము; ఏ విధముగానైనను వాడు తప్పించుకొని పోయినయెడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును; లేదా నీవు రెండు మణుగుల వెండిని ఇయ్యవలెననెను.

1రాజులు 20:40 – అయితే నీ దాసుడనైన నేను పనిమీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు నీకు నీవే తీర్పు తీర్బుకొంటివి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవియ్యగా

1రాజులు 20:41 – అతడు త్వరపడి తన కండ్లమీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను.

1రాజులు 20:42 – అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చునదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీచేతిలోనుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింపబడుదురని రాజుతో అనగా

1రాజులు 20:43 – ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనినవాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను.

-at peace with, for Three years

1రాజులు 22:1 – సిరియనులును ఇశ్రాయేలువారును మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి.

-under Ahab sought to recover Ramoth-gilead from

1రాజులు 22:3 – ఇశ్రాయేలురాజు తన సేవకులను పిలిపించి రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు; అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాని తీసికొనక ఊరకున్నామని చెప్పి

1రాజులు 22:4 – యుద్ధము చేయుటకు నాతోకూడ నీవు రామోత్గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు నేను నీవాడనే; నా జనులు నీ జనులే నా గుఱ్ఱములును నీ గుఱ్ఱములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను.

1రాజులు 22:5 – పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవాయొద్ద విచారణ చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా

1రాజులు 22:6 – ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారినడిగెను. అందుకు యెహోవా దానిని రాజైన నీచేతికి అప్పగించును గనుక

1రాజులు 22:7 – పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను.

1రాజులు 22:8 – అందుకు ఇశ్రాయేలు రాజు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతురాజైన మీరు ఆలాగనవద్దనెను.

1రాజులు 22:9 – అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచి ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను.

1రాజులు 22:10 – ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాలస్థలమందు గద్దెలమీద ఆసీనులైయుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా

1రాజులు 22:11 – కెనయనా కుమారుడైన సిద్కియా యినుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.

1రాజులు 22:12 – ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచు యెహోవా రామోత్గిలాదును రాజవైన నీచేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి.

1రాజులు 22:13 – మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా

1రాజులు 22:14 – మీకాయా యెహోవా నాకు సెలవిచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదుననెను.

1రాజులు 22:15 – అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదుమీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడు యెహోవా దానిని రాజవైన నీచేతికి నప్పగించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను.

1రాజులు 22:16 – అందుకు రాజు నీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా

1రాజులు 22:17 – అతడు ఇశ్రాయేలీయులందరును కాపరిలేని గొఱ్ఱలవలెనే కొండలమీద చెదరియుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు; ఎవరి యింటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను.

1రాజులు 22:18 – అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి ఇతడు నన్నుగూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా

1రాజులు 22:19 – మీకాయా యిట్లనెను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని

1రాజులు 22:20 – అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి.

1రాజులు 22:21 – అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.

1రాజులు 22:22 – అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.

1రాజులు 22:23 – యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.

1రాజులు 22:24 – మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను.

1రాజులు 22:25 – అందుకు మీకాయా దాగుకొనుటకై నీవు ఆ యా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను.

1రాజులు 22:26 – అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను పట్టుకొని తీసికొనిపోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి

1రాజులు 22:27 – బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను.

1రాజులు 22:28 – అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించుడని చెప్పెను రాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు.

1రాజులు 22:29 – ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా

-defeated by, and Ahab slain

1రాజులు 22:30 – ఇశ్రాయేలు రాజు నేను మారువేషము వేసికొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసికొని యుద్ధమందు ప్రవేశించెను.

1రాజులు 22:31 – సరియారాజు తన రథములమీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు; ఇశ్రాయేలురాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా

1రాజులు 22:32 – రథాధిపతులు యెహోషాపాతును చూచి యితడే ఇశ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలువేయగా

1రాజులు 22:33 – రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజు కానట్టు గురుతుపట్టి అతని తరుముట మానివేసిరి.

1రాజులు 22:34 – పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపుకీలు మధ్యను తగిలెను గనుక అతడునాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను.

1రాజులు 22:35 – నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల యెదుట అతని రథముమీద నిలువబెట్టిరి; అస్తమయమందు అతడు మరణమాయెను; తగిలిన గాయములోనుండి అతని రక్తము కారి రథములో మడుగుగట్టెను.

