Display Topic
Inhabits woods
2రాజులు 2:24 – అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చివేసెను.
Described as
-Voracious
దానియేలు 7:5 – రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి.
-Cunning
విలాపవాక్యములు 3:10 – నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటివలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు
-Cruel
ఆమోసు 5:19 – ఒకడు సింహము నొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.
Often attacks men
2రాజులు 2:24 – అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చివేసెను.
ఆమోసు 5:19 – ఒకడు సింహము నొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.
Attacks the flock in the presence of the shepherd
1సమూయేలు 17:34 – అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱపిల్లను ఎత్తికొని పోవుచుండగ.
Particularly fierce when deprived of its young
2సమూయేలు 17:8 – నీ తండ్రియు అతని పక్షమున నున్నవారును మహా బలాఢ్యులనియు, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంట్ల వంటివారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియును. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడ బసచేయడు.
సామెతలు 17:12 – పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు
Growls when annoyed
యెషయా 59:11 – మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది
Miraculously killed by David
1సమూయేలు 17:36 – మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు,
1సమూయేలు 17:37 – సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు పొమ్ము; యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను.
Illustrative of
-God in His judgments
విలాపవాక్యములు 3:10 – నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటివలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు
హోషేయ 13:8 – పిల్లలు పోయిన యెలుగుబంటి యొకనిమీద పడునట్టు నేను వారిమీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును; ఆడుసింహము ఒకని మింగివేయునట్లు వారిని మింగివేతును; దుష్టమృగములు వారిని చీల్చివేయును.
-the natural Man
యెషయా 11:7 – ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.
-Wicked rulers
సామెతలు 28:15 – బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు.
-the kingdom of the Medes
దానియేలు 7:5 – రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి.
-the kingdom of Antichrist
ప్రకటన 13:2 – నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.