1రాజులు 22:36 – సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లిపోవచ్చునని ప్రచురమాయెను.

-Harassed by frequent incursions of

2రాజులు 5:2 – సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశముమీదికి పోయియుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను.

2రాజులు 6:23 – అతడు వారికొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానునియొద్దకు పోయిరి. అప్పటినుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను.

-heard the secrets of, from Elisha

2రాజులు 6:8 – సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచనచేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను.

2రాజులు 6:9 – అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక

2రాజులు 6:10 – ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలిసికొని తనవారిని రక్షించుకొనెను. ఈలాగు మాటిమాటికి జరుగుచు వచ్చినందున

2రాజులు 6:11 – సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారి నడుగగా

2రాజులు 6:12 – అతని సేవకులలో ఒకడు రాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను.

God smote with blindness those sent against Elisha by the king of

2రాజులు 6:14 – కాబట్టి రాజు అచ్చటికి గుఱ్ఱములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా

2రాజులు 6:18 – ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థనచొప్పున వారిని అంధత్వముతో మొత్తెను.

2రాజులు 6:19 – అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినయెడల మీరు వెదకువానియొద్దకు మిమ్మును తీసికొనిపోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను.

2రాజులు 6:20 – వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.

Besieged Samaria again

2రాజులు 6:24 – అటుతరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడివేసెను.

2రాజులు 6:25 – అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగియుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మబడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.

2రాజులు 6:26 – అంతట ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారముమీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని

2రాజులు 6:27 – యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడనుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండి యైనను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి

2రాజులు 6:28 – నీ విచారమునకు కారణమేమని యడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు

2రాజులు 6:29 – మేము నా బిడ్డను వంటచేసికొని తింటివిు. అయితే మరునాటియందు నేను దాని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను.

Army of, miraculously routed

2రాజులు 7:5 – సందెచీకటియందు సిరియనుల దండుపేటలోనికి పోవలెనని లేచి, సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయిరి.

2రాజులు 7:6 – యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా వారు మనమీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని

Death of the king of, and the cruelty of his successor foretold by Elisha

2రాజులు 8:7 – ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగియైయుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని

2రాజులు 8:15 – అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసికొని నీటిలో ముంచి రాజు ముఖముమీద పరచగా అతడు చచ్చెను; అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను.

Joram king of Israel in seeking to recover Ramothgilead from, severely wounded

2రాజులు 8:28 – అతడు అహాబు కుమారుడైన యెహోరాముతోకూడ రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధముచేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరచిరి.

2రాజులు 8:29 – రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనులవలన తాను పొందిన గాయములను బాగుచేసికొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగిరాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగియాయెనని తెలిసికొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను.

2రాజులు 9:15 – అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనులవలన తాను పొందిన గాయములను బాగు చేసికొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగివచ్చియుండెను. అంతట యెహూ నీకనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండునట్లు ఈ పట్టణములోనుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుమని ఆజ్ఞ ఇచ్చి

Israel delivered into the hands of, for the sins of Jehoahaz

2రాజులు 13:3 – కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలువారిమీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలువారిని వారికప్పగించెను.

2రాజులు 13:7 – రౌతులలో ఏబదిమందియు రథములలో పదియు కాల్బలములో పదివేలమందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి; మిగిలినవారిని సిరియా రాజు దుళ్లకొట్టిన ధూళివలె నాశనము చేసియుండెను.

2రాజులు 13:22 – యెహోయాహాజు దినములన్నియు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.

A saviour raised up for Israel against

2రాజులు 13:5 – కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొని మునుపటివలె స్వస్థానములలో కాపురముండిరి.

2రాజులు 13:23 – గాని యెహోవా వారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టకయుండెను.

2రాజులు 13:24 – సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను.

2రాజులు 13:25 – అంతట యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యెహోయాహాజు చేతిలోనుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసికొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకొనెను.

Elisha predicted to Joash his three victories over

2రాజులు 13:14 – అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడైయుండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతనియొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.

2రాజులు 13:15 – అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసికొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసికొనెను.

2రాజులు 13:16 – నీ చెయ్యి వింటిమీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటిమీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతులమీద వేసి

2రాజులు 13:17 – తూర్పువైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనులచేతిలోనుండి మిమ్మును రక్షించు బాణము; సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువని చెప్పి,

2రాజులు 13:18 – బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతట అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను.

2రాజులు 13:19 – అందు నిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి నీవు అయిదు మారులైన ఆరు మారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.

Joined with Israel against Ahaz and besieged Jerusalem

2రాజులు 16:5 – సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేముమీదికి యుద్ధమునకువచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడివేసిరి గాని అతనిని జయింపలేకపోయిరి.

యెషయా 7:12 – ఆహాజు నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా

Retook Elath and drove out the Jews

2రాజులు 16:6 – ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.

Subdued and its inhabitants taken captive by Assyria

2రాజులు 16:9 – అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి, దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని, రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొనిపోయెను.

Prophecies respecting

-Destruction of Rezin king of

యెషయా 7:8 – దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీను రాజు; అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును.

యెషయా 7:16 – కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును.

-Ceasing to be A kingdom

యెషయా 17:1 – దమస్కునుగూర్చిన దేవోక్తి

యెషయా 17:2 – దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను అది పాడై దిబ్బగానగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును.

యెషయా 17:3 – ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండును ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలోనుండి శేషించినవారికి జరుగును సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు.

-Terror and Dismay in, occasioned by its Invasion

యిర్మియా 49:23 – దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదు దానికి నెమ్మదిలేదు.

యిర్మియా 49:24 – దమస్కు బలహీనమాయెను. పారిపోవలెనని అది వెనుకతీయుచున్నది వణకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను.

-Destruction of its inhabitants

యిర్మియా 49:26 – ఆమె యౌవనులు ఆమె వీధులలో కూలుదురు ఆ దినమున యోధులందరు మౌనులైయుందురు ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.

-Plundering of Damascus

యెషయా 8:4 – ఈ బాలుడు నాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కుయొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడుసొమ్మును ఎత్తికొని పోవుదురనెను.

-burning of Damascus

యిర్మియా 49:27 – నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను అది బెన్హదదు నగరులను కాల్చివేయును.

ఆమోసు 1:4 – నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును;

-its calamities, the punishments of its sins

ఆమోసు 1:3 – యెహోవా సెలవిచ్చునదేమనగా దమస్కు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.

-its inhabitants to be captives

ఆమోసు 1:3 – యెహోవా సెలవిచ్చునదేమనగా దమస్కు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.

-its history in connection with the Macedonia empire

దానియేలు 11:6 – కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధానపడవలెనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు; అతడైనను అతని భుజబలమైనను నిలువదు; వారు ఆమెను, ఆమెను తీసికొని వచ్చిన వారిని, ఆమెను కనినవారిని, ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగించెదరు.

దానియేలు 11:7 – అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతియై ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి యిష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును

దానియేలు 11:8 – మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును.

దానియేలు 11:9 – అతడు దక్షిణ దేశపు రాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును.

దానియేలు 11:10 – అతని కుమారులు యుద్ధము చేయబూని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి యేరువలె ప్రవహించి ఉప్పొంగును; యుద్ధము చేయబూని కోటదనుక వచ్చును.

దానియేలు 11:11 – అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును; ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును.

దానియేలు 11:12 – ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును; వేలకొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు.

దానియేలు 11:13 – ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యముకంటె ఇంక గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరల వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును.

దానియేలు 11:14 – ఆ కాలములయందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు.

దానియేలు 11:15 – అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడిదిబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేక పోయినందునను, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందక పోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనును.

దానియేలు 11:16 – వచ్చినవాని కెదురుగా ఎవరును నిలువలేక పోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందముగల ఆ దేశములో అతడుండగా అది అతని బలమువలన పాడైపోవును.

దానియేలు 11:17 – అతడు తన రాజ్యము యొక్క సమస్త బలమును కూర్చుకొని రావలెనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును; ఏమనగా నశింపజేయవచ్చునని యొక కుమార్తెను అతని కిచ్చెదరు, అయితే ఆమె సమ్మతింపక అతని కలిసికొనదు.

దానియేలు 11:18 – అతడు ద్వీపముల జనములతట్టు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును. అయితే అతనివలన కలిగిన యవమానమును ఒక యధికారి నివారణ చేయును. మరియు ఆయన యవమానము అతని మీదికి మరల వచ్చునట్లు చేయును, అది అతనికి రాక తప్పదు.

దానియేలు 11:19 – అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటలతట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును.

దానియేలు 11:20 – అతనికి మారుగా మరియొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వానిని లేపును; కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని యీ నాశనము ఆగ్రహమువలననైనను యుద్ధమువలననైనను కలుగదు.

దానియేలు 11:21 – అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును; అతనికి రాజ్యఘనత నియ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి యిచ్చకపు మాటలచేత రాజ్యమును అపహరించును.

దానియేలు 11:22 – ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలన వారు నాశనమగుదురు; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును.

దానియేలు 11:23 – అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్పజనము గలవాడైనను ఎదురాడి బలము పొందును.

దానియేలు 11:24 – అతడు సమాధాన క్షేమముగల దేశమునకు వచ్చి, తన పితరులు కాని తన పితరుల పితరులు గాని చేయని దానిని చేయును; ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తనవారికి పంచిపెట్టును. అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్రచేయును

దానియేలు 11:25 – అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును.

దానియేలు 11:26 – ఏమనగా, అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు; మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు.

దానియేలు 11:27 – కీడు చేయుటకై ఆ యిద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని, యేకభోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములాడెదరు; నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు.

దానియేలు 11:28 – అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును. మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధియై యిష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగివచ్చును.

దానియేలు 11:29 – నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదట నున్నట్టుగా కడపటనుండదు.

దానియేలు 11:30 – అంతట కిత్తీయుల ఓడలు అతని మీదికి వచ్చుటవలన అతడు వ్యాకులపడి మరలి, పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహము గలవాడై, తన యిష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును.

దానియేలు 11:31 – అతని పక్షమున శూరులు లేచి, పరిశుద్ధస్థలపు కోటను అపవిత్రపరచి, అనుదిన బలి నిలిపివేసి, నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు.

దానియేలు 11:32 – అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు.

దానియేలు 11:33 – జనములో బుద్ధిమంతులు ఆనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గమువలనను అగ్నివలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు.

దానియేలు 11:34 – వారు క్రుంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును, అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని

దానియేలు 11:35 – నిర్ణయకాలము ఇంక రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు.

దానియేలు 11:36 – ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగువరకు వృద్ధిపొందును; అంతట నిర్ణయించినది జరుగును.

దానియేలు 11:37 – అతడు అందరికంటె ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు; మరియు స్త్రీలకాంక్షితా దేవతను గాని, యే దేవతను గాని లక్ష్యపెట్టడు.

దానియేలు 11:38 – అతడు తన పితరులెరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును; బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి, ఆ దేవతను ఘనపరచును.

దానియేలు 11:39 – మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసికొని, కోటలకు ప్రాకారములు కట్టించి, నూతన విధముగా తనవారికి మహా ఘనత కలుగజేయును; దేశమును క్రయమునకు విభజించి యిచ్చి అనేకుల మీద తనవారికి ప్రభుత్వమిచ్చును.

దానియేలు 11:40 – అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును. మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుఱ్ఱపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతని మీదపడి దేశముల మీదుగా ప్రవాహమువలె వెళ్లును.

దానియేలు 11:41 – అతడు ఆనందదేశమున ప్రవేశించుటవలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులలో ముఖ్యులును అతనిచేతిలోనుండి తప్పించుకొనెదరు.

దానియేలు 11:42 – అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించుకొననేరదు.

దానియేలు 11:43 – అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటిని వశపరచుకొని, లుబీయులను కూషీయులను తనకు పాదసేవకులుగా చేయును.

దానియేలు 11:44 – అంతట తూర్పునుండియు ఉత్తరమునుండియు వర్తమానములు వచ్చి యతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడుచేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును.

దానియేలు 11:45 – కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములుగల పర్వతమునకును మధ్య వేయును; అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చేయువాడెవడును లేకపోవును.

Subdued and governed by the Romans

లూకా 2:2 – ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.

Gospel preached and many churches founded in

అపోస్తలులకార్యములు 15:23 – వీరు వ్రాసి, వారిచేత పంపినదేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము.

అపోస్తలులకార్యములు 15:41 – సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.